2021 కవాసకి నింజా 300 బుక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేసి వోచర్ పొందండి

జపనీస్ టూవీలర్ కంపెనీ అయిన కవాసకి ఇటీవల భారత మార్కెట్లో తన 2021 నింజా 300 బిఎస్ 6 వెర్షన్ విడుదల చేసింది. అయితే ఈ కొత్త కవాసకి నింజా 300 బిఎస్ 6 బుకింగ్స్ ఇప్పుడు అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు. అమెజాన్ ఇండియా యొక్క వెబ్‌సైట్ లేదా అప్లికేషన్‌లో రూ. 3,000 చెల్లించి వినియోగదారులు ప్రీ-బుకింగ్ వోచర్‌లను కొనుగోలు చేయవచ్చు.

2021 కవాసకి నింజా 300 బుక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేసి వోచర్ పొందండి

ఈ కవాసకి బైక్ కోసం దగ్గరగా ఉన్న డీలర్‌షిప్‌లో వోచర్‌లను రీడీమ్ చేయవచ్చు. బైక్ ధర చెల్లించేటప్పుడు ఈ వోచర్ మొత్తాన్ని తగ్గించబడుతుంది. అయితే డీలర్షిప్ వద్ద, కస్టమర్ వోచర్ యొక్క ఒరిజినల్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది. వోచర్ యొక్క ఫోటోకాపీ లేదా డిజిటల్ ఫోటో దీనికి చెల్లదు.

2021 కవాసకి నింజా 300 బుక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేసి వోచర్ పొందండి

మీరు వోచర్ ద్వారా బైక్ కొనుగోలు చేస్తే వెంటనే డెలివరీకి హామీ ఇవ్వలేమని కంపెనీ అధికారికంగా పేర్కొంది. వోచర్‌ను రీడీమ్ చేసిన తర్వాత, దాన్ని మళ్లీ ఉపయోగించలేరు. ఈ వోచర్ సంస్థ యొక్క అధికారిక డీలర్‌షిప్‌లో మాత్రమే రీడీమ్ చేయబడుతుంది. బుక్ చేసే సమయానికి అనుగుణంగా బైక్ యొక్క కలర్ మరియు తయారీ మారవచ్చని కంపెనీ పేర్కొంది.

MOST READ:హైదరాబాద్‌ నగరంలో 40 మందికి పైగా వాహనదారులు అరెస్ట్.. కారణం ఇదే

2021 కవాసకి నింజా 300 బుక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేసి వోచర్ పొందండి

కవాసకి నింజా 300 బిఎస్ 6 ధర భారతీయ మార్కెట్లో రూ. 3.18 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త బిఎస్ 6 కవాసకి నింజా తన బిఎస్ 4 మోడల్ కంటే రూ. 20,000 అధిక ధరను కలిగి ఉంటుంది. కవాసకి ఇండియా 2019 డిసెంబర్‌లో బిఎస్ 4 మోడల్ అమ్మకాలను నిలిపివేసింది.

2021 కవాసకి నింజా 300 బుక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేసి వోచర్ పొందండి

కొత్త కవాసకి బిఎస్ 6 నింజా 300 యొక్క డిజైన్ విషయంలో పెద్ద మార్పులు చేయబడలేదు. ఈ బైక్ యొక్క డిజైన్ దాదాపు దాని పాత మోడల్ మాదిరిగానే ఉంచబడింది. అయితే, కవాసకి కొత్త నింజా 300 ను కొత్త పెయింట్ స్కీమ్ తో ప్రవేశపెట్టారు. కొత్త కవాసకి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్ తో లభిస్తుంది.

MOST READ:ఒకరిపై ఒకరు కూర్చుని ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేసిన యువతులు [వీడియో]

2021 కవాసకి నింజా 300 బుక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేసి వోచర్ పొందండి

కవాసకి నింజా 300 బిఎస్ 6 బైక్ లో 296 సిసి యొక్క అప్‌గ్రేడ్ ప్యారలల్ ట్విన్ బిఎస్ 6 ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 39 బిహెచ్‌పి పవర్ 27 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ మునుపటి ఎక్కువ పనితీరుని కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్పర్ క్లచ్ కూడా అందుబాటులో ఉంటుంది.

2021 కవాసకి నింజా 300 బుక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేసి వోచర్ పొందండి

ఈ బైక్ యొక్క మొత్తం బరువు ఇప్పుడు 179 కేజీలు. ఇది చాలా దృడంగా ఉంటుంది. నింజా 300 బైక్ లో 17-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఇందులో ఇంతపెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ ఇవ్వడానికి ప్రదహన కారణం, లాంగ్ రైడ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది.

MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

2021 కవాసకి నింజా 300 బుక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేసి వోచర్ పొందండి

కొత్త కవాసకి నింజా 300 బిఎస్ 6 బైక్ లో ఎంఆర్‌ఎఫ్ టైర్లు, స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, ఈ ముందు భాగంలో 290 మిమీ సింగిల్ డిస్క్ మరియు వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్ లభిస్తుంది.

2021 కవాసకి నింజా 300 బుక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేసి వోచర్ పొందండి

కవాసకి భారతదేశంలో అత్యంత సరసమైన 175 సిసి బైక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ 175 సిసి బైక్‌ను కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ స్థానిక మార్కెట్లో తయారు చేయబడుతుంది. ఇది భారతదేశంలో కవాసకి కంపెనీ యొక్క అత్యంత సరసమైన బైక్ కానుంది.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

Most Read Articles

English summary
Kawasaki Ninja 300 Pre-Bookings Open On Amazon India. Read in Telugu.
Story first published: Thursday, March 25, 2021, 9:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X