Just In
- 10 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 3 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
Don't Miss
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Sports
ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ 2021పై బీసీసీఐ పునరాలోచన! తెరపైకి ప్లాన్-బి!
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కవాసకి నుండి రెండు కొత్త మోటార్‌సైకిళ్లు వస్తున్నాయ్.. టీజర్ విడుదల
జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసకి భారత మార్కెట్లో రెండు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ తమ సోషల్ మీడియా హ్యాండిల్‌పై ఓ కొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది.

ఈ టీజర్ వీడియోలో 'రైడ్ విత్ ప్యాషన్, న్యూ ఏజ్ సెన్సేషన్' అనే క్యాప్షన్‌తో కంపెనీ ఓ రెండు స్పోర్ట్స్ బైక్‌లను టీజ్ చేసింది. దేశంలో బిఎస్6 కాలుష్య నిబంధనలు కఠినతరం చేశాక, కవాసకి తమ ఉత్పత్తులను ఒక్కొక్కటిగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది.

అయితే, కొత్తగా కవాసకి విడుదల చేయనున్న ఈ రెండు మోటార్‌సైకిళ్ల గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ, వీటిలో ఒకటి ఖచ్చితంగా 'కవాసకి నింజా 300' యొక్క లేటెస్ట్ బిఎస్6 వెర్షన్ అని మాత్రం తెలుస్తోంది.

కవాసకి బ్రాండ్ నుండి దేశంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిళ్లలో నింజా 300 కూడా ఒకటి. ఈ కొత్త 2021 మోడల్ నింజా 300 మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే, సరికొత్త బాడీ గ్రాఫిక్స్, మైనర్ డిజైన్ అప్‌గ్రేడ్స్‌తో వస్తుందని అంచనా.

ఇదివరకటి మోడల్‌లో కనిపించినట్లుగా ఫ్రంట్ ఫెయిరింగ్‌పైనే అమర్చిన ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ టర్న్ ఇండికేటర్స్, ట్విన్-పాడ్ హెడ్‌లైట్ సెటప్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, స్ప్లిట్ స్టైల్ సీట్స్ వంటి అనేక డిజైన్ ఎలిమెంట్స్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

ఇంజన్ విషయానికి, మునుపటి కవాసకి నింజా 300లో ఉపయోగించిన 296 సిసి, లిక్విడ్-కూల్డ్, పారలల్-ట్విన్ ఇంజన్ గరిష్టంగా 38.4 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ బిఎస్6 అప్‌గ్రేడ్ కారణంగా ఈ గణాంకాల్లో స్వల్ప మార్పు ఉండే అవకాశం ఉంది.

ఈ ఇంజన్ స్లిప్పర్ క్లచ్‌తో కూడిన సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కొత్త 2021 మోడల్ కవాసకి నింజా 300 ఇప్పుడు కవాసకి బ్రాండ్ యొక్క డెడికేటెడ్ 'రైడాలజీ' కనెక్టివిటీ అప్లికేషన్‌తో వచ్చే అవకాశం ఉంది.

ఈ అప్లికేషన్ బ్లూటూత్-కనెక్టెవిటీ ఫీచర్‌ను కలిగి ఉండి, రైడర్ తన స్మార్ట్‌ఫోన్ సాయంతో మోటార్‌సైకిల్‌కు రిమోట్‌గా కనెక్టయ్యి, వివిధ రకాల సమాచారాన్ని పొందేందుకు సహకరిస్తుంది. ఈ బైక్‌లో కొత్తగా చేసిన అప్‌గ్రేడ్స్ కారణంగా, దీని ధర కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది.

గతంలో బిఎస్4 వెర్షన్ కవాసకి నింజా 300 మోటార్‌సైకిల్‌ను రూ.2.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)లకు విక్రయించేవారు. కాగా, ఈ కొత్త 2021 మోడల్ కవాసకి నింజా 300 ధర సుమారు రూ.3.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

అప్‌గ్రేడెడ్ కవాసకి నింజా 300 మోటార్‌సైకిల్ కోసం ఇప్పటికే కొన్ని డీలర్‌షిప్ కేంద్రాలు అనధికారిక బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మోడల్‌లో ఉపయోగించే భాగాలను స్థానికంగా సమీకరించడం ద్వారా కంపెనీ ఈ మోటార్‌సైకిల్ ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని చూస్తోంది.

కాగా, ఈ టీజర్ ఫొటోలో కవాసకి పేర్కొన్న రెండవ మోటార్‌సైకిల్‌కు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. అయితే, రానున్న వారాల్లో దీనికి సంబంధించి కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది. బహుశా ఇది పూర్తిగా సరికొత్త మోడల్ అయి ఉంటుందని అంచనా.