2021 కవాసకి నింజా ZX-25R స్పోర్ట్స్ బైక్, ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా..
ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి, తన 2021 నింజా జెడ్‌ఎక్స్-25ఆర్ బైక్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త బైక్ లో కంపెనీ మునుపటికంటే ఎక్కువ అప్డేట్స్ ప్రవేశపెట్టింది. ఈ 2021 కవాసకి జెడ్‌ఎక్స్-25ఆర్ ఇప్పుడు ఇండోనేషియా మార్కెట్లో నాలుగు కొత్త కలర్ ఆప్సన్స్ లో ప్రవేశపెట్టింది. అప్డేటెడ్ నింజా జెడ్‌ఎక్స్-25ఆర్ బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.

కొత్త 2021 కవాసకి నింజా జెడ్‌ఎక్స్-25ఆర్ స్టాండర్డ్ వేరియంట్ మెటాలిక్ స్పార్క్ బ్లాక్ అనే సింగిల్ కలర్ ఆప్సన్ లో అందుబాటులో ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఈ బైక్ లైమ్ గ్రీన్ / ఎబోనీ, మెటాలిక్ స్పార్క్ బ్లాక్ / పెర్ల్ ఫ్లాట్ స్టార్‌డస్ట్ వైట్ మరియు కాండీ ప్లాస్మా బ్లూ / మెటాలిక్ స్పార్క్ బ్లూ అనే డ్యూయల్ టోన్ కలర్ ఆప్సన్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

2021 కవాసకి నింజా జెడ్‌ఎక్స్-25 ఆర్ బైక్, దాని జెడ్‌ఎక్స్-10ఆర్ మాదిరిగానే లైమ్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ఇది వైట్ అండ్ గ్రే కలర్ డెకాల్స్‌తో అలంకరించబడిన రెడ్ కలర్ బాడీ ప్యానెల్‌లను కలిగి ఉంటుంది. ఇది మొత్తానికి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త కవాసకి నింజా జెడ్‌ఎక్స్-25 ఆర్ ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌తో ఉంటుంది. ఈ బైక్ మొదటిసారిగా 2019 టోక్యో మోటార్ షోలో కవాసాకి కనిపించింది. ఈ బైక్ మంచి స్టైల్ కలిగి ఉండటమే కాకుండా, ఇన్-లైన్ ఫోర్ ఇంజిన్ కలిగి ఉండటం వల్ల మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

కొత్త 2021 కవాసకి నింజా జెడ్‌ఎక్స్-25 ఆర్ బైక్‌లో 249 సిసి, లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 15,500 ఆర్‌పిఎమ్ వద్ద 51 బిహెచ్‌పి పవర్ మరియు 14,500 ఆర్‌పిఎమ్ వద్ద 22.9 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ మరియు క్విక్‌షిఫ్టర్ సిస్టమ్‌తో కూడా వస్తుంది.

కొత్త 2021 కవాసకి నింజా జెడ్‌ఎక్స్ 25 ఆర్ ట్విన్ పాడ్‌లో హెడ్‌ల్యాంప్, ఫుల్ ఫెయిరింగ్ మరియు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ బైక్‌లో మజిల్ ట్యాంక్, అండర్బెల్లీ ఎగ్జాస్ట్ మరియు లో సెట్ క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్ వంటివి ఉన్నాయి. ఈ బైక్‌లో 37 మిమీ అప్సైడ్డౌన్ షోవా స్పెషల్ ఫంక్షన్ ఫోర్క్ మరియు రియర్ సస్పెన్షన్ కోసం రియర్ లింక్ సస్పెన్షన్ కలిగి ఉంది.

ఈ బైక్‌లో సేఫ్టీ కోసం ముందు మరియు వెనుక టైర్లలో డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి. ఈ కొత్త బైక్‌లో ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్ అమర్చారు. ఇది అనలాగ్ టాకోమీటర్ మరియు సెమీ డిజిటల్ యూనిట్ సిస్టం కూడా కలిగి ఉంటుంది.

కవాసకి జెడ్‌ఎక్స్ 25 ఆర్ బైక్ లో ఎలక్ట్రానిక్ రైడర్ కూడా ఉంది. వీటిలో డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి. ఇది మంది ఇంధన సామర్త్యాన్ని అందిస్తూ వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ బైక్ దాని మునుపటి వేరియంట్స్ కంటే కూడా ఎక్కువ ధర కలిగి ఉండే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








