భారత్‌లో కొత్త 2021 మోడల్ కవాసకి జెడ్650, వెర్సిస్ 1000 బైక్‌ల విడుదల

ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ కవాసకి, భారత మార్కెట్లో రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. కొత్త 2021 మోడల్ కవాసాకి జెడ్ 650 మరియు కవాసకి వెర్సిస్ 1000 మోటార్‌సైకిళ్లను కంపెనీ విడుదల చేసింది. ఈ రెండు కొత్త మోడళ్లలో అనేక డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి.

భారత్‌లో కొత్త 2021 మోడల్ కవాసకి జెడ్650, వెర్సిస్ 1000 బైక్‌ల విడుదల

కొత్త 2021 కవాసాకి జెడ్ 650 మోటార్‌సైకిల్‌ను రూ.6.04 రీటైల్ ధరతో విక్రయిస్తున్నారు. ఇది మునుపటి తరం మోడల్ కంటే రూ.10,000 ఎక్కువ ధరను కలిగి ఉంది.

భారత్‌లో కొత్త 2021 మోడల్ కవాసకి జెడ్650, వెర్సిస్ 1000 బైక్‌ల విడుదల

ఇకపోతే, కొత్త 2021 కవాసకి వెర్సిస్ 1000 మోటార్‌సైకిల్‌ను రూ.11.19 లక్షల రీటైల్ ధరతో విడుదల చేశారు. ఇది పాత మోడల్ ధర కంటే రూ.20,000 అధికంగా ఉంటుంది (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

MOST READ:బ్రేకింగ్ ; 2021 డాకర్ ర్యాలీ నాల్గవ స్టేజ్‌లో కుప్పకూలిన సిఎస్ సంతోష్

భారత్‌లో కొత్త 2021 మోడల్ కవాసకి జెడ్650, వెర్సిస్ 1000 బైక్‌ల విడుదల

ఈ రెండు మోడళ్లలో ముందుగా 2021 జెడ్650 మోటార్‌సైకిల్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే, ఈ మిడిల్‌వెయిట్ నేక్డ్ స్పోర్ట్స్ బైక్ ఇప్పుడు కొత్త మెటాలిక్ స్పార్క్ బ్లాక్ అనే పెయింట్ స్కీమ్‌తో లభ్యం కానుంది. ఈ కొత్త పెయింట్ స్కీమ్‌లో మోటారుసైకిల్ చుట్టూ గ్రీన్ కలర్ డీటేలింగ్స్ ఉండి, మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

భారత్‌లో కొత్త 2021 మోడల్ కవాసకి జెడ్650, వెర్సిస్ 1000 బైక్‌ల విడుదల

ఈ మోటార్‌సైకిల్‌పై గ్రీన్ కలర్ థీమ్ పొందిన భాగాల్లో హెడ్‌ల్యాంప్ కౌల్, ఫ్యూయెల్ ట్యాంక్ మరియు ట్యాంక్ కవచాలు ఉన్నాయి. అంతేకాకుండా, దీని ఫ్రేమ్ మరియు అల్లాయ్ వీల్స్‌ను కూడా గ్రీన్ కలర్‌లోనే ఫినిష్ చేయబడి ఉంటాయి. ఈ మోటార్‌సైకిల్‌లో కొత్త పెయింట్ స్కీమ్ మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇది మునుపటి మోడల్‌లోని అన్ని ఫీచర్లను క్యారీ చేస్తుంది.

MOST READ:ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

భారత్‌లో కొత్త 2021 మోడల్ కవాసకి జెడ్650, వెర్సిస్ 1000 బైక్‌ల విడుదల

ఈ మిడిల్-వెయిట్ నేక్డ్ మోటార్‌సైకిల్‌లో 649సీసీ లిక్విడ్-కూల్డ్, పారలల్-ట్విన్, ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 67.3 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6,700 ఆర్‌పిఎమ్ వద్ద 64 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో స్లిప్-అసిస్ట్ క్లచ్ ఉండదు.

భారత్‌లో కొత్త 2021 మోడల్ కవాసకి జెడ్650, వెర్సిస్ 1000 బైక్‌ల విడుదల

ఈ నేక్డ్ మోటార్‌సైకిల్‌లోని ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ నుండి టెయిల్ ల్యాంప్ డిజైన్ వరకూ బ్రాండ్ యొక్క ‘సుగోమి' డిజైన్‌ను అనుసరించి రూపొందించారు. ఇందులో 4.3 ఇంచ్ టిఎఫ్‌టి స్క్రీన్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది మరియు ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. అదనపు కనెక్టివిటీ ఫీచర్ల కోసం రైడర్లు కవాసకి అందిస్తున్న ‘రైడాలజీ' స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చు. ఇది మోటార్‌సైకిల్‌కు సంబంధించిన రైడర్ టెలిమెట్రీని వినియోగదారులకు తెలియజేస్తుంది.

MOST READ:ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

భారత్‌లో కొత్త 2021 మోడల్ కవాసకి జెడ్650, వెర్సిస్ 1000 బైక్‌ల విడుదల

ఇక కవాసకి విడుదల చేసిన రెండవ కొత్త మోడల్ 2021 వెర్సిస్ 1000 విషయానికి వస్తే, ఇది బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్. ఇది కొత్త ధరతో పాటుగా కొత్త అప్‌డేట్‌లను కూడా కలిగి ఉంది. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు లేవు. కానీ, సస్పెన్షన్ సెటప్ మరియు ఇంజన్‌లను కొద్దిగా రీట్యూన్ చేశారు.

భారత్‌లో కొత్త 2021 మోడల్ కవాసకి జెడ్650, వెర్సిస్ 1000 బైక్‌ల విడుదల

ముందుగా ఇంజన్ విషయాని వస్తే, కొత్త 2021 కవాసాకి వెర్సిస్ 1000 బిఎస్6 కంప్లైంట్ 1,043 సిసి, లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్-ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 9000 ఆర్‌పిఎమ్ వద్ద 118 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7500 ఆర్‌పిఎమ్ వద్ద 102 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో కూడిన సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులోని రీ-ట్యూన్ చేయబడిన ఇంజన్ ఇప్పుడు ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ఫీచర్లకు అనుగుణంగా మరింత లో-ఎండ్ మరియు మిడ్-రేంజ్ పవర్‌ను అందిస్తుంది.

MOST READ:లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్ ‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

భారత్‌లో కొత్త 2021 మోడల్ కవాసకి జెడ్650, వెర్సిస్ 1000 బైక్‌ల విడుదల

ఈ మోటారుసైకిల్‌లోని సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 150 మిమీ ట్రావెల్‌తో కూడిన 43 మిమీ యుఎస్‌డి (అప్ సైడ్ డౌన్) ఫోర్కులు, వెనుక వైపు 152 మిమీ ట్రావెల్‌తో కూడిన మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. రీబౌండ్ డ్యాంపింగ్ మరియు స్ప్రింగ్ ప్రీలోడ్ కోసం ఈ రెండు యూనిట్లను పూర్తిగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ 2021 మోడల్ వెర్సిస్ 1000 లోని కొత్త సస్పెన్షన్ సెటప్, ఇదివరకటి కన్నా మరింత సున్నితంగా అనిపిస్తుంది.

భారత్‌లో కొత్త 2021 మోడల్ కవాసకి జెడ్650, వెర్సిస్ 1000 బైక్‌ల విడుదల

ఇంకా ఇందులో, ముందు వైపు డ్యూయల్ 310 మిమీ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక వైపు 250 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇవి రెండూ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఈ మోటార్‌సైకిల్‌లోని ఇతర ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లలో ఐఎమ్‌యూ-ఆధారిత కవాసాకి కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, కవాసకి ట్రాక్షన్ కంట్రోల్, కవాసకి ఇంటెలిజెంట్ యాంటీ-లాక్ బ్రేక్‌లు మరియు స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి లభిస్తాయి.

భారత్‌లో కొత్త 2021 మోడల్ కవాసకి జెడ్650, వెర్సిస్ 1000 బైక్‌ల విడుదల

కొత్త 2021 కవాసకి వెర్సిస్ 1000 ట్విన్-ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లతో అగ్రెసివ్ ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో రైడర్ మరియు పిలియన్ రైడర్ కోసం విశాలమైన స్ప్లిట్ సీట్స్ ఉండి, సదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. ఇంకా ఇందులో సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, అనలాగ్ టాకోమీటర్‌తో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు డిసి ఛార్జింగ్ సాకెట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Kawasaki Launches New 2021 Model Z650 And Versys 1000 In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X