డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2021 కవాసకి నింజా 300; త్వరలో డెలివరీలు!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసకి, ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త 2021 కవాసాకి నింజా 300 బిఎస్6 మోటార్‌సైకిల్ ఇప్పుడు డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటోంది. ఈ మేరకు ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. మార్కెట్లో బిఎస్6 కవాసకి నింజా మోటార్‌సైకిల్ ధర రూ.3.18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2021 కవాసకి నింజా 300; త్వరలో డెలివరీలు!

మునుపటి బిఎస్4 మోడల్‌తో పోల్చుకుంటే, తాజాగా వచ్చిన ఈ కొత్త బిఎస్6 కవాసాకి నింజా 300 మోడల్‌లో డిజైన్ మరియు ఫీచర్లంగా పెద్ద మార్పులు ఏవీ లేవు. అయితే, ఈ కొత్త మోడల్ ధర మాత్రం మునుపటి మోడల్ ధర కన్నా రూ.20,000 అధికంగా ఉంది. ఈ అప్‌డేటెడ్ మోటార్‌సైకిల్ ఇప్పుడు కొత్త పెయింట్ స్కీమ్‌తో లభ్యం కానుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2021 కవాసకి నింజా 300; త్వరలో డెలివరీలు!

ఇందులో కొత్త పెయింట్ స్కీమ్ మినహా, దీని ఓవరాల్ డిజైన్పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇది కెఆర్‌టి (కవాసకి రేసింగ్ టీమ్) లివరీ, లైమ్ గ్రీన్ / ఎబోనీ డ్యూయల్ టోన్ మరియు ఆల్ బ్లాక్ పెయింట్ స్కీమ్ ఆప్షన్లలో లభిస్తుంది. కవాసకి రేసింగ్ టీమ్‌లో పాల్గొనే మోటార్‌సైకిల్ నుండి స్పూర్తి పొంది ఈ బైక్‌లోని కలర్లను మరియు బాడీ గ్రాఫిక్స్‌ను డిజైన్ చేశారు.

MOST READ:తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

కవాసకి నింజా 300 మోటార్‌సైకిల్‌ను ట్యూబ్లర్ ఛాస్సిస్‌పై నిర్మించారు, ఫలితంగా ఇది మంచి బ్యాలెన్స్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ యొక్క హెడ్‌లైట్, బాడీ ప్యానెల్, బ్రేక్‌లు, ఎలక్ట్రిక్ కేబుల్, టైర్లు మరియు ఇంజన్ వంటి ముఖ్యమైవ భాగాలను భారతదేశంలో తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2021 కవాసకి నింజా 300; త్వరలో డెలివరీలు!

ఇందులో బిఎస్-6 కంప్లైంట్ 296సిసి పారలల్-ట్విన్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 38.4 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్‌‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది మునుపటి కంటే మెరుగ్గా ఉంటుందని కంపెనీ తెలిపింది.

MOST READ:మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2021 కవాసకి నింజా 300; త్వరలో డెలివరీలు!

కవాసకి నింజా 300 మోటార్‌సైకిల్‌లో ముందు మరియు వెనుక వైపున వరుసగా 110/70 మరియు 140/70 ప్రొఫైళ్లతో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి, వీటిపై ఎమ్ఆర్ఎఫ్ టైర్లను అమర్చారు. దీని ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 17-లీటర్లు, సీట్ ఎత్తు 795 మిమీ మరియు బరువు 179 కిలోలుగా ఉంటుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2021 కవాసకి నింజా 300; త్వరలో డెలివరీలు!

ఈ బైక్‌లో ముందు భాగంలో స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీలోడ్-అడ్జస్టబల్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక వైపున వరుసగా 290 మిమీ మరియు 220 మిమీ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇవి రెండూ డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

MOST READ:మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2021 కవాసకి నింజా 300; త్వరలో డెలివరీలు!

ఇక ఈ మోటార్‌సైకిల్‌లోని ప్రధాన ఫీచర్లలో, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు భాగంలో ట్విన్-పాడ్ హెడ్‌లైట్, ఫెయిరింగ్ ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ బ్లింకర్స్, మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, స్ప్లిట్-స్టైల్ సీట్స్ మరియు ఎగ్జాస్ట్‌లో క్రోమ్ హీట్‌షీల్డ్ మొదలైనవి ఉన్నాయి.

Image Courtesy: Vinod Nareshan

Most Read Articles

English summary
Kawasaki Ninja 300 BS6 Motorcycle Started Arriving To Dealerships. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X