2022 లో పెరగనున్న Kawasaki బైక్ ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే

2021 ముగియడానికి ఇంకా ఎన్నో రోజులు లేదు. త్వరలో 2022 కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే తెలిపాయి, కావున ఈ కొత్త ధరలు 2022 జనవరి నుంచి అమలులోకి రానున్నాయి. ఇందులో ప్రముఖ వాహన తయారీ సంస్థ కవాసకి కూడా ఉంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 లో పెరగనున్న Kawasaki బైక్ ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే

కంపెనీ నివేదికల ప్రకారం, ఉత్పత్తి వ్యయం పెరగటం వల్ల కంపెనీ తన బైకుల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కంపెనీ తన అన్ని బైక్ మోడళ్ల కొత్త ధరల జాబితాను విడుదల చేసింది. ఈ బైక్‌లు 2022 జనవరి 01 నుండి అన్ని కవాసకి డీలర్‌షిప్‌లలో కొత్త ధరలకు అందుబాటులో ఉంటాయి. కానీ ప్రస్తుతం 2021 డిసెంబర్ 31 వరకు బైక్ బుక్ చేసుకున్న కస్టమర్లకు ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధరకే కంపెనీ బైకులను పొందవచ్చు.

2022 లో పెరగనున్న Kawasaki బైక్ ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే

కవాసకి కంపెనీ యొక్క మంచి అమాంకాలతో ముందుకు దూసుకెళ్తున్న నింజా 300 ధర ఇప్పుడు రూ. 6,000 పెరిగి రూ. 3,24,000 (ఎక్స్-షోరూమ్) ధరకు చేరుకుంది. ధరల పెరుగుదలకు ముందు ఈ బైక్ ధర రూ. 3,18,000 కు అందుబాటులో ఉంది.

అదే విధంగా హై-స్పెక్ నింజా 650 ధర రూ. 7,000 పెరిగి ప్రస్తుత ధర రూ. 6,68,000 (ఎక్స్-షోరూమ్) చేరిపోయింది. ఇటీవల విడుదల చేసిన జెడ్650ఆర్ఎస్ కూడా రూ. 7,000 పెరిగి రూ. 6,72,000 (ఎక్స్-షోరూమ్) కు చేరింది.

2022 లో పెరగనున్న Kawasaki బైక్ ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే

2022 జనవరి 01 నుంచి అమలులోకి రానున్న కవాసకి బైక్స్ కొత్త ధరలు:

  • నింజా 300: రూ. 3,24,000
  • నింజా 650: రూ. 6,68,000
  • జెడ్650: రూ. 6,24,000
  • జెడ్650ఆర్ఎస్: రూ. 6,72,000
  • వల్కన్ ఎస్: రూ. 6,16,000
  • వెర్సెస్ 650: రూ. 7,15,000
  • వెర్సెస్ 1000: రూ. 11,72,000
  • నింజా 1000ఎస్ఎక్స్: రూ. 11,51,000
  • నింజా జెడ్ఎక్స్-10ఆర్: రూ. 15,37,000
  • డబ్ల్యు800: రూ. 7,33,000
  • జెడ్900: రూ. 8,50,000
  • జెడ్ హెచ్2: రూ. 21,90,000
  • జెడ్ హెచ్2 ఎస్ఈ: రూ. 25,90,000
  • కెఎక్స్100: రూ. 4,87,800
  • కెఎక్స్250: రూ. 7,99,000
  • కెఎక్స్450: రూ. 8,59,000
  • కెఎల్ఎక్స్450ఆర్: రూ. 8,99,000
  • 2022 లో పెరగనున్న Kawasaki బైక్ ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే

    కవాసకి 2021 లో చాలా ఎక్కువ సంఖ్యలో బైకులను విడుదల చేసింది. కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో స్పోర్ట్స్ బైక్‌లతో పాటు రెట్రో మరియు టూరింగ్ బైక్‌లను కూడా విడుదల చేసింది. కంపెనీ భారతదేశంలో విడుదల చేయనున్న బైక్‌లలో కవాసకి ZH2, 2021 Versys 1000, Ninja 300 BS-6, Ninja ZX-10R, Ninja H2R, Ninja 650, 2022 Kawasaki Z650, 20250 Kawasaki V650 మరియు 20250 Kawasaki V40 కూడా ఉన్నాయి.

    2022 లో పెరగనున్న Kawasaki బైక్ ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే

    అంతే కాకుండా 2022 కవాసకి వెర్సిస్ 1000, Z650RS, 2022 కవాసకి నింజా 1000SX, 2022 కవాసకి నింజా ZX-10R, కవాసకి KLX450R ఉన్నాయి, వీటితోపాటు భారతదేశంలో విడుదల చేయనున్న కవాసకి యొక్క సరికొత్త బైక్‌లో కవాసకి KLX450R డర్ట్ బైక్ కూడా ఉంది, దీని ధర రూ. 8.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ఉండే అవకాశం ఉంటుంది.

    2022 లో పెరగనున్న Kawasaki బైక్ ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే

    కవాసకి KLX450R డర్ట్ బైక్ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ గా భారతదేశంలోకి దిగుమతి చేయబడుతోంది. ఈ బైక్ ఆఫ్-రోడింగ్ రేస్‌లు మరియు కఠినమైన ఉపరితలాలపై రైడింగ్ కోసం రూపొందించబడింది. 2022 కవాసకి కెఎల్ఎక్స్450ఆర్ 449సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ లైట్ వెయిట్ అల్యూమినియం పెరిమీటర్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

    2022 లో పెరగనున్న Kawasaki బైక్ ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే

    కవాసకి ఇటీవల మూడు కొత్త ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ బైక్‌లను 2022 చివరిలోపు మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో కూడా కవాసకి ఇదే ప్లాన్‌ను అధికారికంగా వెల్లడించింది. కంపెనీ 2035 నాటికి తమ మోడళ్లలో చాలా వరకు ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్‌లకు మార్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

    2022 లో పెరగనున్న Kawasaki బైక్ ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే

    కంపెనీ ఇప్పటికి అందించిన సమాచారం ప్రకారం 2035 నుంచి పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలయూ దాదాపుగా నిలిపివేయడానికి కూడా సన్నాహాలు సిద్ధం చేస్తోంది. 2035 తరువాత మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది. కవాసకి కంపెనీ తొలుత జపాన్ మరియు యూరప్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ బైక్‌లను లాంచ్ చేస్తుంది. ఆ తర్వాత ప్రపంచంలోని ఇతర మార్కెట్‌లలో ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసే అవకాశం ఉంటుంది.

    2022 లో పెరగనున్న Kawasaki బైక్ ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే

    కవాసకి తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేయడం ఇప్పటికే ప్రారంభించింది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ యొక్క కాన్సెప్ట్ మోడల్‌ను 2019లో EICMA మిలన్ మోటార్‌సైకిల్ షోలో పరిచయం చేసింది. ఆ తర్వాత కవాసకి యొక్క కొన్ని ఎలక్ట్రిక్ బైక్‌ల పేటెంట్‌లు కూడా వెల్లడయ్యాయి.

Most Read Articles

English summary
Kawasaki to hike prices from 1st january 2022 new price list details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X