కొత్త 2022 Kawasaki Versys 1000 బైక్ ఆవిష్కరణ; రెండు కొత్త వేరియంట్లు..

జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసకి (Kawasaki) అందిస్తున్న వెర్సిస్ 1000 (Versys 1000) బైక్ లో కంపెనీ ఓ కొత్త 2022 వెర్షన్ ను ఆవిష్కరించింది. ఈ అప్‌డేటెడ్ అడ్వెంచర్ బైక్ కి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2022 Kawasaki Versys 1000 బైక్ ఆవిష్కరణ; రెండు కొత్త వేరియంట్లు..

కవాసకి బ్రాండ్ తమ కొత్త 2022 Kawasaki Versys 1000 బైక్ ను పరిచయం చేయడంతో పాటుగా కంపెనీ ఇందులో ఓ ఎంట్రీ లెవల్ 'స్టాండర్డ్' వేరియంట్ ను కూడా ప్రవేశపెట్టింది. అలాగే, ప్రస్తుతం విక్రయిస్తున్న ఎస్ వేరియంట్ కు ఎగువన కంపెనీ ఎస్ఈ అనే కొత్త వేరియంట్ ను కూడా విడుదల చేసింది. ఇకపై కొత్త 2022 కవాసకి వెర్సిస్ 1000 Standard, S మరియు SE అనే వేరియంట్లలో లభ్యం కానుంది.

కొత్త 2022 Kawasaki Versys 1000 బైక్ ఆవిష్కరణ; రెండు కొత్త వేరియంట్లు..

కొత్త వేరియంట్ల చేర్పు మినహా ఈ కొత్త 2022 కవాసకి వెర్సిస్ 1000 బైక్ లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ లేవు. ఇందులో చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మాత్రమే ఉన్నాయి. వాటి, వలన దీని ఓవరాల్ లుక్ అండ్ ఫీల్‌లో ఎలాంటి మార్పు ఉండదు. యాంత్రికంగా కూడా ఈ కొత్త బైక్ లో ఎలాంటి మార్పులు చేయలేదు, ఇది మునుపటి ఇంజన్ నే కొనసాగిస్తుంది.

కొత్త 2022 Kawasaki Versys 1000 బైక్ ఆవిష్కరణ; రెండు కొత్త వేరియంట్లు..

కొత్త 2022 కవాసకి వెర్సిస్ 1000 బైక్ లో శక్తివంతమైన 999 సిసి ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పి శక్తిని మరియు 101 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో కూడిన సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులోని రీ-ట్యూన్ చేయబడిన ఇంజన్ ఇప్పుడు ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ఫీచర్లకు అనుగుణంగా మరింత లో-ఎండ్ మరియు మిడ్-రేంజ్ పవర్‌ను అందిస్తుంది.

కొత్త 2022 Kawasaki Versys 1000 బైక్ ఆవిష్కరణ; రెండు కొత్త వేరియంట్లు..

ఈ కొత్త బైక్ లోని S మరియు SE వేరియంట్లలో ఎలాంటి అదనపు ఫీచర్లు లేవు. కానీ, Standard (స్టాండర్డ్) వేరియంట్ లో మాత్రం ప్రాథమిక పరికరాలు ఉంటాయి మరియు ఇది ఇతర వేరియంట్ల కన్నా తక్కువ బరువును కలిగి ఉంటుంది. కొత్త వెర్సిస్ 1000 స్టాండర్డ్ వేరియంట్ 253 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఇతర వేరియంట్లతో పోల్చి చూసినప్పుడు ఇది ఎస్ వేరియంట్ 2 కేజీలు తక్కువ బరువును మరియు ఎస్ఈ వేరియంట్ కంటే 4 కిలోల తక్కువ బరువును కలిగి ఉంటుంది.

కొత్త 2022 Kawasaki Versys 1000 బైక్ ఆవిష్కరణ; రెండు కొత్త వేరియంట్లు..

ఈ అప్‌గ్రేడ్ చేయబడిన మోటార్‌సైకిల్‌లో అదనపు ఫీచర్లుగా క్విక్ షిఫ్టర్, హీటెడ్ గ్రిప్స్, హ్యాండ్ గార్డులు మరియు హై విండ్‌షీల్డ్ మొదలైనవి అందుబాటులో ఉంటాయి. ఇక ఇందులోని మెకానికల్స్ ను గమనిస్తే, కొత్తగా ప్రవేశపెట్టిన వెర్సిస్ 1000 ఎస్ఈ వేరియంట్ లో ఎస్ వేరియంట్ కన్నా మెరుగైన ఎలక్ట్రానిక్ డ్యాంప్డ్ షోవా స్కైహూక్ సస్పెన్షన్ సెటప్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు లభిస్తాయి.

కొత్త 2022 Kawasaki Versys 1000 బైక్ ఆవిష్కరణ; రెండు కొత్త వేరియంట్లు..

ఇందులో ముందు వైపు డ్యూయల్ 310 మిమీ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక వైపు 250 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇవి రెండూ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఈ మోటార్‌సైకిల్‌లోని ఇతర ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లలో ఐఎమ్‌యూ-ఆధారిత కవాసాకి కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, కవాసకి ట్రాక్షన్ కంట్రోల్, కవాసకి ఇంటెలిజెంట్ యాంటీ-లాక్ బ్రేక్‌లు మరియు స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి లభిస్తాయి.

కొత్త 2022 Kawasaki Versys 1000 బైక్ ఆవిష్కరణ; రెండు కొత్త వేరియంట్లు..

కొత్త 2022 కవాసకి వెర్సిస్ 1000 ముందు వైపున ట్విన్-ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ సెటప్ ను కలిగి ఉండి అగ్రెసివ్ ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో రైడర్ మరియు పిలియన్ రైడర్ కోసం విశాలమైన స్ప్లిట్ సీట్స్ ఉండి, సదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా ఉంటాయి. ఇంకా ఇందులో సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, అనలాగ్ టాకోమీటర్‌తో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు డిసి ఛార్జింగ్ సాకెట్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుందని సమాచారం.

కొత్త 2022 Kawasaki Versys 1000 బైక్ ఆవిష్కరణ; రెండు కొత్త వేరియంట్లు..

కొత్త 2022 కవాసకి వెర్సిస్ 1000 (2022 Kawasaki Versys) ముందుగా యూకే మార్కెట్లోని కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత ఇది గ్లోబల్ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో కొత్తగా ప్రవేశపెట్టిన స్టాండర్డ్ బేస్ వేరియంట్ ధర 12,099 GBP (సుమారు రూ. 12.27 లక్షలు) గా ఉంటుంది. కాకపోతే, ఈ వేరియంట్ లో ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్, రైడింగ్ మోడ్‌లు మరియు టిఎఫ్‌టి డిస్‌ప్లే వంటి పరికరాలు లభించవు.

కొత్త 2022 Kawasaki Versys 1000 బైక్ ఆవిష్కరణ; రెండు కొత్త వేరియంట్లు..

అలాగే, ఇందులో కొత్తగా పరిచయం చేసిన ఎస్ఈ వేరియంట్ ధర 14,999 GBP (సుమారు రూ. 15.21 లక్షలు) గా ఉంటుంది. ఈ అడ్వెంచర్ బైక్ లో మరింత ప్రాక్టికాలిటీని కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులో పెద్ద పన్నీర్స్ మరియు మరింత ప్రాక్టికల్ పిలియన్ సౌకర్యాలతో కూడిన గ్రాండ్ టూరర్ వేరియంట్ ను కూడా అందిస్తోంది. దీని ధర 16,699 GBP (సుమారు రూ.16.93 లక్షలు) గా ఉంటుంది.

కొత్త 2022 Kawasaki Versys 1000 బైక్ ఆవిష్కరణ; రెండు కొత్త వేరియంట్లు..

కవాసకి, ఈ ఏడాది జనవరి నెలలో తమ కొత్త 2021 మోడల్ వెర్సిస్ 1000 బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో కొత్త 2022 కవాసకి వెర్సిస్ కూడా వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని భావిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Kawasaki unveils new 2022 versys 1000 adventure bike added two more new variants
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X