భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న Kawasaki Z650RS: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో రోజురోజుకి విడుదలయ్యే వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్లోని చాలామంది కొనుగోలుదారులు కూడా అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగిన వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందులో భాగంగానే సాధారణ బైకులకంటే కూడా క్లాసిక్ బైకులకు ఆదరణ పెరుగుతోంది.

భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న Kawasaki Z650: పూర్తి వివరాలు

భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బైకులకు ఎక్కువ ఆదరణ ఉంది, కావున ఈ విభాగంలో చాలా కంపెనీలు ఈ క్లాసిక్ విభాగంలో మరిన్ని బైకులను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ జపనీస్ ద్విచక్రవాహన తయారీ సంస్థ Kawasaki (కవాసకి) భారతీయ విఫణిలో కొత్త 650 సీసీ బైక్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న Kawasaki Z650: పూర్తి వివరాలు

Kawasaki Z650RS బైక్ దేశీయ మార్కెట్లో Royal Enfield Interceptor 650 (రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650) మరియు Continental GT650 (కాంటినెంటల్ జిటి650) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త బైక్ అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న Kawasaki Z650: పూర్తి వివరాలు

Kawasaki Z650RS బైక్ కంపెనీ యొక్క Kawasaki W800 తర్వాత భారతదేశంలో రెండవ క్లాసిక్ బైక్ అవుతుంది. ప్రస్తుతం, కంపెనీ భారతదేశంలో తన బైక్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. గత కొన్ని నెలలుగా, కంపెనీ తన స్పోర్ట్స్, రోడ్‌స్టర్ మరియు స్ట్రీట్ ఫైటర్ బైక్‌లను భారతదేశంలో విడుదల చేస్తూనే ఉంది, వీటికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ బైకులన్నీ కూడా చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటాయి.

భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న Kawasaki Z650: పూర్తి వివరాలు

Kawasaki Z650RS బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్, దాని చుట్టూ క్రోమ్ కలిగి ఉంటుంది. దీనితో పాటు ఇందులో రౌండ్ రియర్ మిర్రర్స్, ఫ్లాట్ సీట్ ఫినిష్, అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్ సిస్టమ్, స్ప్లిట్-స్పోక్ వీల్స్, మరియు డ్యూయల్-పాడ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది.

భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న Kawasaki Z650: పూర్తి వివరాలు

ఈ కొత్త Z650RS బైక్ టియర్ ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, లెడ్ లైటింగ్ సిస్టమ్ పొందుతుంది. ఈ ఫ్యూయెల్ ట్యాంక్ పైన బ్రాండ్ నేమ్ ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ యూరోపియన్ మార్కెట్లలో, ఈ బైక్ ని మూడు కలర్ ఆప్సన్స్ లో అందిస్తోంది. అవి ఎమరాల్డ్ గ్రీన్, మెటాలిక్ మూండస్ట్ గ్రే మరియు మెటాలిక్ స్పార్క్ బ్లాక్ కలర్స్.

భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న Kawasaki Z650: పూర్తి వివరాలు

ఈ బైక్ యొక్క అల్లాయ్ వీల్స్ చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. ఇవి ఆకర్షణీయమైన గోల్డ్ కలర్ పొందుతాయి. కేవలం గోల్డ్ కలర్ మాత్రమే కాకుండా ఇది మరో రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇవి కూడా చూడటానికి ఆకర్షనీయంగా ఉన్నాయి. అయితే బాడీ గ్రాఫిక్స్ మాత్రమే విభిన్న రంగులలో ఉంటుంది.

భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న Kawasaki Z650: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త Kawasaki Z650RS మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. దీనికోసం ఇందులో 649 సిసి ప్యారలల్ ట్విన్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 6,700 ఆర్‌పిఎమ్ వద్ద 67.3 బిహెచ్‌పి మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 64 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న Kawasaki Z650: పూర్తి వివరాలు

Kawasaki Z650RS మంచి సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుకవైపు బ్యాక్‌లింక్ మోనోషాక్ సెటప్ ఉన్నాయి. కావున రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న Kawasaki Z650: పూర్తి వివరాలు

ఇక బ్రేకింగ్ విషాయానికి వస్తే, 300 మిమీ ట్విన్ రోటర్స్ మరియు సింగిల్ పిస్టన్ రియర్ కాలిపర్‌తో సింగిల్ 220 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్‌తో డ్యూయల్-పిస్టన్ ఫ్రంట్ కాలిపర్‌లతో అందించబడింది. ఇవి రోడ్డుపై వేగంలో ఉన్నప్పుడు కూడా బైక్ ని కంట్రోల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న Kawasaki Z650: పూర్తి వివరాలు

కంపెనీ కవాసకి Z650RS ని వచ్చే ఏడాది భారతదేశంలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ బైక్ డెలివరీ కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా కవాసకి Z650RS బైక్ ధర ఇతర 650 సిసి బైకుల కంటే ఎక్కువగా ఉంటుంది.

భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న Kawasaki Z650: పూర్తి వివరాలు

కంపెనీ తన Kawasaki Z650RS బైక్ ను భారతదేశంలో రూ. 6.50 లక్షల ధరతో విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈ ధర వద్ద, ఇది దాని ప్రత్యర్థి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ కంటే చాలా ఎక్కువ ధరకు విక్రయించబడుతుంది. భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ధర రూ. 2.81 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Most Read Articles

English summary
Kawasaki z650 unveiled for indian market price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X