2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన Kawasaki Z650 RS: వివరాలు

2021 ఇండియన్ బైక్ వీక్ ఇప్పుడు మహారాష్ట్రలోని లోనావాలాలో ఉన్న ఆంబీ వ్యాలీ ఎయిర్ స్ట్రిప్‌లో ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యింది. ఇప్పటికే హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్ మరియు హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ వంటి బైకులు విడుదలయ్యాయి. అంతే కాకుండా ఇందులో కవాసకి కూడా తన Z650 RS నియో రెట్రో బైక్‌ కూడా అధికారికంగా విడుదలయ్యింది. ఈ కొత్త కవాసకి బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన Kawasaki Z650 RS: వివరాలు

ప్రముఖ ప్రీమియం బైక్ తయారీదారు కవాసకి (Kawasaki) ఇప్పటికే భారతదేశంలో అనేక సూపర్ బైక్స్ విక్రయిస్తుంది. అంతే కాకుండా దేశీయ మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ మరో కొత్త ప్రీమియం బైక్ విడుదల చేసింది. కొత్త Z650 RS బైక్ మెటాలిక్ మూండస్ట్ గ్రే మరియు క్యాండీ ఎమరాల్డ్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన Kawasaki Z650 RS: వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 6,65,000 (ఎక్స్-షోరూమ్). ఇది కవాసకి Z650 బైక్ కంటే కూడా దాదాపు 41,000 ఎక్కువ ధర ఉంటుంది. అదే సమయంలో కంపెనీ యొక్క నింజా 650 బైక్ కంటే కేవలం రూ. 4 వేలు మాత్రమే అధికంగా ఉంటుంది.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన Kawasaki Z650 RS: వివరాలు

కొత్త కవాసకి Z650RS బైక్ ఇండియన్ మార్కెట్లో ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది. ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 6.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇప్పుడు కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త కవాసకి Z650 RS బైక్ డెలివరీ ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన Kawasaki Z650 RS: వివరాలు

కవాసకి Z650RS బైక్‌లో 649 సిసి ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 68 బిహెచ్‌పి పవర్ మరియు 64 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. కావున మునుపటి మోడల్స్ కంటే కూడా ఇది అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన Kawasaki Z650 RS: వివరాలు

కవాసకి Z650RS బైక్‌ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు సింగిల్ 220 మిమీ డిస్క్ బ్రేక్‌లు అమార్హబడి ఉంటాయి. ఈ బైక్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ తో ఆధునికంగా కనిపిస్తుంది. ఈ బైక్ రౌండ్ షేప్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌తో అందించబడింది.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన Kawasaki Z650 RS: వివరాలు

ఈ బైక్ లో మల్టిపుల్ స్పోక్ వీల్ కూడా ఇవ్వబడింది. ఈ స్పోక్స్‌ యొక్క కలర్స్ ఎంచుకునే అవకాశం కూడా కస్టమర్లకు ఉంది. ఇవి మెటాలిక్ మూండస్ట్ గ్రే రంగు ఎంపికలో బ్లాక్ స్పోక్ వీల్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో క్యాండీ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ సెలక్షన్ గోల్డెన్ కలర్ స్పోక్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ఈ బైక్ లో ఉండే ఒక ప్రత్యేకమైన ఫీచర్.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన Kawasaki Z650 RS: వివరాలు

ఈ కొత్త బైక్‌కు ట్విన్-పుట్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇవ్వబడింది. ఈ బైక్ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు అడుగుపెట్టింది, కావున కస్టమర్ల నుంచి మంచి స్పందన పొందే అవకాశం ఉంటుంది అని ఆశిస్తున్నాము. ఈ కొత్త బైక్ డెలివరీలను కంపెనీ త్వరలోనే ప్రారంభిస్తుంది. కావున దీనిని రైడ్ చేయాలనుకునేవారు దీని కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన Kawasaki Z650 RS: వివరాలు

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల భారత మార్కెట్లో మరో కొత్త ప్రీమయం మోటార్‌సైకిల్ '2022 కవాసకి నింజా జెడ్ఆర్-10ఆర్' సూపర్ బైక్‌ విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 15.14 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన Kawasaki Z650 RS: వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2022 కవాసకి నింజా జెడ్ఆర్-10ఆర్ సూపర్ బైక్‌ దాని మునుపటి 2021 మోడల్ కంటే కూడా రూ.15,000 ఎక్కువ ఖరీదైనది. ఈ కొత్త సూపర్ బైక్ రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి లైమ్ గ్రీన్ కలర్ కాగా, మరొకటి మెటాలిక్ డయాబ్లో బ్లాక్ కలర్. ఈ రెండు కలర్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన Kawasaki Z650 RS: వివరాలు

ఈ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 998 సిసి ఇన్‌లైన్ 4-సిలిండర్ ఇంజన్‌ అందుబటులో ఉంటుంది. ఈ ఇంజిన్ 200 బిహెచ్‌పి పవర్ విడుదల చేస్తుంది. అంతే కాకుండా, ఈ బైక్ యొక్క ఇంజిన్‌లో DOHC సెటప్, 16 వాల్వ్‌లు, ఎలక్ట్రానిక్ త్రాటల్ వాల్వ్ ఉపయోగించబడింది. కావున ఈ ఇంజన్ 114.9 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.

Most Read Articles

English summary
Kawasaki z650rs launched in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X