భారత్‌లో లాంచ్ అయిన కవాసకి Z H2 & Z H2 SE బైక్‌లు : ధర & వివరాలు

ప్రముఖ జపాన్ బైక్ తయారీదారు కవాసకి ఇటీవల తన నేకెడ్ సూపర్ బైక్ జెడ్‌హెచ్ 2 మరియు జెడ్‌హెచ్ 2 ఎస్ఇ బైకులను భారతమార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు కవాసకి కంపెనీ ఈ రెండు మోడళ్లను భారతదేశంలో లాంచ్ చేసింది. కవాసకి జెడ్‌హెచ్ 2 బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 21.90 లక్షలు కాగా, జెడ్‌హెచ్ 2 ఎస్ఇ బైక్ ధర రూ. 25.90 లక్షలు (ఎక్స్‌షోరూమ్).

మరో రెండు కొత్త బైక్‌లు లాంచ్ చేసిన కవాసకి : ధర & వివరాలు

ఈ రెండు బైక్‌లు కవాసకి సుగోమి డిజైన్ ప్లాట్‌ఫాంపై నిర్మించబడింది. ఈ బైకులలోని మెయిన్ ఫీచర్స్ గమనించినట్లయితే ఇందులో, 4.3 ఇంచెస్ బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పుల్ ఎల్ఈడి హెడ్ లైట్, ఎల్ఈడి టెయిల్ లైట్ మరియు ఎల్ఇడి ఇండికేటర్ వంటి వాటిని కలిగి ఉంది. అంతే కాకుండా ఈ బైక్‌లో కంపెనీ రేడియాలజీ కనెక్టివిటీ ఫీచర్‌ను అందిస్తుంది. దీని సహాయంతో అనేక ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు.

మరో రెండు కొత్త బైక్‌లు లాంచ్ చేసిన కవాసకి : ధర & వివరాలు

కవాసకి లాంచ్ చేసిన ఈ కొత్త బైక్‌లో 998 సిసి ఇన్లైన్ 4-సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 197.2 బిహెచ్‌పి శక్తిని అందిస్తుంది. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ క్లచ్‌తో అసిస్ట్ ఫీచర్‌తో వస్తుంది. బైక్‌లో షోవా ముందు మరియు వెనుక సస్పెన్షన్‌తో బైక్‌కు నేకెడ్ రోడ్‌స్టర్ అవతార్ ఇవ్వబడింది. అదే సమయంలో, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా హై వేరియంట్ అయిన జెడ్‌హెచ్ 2 ఎస్ఇలో ఇవ్వబడింది.

MOST READ:లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

మరో రెండు కొత్త బైక్‌లు లాంచ్ చేసిన కవాసకి : ధర & వివరాలు

ఈ రెండు కొత్త బైకులలోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, వీటిలో ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఎబిఎస్, లాంచ్ కంట్రోల్, త్రీ పవర్ మోడ్, త్రీ రైడింగ్ మోడ్ మరియు క్రూయిస్ కంట్రోల్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

మరో రెండు కొత్త బైక్‌లు లాంచ్ చేసిన కవాసకి : ధర & వివరాలు

కవాసాకి ఇప్పుడు తన 175 సిసి బైక్ డబ్ల్యూ 175 ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ బైక్ ఇప్పటికే చాలాసార్లు టెస్టింగ్ సమయంలో గుర్తించబడింది. ఈ బైక్ రెట్రో లుకింగ్ బైక్ కలిగి ఉంది. ఇది దేశీయ మార్కెట్లో జావా, రాయల్ ఎన్‌ఫీల్డ్ మరియు బెనెల్లి బైక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:అటల్ టన్నెల్‌లో ఒకటి, రెండు కాదు ఏకంగా 82 వాహనాలు చిక్కుకున్నాయి.. కారణం ఇదే

మరో రెండు కొత్త బైక్‌లు లాంచ్ చేసిన కవాసకి : ధర & వివరాలు

కవాసాకి బైక్ హైబ్రిడ్ టెక్నాలజీపై కూడా పనిచేస్తోంది. ఇటీవల, ఈ కంపెనీ యాడ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుందని కంపెనీ అభిప్రాయపడింది.

మరో రెండు కొత్త బైక్‌లు లాంచ్ చేసిన కవాసకి : ధర & వివరాలు

ఇప్పటికే ప్రపంచంలో చామంది వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. కావున రానున్న కాలంలో ఇంధనంతో నడిచే వాహనాలకు చోటు ఉండకపోవచ్చు. కావున భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర వాహన రంగంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను టేకాఫ్ చేయడం అవసరం.

MOST READ:2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 1 ఫలితాలు వచ్చేశాయ్.. భారతీయ రేసర్లు ఏ స్టేజ్‌లో ఉన్నారో చూడండి

మరో రెండు కొత్త బైక్‌లు లాంచ్ చేసిన కవాసకి : ధర & వివరాలు

నిజానికి హైబ్రిడ్ ఇంజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉంటుంది. రహదారి పరిస్థితులకు అనుగుణంగా బైక్ దాని పనితీరును మార్చగలదు. ఉదాహరణకు, బైక్ హైవేలో ఉంటే, అది మరింత శక్తి కోసం పెట్రోల్ ఇంజిన్‌లో నడుస్తుంది. అదే సమయంలో, బైక్ సిటీ ట్రాఫిక్‌లో ఉంటే అది ఎలక్ట్రిక్ ఇంజిన్‌లో నడుస్తుంది. బైక్ కొండ ప్రాంతాలలో ఉంటే, అది పెట్రోల్ ఇంజిన్‌తో ఎలక్ట్రిక్‌ను కూడా ఉపయోగిస్తుంది.

మరో రెండు కొత్త బైక్‌లు లాంచ్ చేసిన కవాసకి : ధర & వివరాలు

వాహనం ప్రయాణించే రోడ్డును బట్టి బైక్ ఏ శక్తితో నడపాలి, అది బైక్ యొక్క కృత్రిమ మేధస్సు నిర్ణయిస్తుంది. ఈ బైక్‌ను తయారుచేసేటప్పుడు, నగరంలో ఇంధనంపై మరియు నగరం వెలుపల ఎలక్ట్రిక్ ఇంజిన్‌లపై నడుస్తుందని కంపెనీ వాదించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇంధనం ఆదా అవుతుంది అలాగే పర్యావరణానికి కూడా హాని జరిగే అవకాశం ఉండదు.

MOST READ:ఒక ఛార్జ్‌తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

మరో రెండు కొత్త బైక్‌లు లాంచ్ చేసిన కవాసకి : ధర & వివరాలు

కవాసకి కంపెనీ కొన్ని వారాల క్రితం బిఎస్ 6 నింజా 300 బైక్ ను వెల్లడించిందని, ఇప్పుడు ఈ బైక్ త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కవాసకి నింజా 300 బైక్ కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన బైక్. అంతే కాకుండా ఇప్పటికి సరసమైన స్పోర్ట్స్ బైకులలో ఒకటిగా ఉంది.

మరో రెండు కొత్త బైక్‌లు లాంచ్ చేసిన కవాసకి : ధర & వివరాలు

భారతదేశంలో, కవాసాకి నింజా 300 బైక్ మాత్రమే కాకుండా, డబ్ల్యూ 175 కూడా సరసమైన బైక్‌గా విడుదల కానుంది. ఈ 175 సిసి బైక్‌ను 2020 అక్టోబర్‌లో కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ స్థానిక మార్కెట్లో తయారు చేయబడుతుంది. ఇది భారతదేశంలో కంపెనీ యొక్క అత్యంత సరసమైన బైక్ కానుంది.

Most Read Articles

English summary
Kawasaki ZH2 And ZH2 SE Launched Price, Features Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X