తనను తాను రిపేర్ చేసుకోగల కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

భారతమార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసాయి. మరికొన్ని కంపెనీలు కొత్తవాహనాలను విడుదలచేసేపనిలో నిమగ్నమయ్యాయి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ స్కూటర్ సంస్థ కొమాకి దేశంలో హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన కొమకి ఎస్‌ఇని విడుదల చేసింది.

తనను తాను రిపేర్ చేసుకోగల కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్

కొత్త కోమకి ఎస్‌ఇ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధర రూ. 96,000 (ఎక్స్‌షోరూమ్). ఈ స్కూటర్ నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి గార్నెట్ రెడ్, డీప్ బ్లూ, మెటాలిక్ గోల్డ్ మరియు జెట్ బ్లాక్ కలర్స్. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ స్కూటర్ అన్ని వయసుల గల వినియోగదారులు నడపడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

తనను తాను రిపేర్ చేసుకోగల కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్

కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి పనితీరుని కలిగి ఉండటమే కాకుండా మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. కొమకి మొదట ఆటోమొబైల్ పరికరాలను తయారు చేసేది. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో కొమాకి ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తామని పేర్కొంది.

MOST READ:ఈ బైక్ తినేయొచ్చు, మీరు విన్నది నిజమే.. ఓ లుక్కేయండి

తనను తాను రిపేర్ చేసుకోగల కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్

ఒకే ఛార్జీతో కొమాకి ఎస్‌ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 100 కి.మీ. హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఈ వేగం సరిపోతుంది. కొమాకి ఎస్‌ఇ అనేక మల్టీమీడియా మరియు కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంది.

తనను తాను రిపేర్ చేసుకోగల కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్ లైట్, యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, రిమోట్ లాకింగ్, యాంటీ తెఫ్ట్ ఫీచర్, ఫ్రంట్ అండ్ రియర్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ మరియు డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ స్కూటర్ ఇంటిగ్రేటెడ్ బ్లూటూత్ స్పీకర్‌తో కూడా వస్తుంది.

MOST READ:అలెర్ట్.. ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

తనను తాను రిపేర్ చేసుకోగల కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ కొత్త స్కూటర్ యొక్క పవర్ ఫిగర్ విషయానికి వస్తే, కోమాకి ఎస్‌ఇలో 3000 వాట్ల మోటారు ఉంది, ఇది 125 సిసి స్కూటర్‌తో సమానంగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది సెల్ఫ్ డైయాగ్నోసిస్ సిస్టం ను కలిగి ఉంది.

తనను తాను రిపేర్ చేసుకోగల కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ సిస్టమ్ ఆటోమాటిక్ గా స్కూటర్ యొక్క ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లేదా సాఫ్ట్‌వేర్‌లో పనిచేయకపోవడాన్ని గుర్తించి ఆటోమాటిక్ గా సరిదిద్దుతుంది. సర్వీసింగ్ అవసరమైతే స్కూటర్ ఆటోమాటిక్ గా డ్రైవర్‌కు తెలియజేస్తుంది.

MOST READ:ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్ ఇవే, చూసారా..?

తనను తాను రిపేర్ చేసుకోగల కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్

కొమాకి హై స్పీడ్ ద్విచక్ర వాహన శ్రేణిలో టిఎన్ 95 మరియు ఎం 5 కూడా ఉన్నాయి. కోమాకి హైస్పీడ్ ద్విచక్ర వాహనం ధర దేశీయ మార్కెట్లో రూ. 96,000 నుండి రూ. 99,000 వరకు ఉంటుంది. కంపెనీ తన ద్విచక్ర వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తుంది. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Komaki Launches SE High Speed E Scooter With Self Repair Feature. Read in Telugu.
Story first published: Wednesday, February 10, 2021, 13:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X