ఒక్క ఛార్జ్‌తో 250 కిమీ రేంజ్ అందించే Komaki ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో విడుదల చేశాయి. మరికొన్ని కంపెనీలు కొత్తవాహనాలను విడుదలచేసేపనిలో నిమగ్నమయ్యాయి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ కోమకి ఎలక్ట్రిక్ (Komaki Electric) కూడా దేశీయ మార్కెట్లో వచ్చే సంవత్సరం 2022 లో ఒక కొత్త ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌ను విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒక్క ఛార్జ్‌తో 250 కిమీ రేంజ్ అందించే Komaki ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

కోమకి ఎలక్ట్రిక్ (Komaki Electric) విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌కి సంబంధించి టీజర్ కూడా వెల్లడించింది. ఇందులో రానున్న కొమకి ఎలక్ట్రిక్ బైక్ చూడవచ్చు. అంతే కాకూండా కంపెనీ రానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ గురించి కూడా కొంత సమాచారం వెల్లడించింది.

ఒక్క ఛార్జ్‌తో 250 కిమీ రేంజ్ అందించే Komaki ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

ఈ బైక్ గురించి కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఇది ఒక ఫుల్ ఛార్జింగ్ తో ఏకంగా 250 కి.మీల రేంజ్ ఇవ్వగలదని పేర్కొంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ బైక్ పేరు రేంజర్ గా నామకరణం కూడా చేశారు. ఈ రేంజర్‌ బైక్ లో 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది భారతదేశంలోనే ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లో అతిపెద్ద బ్యాటరీ ప్యాక్, ఈ కారణంగానే ఇది 250 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

ఒక్క ఛార్జ్‌తో 250 కిమీ రేంజ్ అందించే Komaki ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

అంతే కాకూండా కొత్త రేంజర్ 5000-వాట్ల మోటారుతో శక్తిని పొందుతుందని కూడా కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది, కావున ఆధునిక కాలంలో ఈ లేటెస్ట్ బైక్ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 250 కిమీ రేంజ్ అందించే Komaki ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త క్రూయిజర్ బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్ మరియు బ్లూటూత్ సిస్టమ్ మరియు అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ క్రూయిజర్ తరహాలో ఎలక్ట్రిక్ బైక్‌ను భారత్‌లో విడుదల చేయడం ఇదే మొదటిసారి.

ఒక్క ఛార్జ్‌తో 250 కిమీ రేంజ్ అందించే Komaki ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

ఈ బైక్ ఎక్కువ పరిధిని అందిస్తుంది కావున, సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. భారతదేశంలో అత్యధిక పరిధి అందించే ఎలక్ట్రిక్ బైకుల జాబితాలో ఈ కొత్త రేంజర్ కూడా స్థానం సంపాదించుకుంది. కావున ఎక్కువమంది వినియోగదారులను ఈ బైక్ ఆకర్షించే అవకాశం ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 250 కిమీ రేంజ్ అందించే Komaki ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

కోమకి ఇడుదల చేయనున్న ఈ 'రేంజర్' బైక్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కావున ఎక్కువమంది కొనుగోలుదారులను ఇది తప్పకుండా ఆకర్షిస్తుంది. ప్రస్తుతానికి కంపెనీ ఈ బైక్ పనిలోనే నిమగ్నమై ఉంది, కావున ఈ బైక్ ధర త్వరలోనే నిర్ణయించే అవకాశం ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 250 కిమీ రేంజ్ అందించే Komaki ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ యొక్క డిజైన్ మరియు డెవలప్‌మెంట్ కోసం కోమకి దాదాపు రూ. 7 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఈ బైక్ దేశీయ మార్కెట్లో విడుదలైతే చాలా ఎక్కువ ఎలక్ట్రిక్ బైకులకు ప్రత్యర్థిగా నిలబడే అవకాశం ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 250 కిమీ రేంజ్ అందించే Komaki ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

కోమకి కంపెనీ ఈ సంవత్సరం మార్చిలో, ఒక లాంగ్ రేంజ్ బ్యాటరీని తయారు చేసినట్లు క్లెయిమ్ చేసింది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే దాదాపు 220 కిమీల పరిధిని అందిస్తుంది. ఈ బ్యాటరీపై పరిశోధన మరియు అభివృద్ధి పూర్తిగా భారతదేశంలోనే జరిగిందని కంపెనీ తెలిపింది. కావున ఈ బ్యాటరీ వాహనాలలో ఉపయోగిస్తే మంచి పరిధిని అందిస్తాయి.

ఒక్క ఛార్జ్‌తో 250 కిమీ రేంజ్ అందించే Komaki ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

కోమకి కంపెనీ యొక్క ఈ బ్యాటరీ మూడు కోమకి స్కూటర్లలో ఇన్స్టాల్ చేయబడుతుంది. ఇందులో XGT-KM, X-One మరియు XGT-X4 స్కూటర్లు ఉన్నాయి. నివేదికల ప్రకారం, ఈ స్కూటర్ శ్రేణి ప్రారంభ ధర రూ. 85,000 (ఎక్స్-షోరూమ్). ఇందులోని కొత్త బ్యాటరీ కేవలం 4 నుంచి 5 గంటల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 250 కిమీ రేంజ్ అందించే Komaki ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

ఈ స్కూటర్‌ను ఎకో మోడ్‌లో రైడ్ చేసినప్పుడు బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌పై 170 నుంచి 220 కి.మీల పరిధిని అందిస్తుంది. కంపెనీ యొక్క అన్ని కోమాకి ఎలక్ట్రిక్ స్కూటర్లు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తాయి. బ్రేకింగ్ చేసినప్పుడు కూడా ఈ సిస్టమ్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్.

కొత్త Komaki బ్యాటరీ మూడు సంవత్సరాల వారంటీతో వస్తుంది (2 సంవత్సరాలు ఉచితం + 1 సంవత్సరం సర్వీస్ వారంటీ). Komaki X4 స్మార్ట్ స్కూటర్ కోసం ఒక కొత్త బ్యాటరీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 350 నుంచి 400 కిమీల పరిధిని అందించగలదు.

ఒక్క ఛార్జ్‌తో 250 కిమీ రేంజ్ అందించే Komaki ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

Komaki యొక్క ఎలక్ట్రిక్ ఇటీవల వృద్ధులు మరియు వికలాంగ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కోమకి XGT X5 ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు ట్రిమ్‌లలో అందించబడుతుంది. అవి XGT-X5- (72V24AH) మరియు XGT-X5 GEL. ఈతి ధరలు వరుసగా రూ .90,500 మరియు రూ. 72,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇవి కూడా వినియోగాదారులకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించబడ్డాయి. రానున్న కాలంలో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత డిమాండ్ పెరుగుతుంది. కావున Komaki కూడా మరింత ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Komaki ranger electric cruiser bike launch in january 2022 range 250 kms details
Story first published: Saturday, December 4, 2021, 10:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X