కొనుగోలుదారులకు షాక్ : భారీగా పెరిగిన కెటిఎమ్, హస్క్వార్నా బైక్స్ ధరలు!

ఓవైపు కరోనా మహమ్మారి మరోవైపు పెట్రోల్ ధరల పెంపు వంటి సమస్యలతో ప్రజలు సతమతం అవుతుంటే, ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీ ధరాఘాతంతో ప్రజలను మరింత ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే సుజుకి తమ జిక్సర్ మోటార్‌సైకిల్ ధరలను పెంచగా, ఇప్పుడు కెటిఎమ్ మరియు హస్క్వార్నా సంస్థలు తమ మోటార్‌సైకిళ్ళ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

కొనుగోలుదారులకు షాక్ : భారీగా పెరిగిన కెటిఎమ్, హస్క్వార్నా బైక్స్ ధరలు!

జూలై 2021 నెల నుండి భారతదేశంలో విక్రయించే అన్ని కెటిఎమ్ మరియు హస్క్వర్నా మోటార్‌సైకిళ్ళ ధరలు పెరుగుతాయని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ధరల పెరుగుదల రూ.256 నుంచి రూ.11,423 మధ్యలో ఉంటుంది.

కొనుగోలుదారులకు షాక్ : భారీగా పెరిగిన కెటిఎమ్, హస్క్వార్నా బైక్స్ ధరలు!

ఈ సంవత్సరం ఈ రెండు బ్రాండ్‌లు తమ ఉత్పత్తుల ధరలను పెంచడం ఇది వరుసగా మూడవసారి. ధరల పెంపు తర్వాత, మోడల్ వారీగా కెటిఎమ్ మరియు హస్క్వర్నా మోటార్‌సైకిళ్ళ ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి:

Model New Price Old Price Difference
Duke 125 ₹1,70,515 ₹1,60,575 ₹9,940
Duke 200 ₹1,85,606 ₹1,83,584 ₹2,022
Duke 250 ₹2,28,736 ₹2,21,888 ₹6,848
Duke 390 ₹2,87,545 ₹2,76,187 ₹11,358
RC 125 ₹1,80,538 ₹1,70,470 ₹10,068
RC 200 ₹2,08,602 ₹2,06,349 ₹2,253
RC 390 ₹2,77,517 ₹2,66,159 ₹11,358
250 Adventure ₹2,54,995 ₹2,54,739 ₹256*
390 Adventure ₹3,28,286 ₹3,16,863 ₹11,423
Svartpilen 250 ₹2,10,650 ₹1,99,552 ₹11,098
Vitpilen 250 ₹2,10,022 ₹1,98,925 ₹11,097
కొనుగోలుదారులకు షాక్ : భారీగా పెరిగిన కెటిఎమ్, హస్క్వార్నా బైక్స్ ధరలు!

కెటిఎమ్ డ్యూక్ ధరలు

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతునున్న రెండవ అత్యంత ఖరీదైన 125సిసి మోటారుసైకిల్ కెటిఎమ్ డ్యూక్ 125, మార్కెట్లో దీని ధర రూ.1.70 లక్షలుగా ఉంది. ఈ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ నేక్డ్ మోటార్‌సైకిల్ డ్యూక్ 390 ధర గరిష్టంగా రూ.11,358 మేర పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.2.87 లక్షలుగా ఉంది. కాగా, డ్యూక్ 200 మరియు డ్యూక్ 250 ధరలు వరుసగా రూ.2,022 మరియు రూ.6,848 మేర పెరిగాయి.

కొనుగోలుదారులకు షాక్ : భారీగా పెరిగిన కెటిఎమ్, హస్క్వార్నా బైక్స్ ధరలు!

కెటిఎమ్ ఆర్‌సి ధరలు

భారతదేశంలో లభిస్తున్న అత్యంత ఖరీదైన 125సిసి బైక్ కెటిఎమ్ ఆర్‌సి 125 మరియు మార్కెట్లో దీని ధర రూ.1.80 లక్షలుగా ఉంటుంది. కెటిఎమ్ డ్యూక్ 125 ధర కన్నా దీని ధర రూ.10,000 అధికంగా ఉంటుంది. కాగా, ట్రాక్-ఫోకస్డ్ కెటిఎమ్ ఆర్‌సి 390 ధర రూ.11,358 మేర పెరిగి రూ.2.77 లక్షలకు చేరుకుంది. ఇది కూడా డ్యూక్ 390 ధర కన్నా రూ.10,000 అధిక ధరను కలిగి ఉంటుంది. ఇకపోతే, కెటిఎమ్ ఆర్‌సి 200 ధర నామమాత్రంగా రూ.2,253 మేర పెరిగింది.

కొనుగోలుదారులకు షాక్ : భారీగా పెరిగిన కెటిఎమ్, హస్క్వార్నా బైక్స్ ధరలు!

కెటిఎమ్ అడ్వెంచర్ బైక్ ధరలు

కెటిఎమ్ 250 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ధరలు కనిష్టంగా రూ.258 మేర పెరిగాయి. అయితే, ఇందులో కెటిఎమ్ 390 అడ్వెంచర్ ధర మాత్రం అత్యధికంగా రూ.11,423 మేర పెరిగి. ధర పెరుగుదల తర్వాత కెటిఎమ్ 390 అడ్వెంచర్ ధర రూ.3.28 లక్షలకు చేరుకుంది.

కొనుగోలుదారులకు షాక్ : భారీగా పెరిగిన కెటిఎమ్, హస్క్వార్నా బైక్స్ ధరలు!

హస్క్వర్ణా బైక్ ధరలు

హస్క్వర్ణా భారతదేశంలో స్వార్ట్‌పిలెన్ మరియు విట్‌పిలెన్ 250 మోటార్‌సైకిళ్ళను విక్రయిస్తోంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.11,098 మరియు రూ.11,097 మేర పెరిగాయి. తాజా ధరల పెరుగుదలతో, ఈ రెండు మోటార్‌సైకిళ్ళ ధరలు రూ.2 లక్షలను దాటిపోయాయి. అయినప్పటికీ, ఇవి కెటిఎమ్ డ్యూక్ 250 కన్నా 18,000 రూపాయల చౌకైనవిగా ఉంటాయి.

కొనుగోలుదారులకు షాక్ : భారీగా పెరిగిన కెటిఎమ్, హస్క్వార్నా బైక్స్ ధరలు!

కెటిఎమ్ ఈ ఏడాది భారతదేశంలో ఇలా తమ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచడం ఇది మూడోసారి. కాగా, తాజా ధరల పెరుగుదలకు సంబంధించిన కారణాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు దీనికి కారణం కావచ్చని తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే కెటిఎమ్, హస్క్వర్నా మోటార్‌సైకిళ్ల ధరలు సుమారు 25 శాతం పెరిగాయి.

Most Read Articles

English summary
KTM And Husqvarana Increases Their Entire Product Prices In India; New Price List. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X