ఫిబ్రవరి 2021 కెటిఎమ్ బైక్స్ సేల్స్ రిపోర్ట్, ఇదే.. చూసారా..!

ప్రముఖ స్పోర్ట్స్ బైక్ తయారీకంపెనీ కెటిఎమ్ అమ్మకాలు గత కొన్ని సంవత్సరాల నుంచి క్రమంగా పెరుగుదల వైపు ప్రయాణిస్తోంది. అయితే ఈ సంవత్సరం 2021 ఫిబ్రవరి అమ్మకాల విషయానికి వస్తే బాగా క్షీణించాయని నివేదికల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా దేశీయ మార్కెట్లో వీటి అమ్మకాలు ఇప్పుడు బాగా తగ్గుముఖం పట్టాయి.

2021 ఫిబ్రవరిలో కెటిఎమ్ బైక్స్ సేల్స్ రిపోర్ట్, ఇదే.. చూసారా..!

కెటిఎమ్ అమ్మకాలు బాగా తగ్గడానికి ప్రధాన కారణం, కంపెనీ తమ ఉత్పత్తులు ఆలస్యం చేయడం, ఈ ఆలస్యానికి ప్రధాన కారణం ఉత్పత్తికి కావలసిన భాగాలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం, అంతే కాకుండా దేశీయ మార్కెట్లో వీటి డిమాండ్ కూడ తగ్గింది. భారతదేశంలో ఉన్న ప్రీమియం బైక్ తయారీదారులలో కెటిఎమ్ కూడా ఒకటి.

2021 ఫిబ్రవరిలో కెటిఎమ్ బైక్స్ సేల్స్ రిపోర్ట్, ఇదే.. చూసారా..!

ఇదిలా ఉండగా కెటిఎమ్ కంపెనీ యొక్క 2021 ఫిబ్రవరి నెల అమ్మకాల విషయానికి వస్తే, గత నెలలో మార్కెట్లో 5,394 యూనిట్ల బైక్‌లను విక్రయించగా, ఇదే నెల గత ఏడాది కంపెనీ 6,470 బైక్‌లను విక్రయించినట్లు తెలిసింది.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

2021 ఫిబ్రవరిలో కెటిఎమ్ బైక్స్ సేల్స్ రిపోర్ట్, ఇదే.. చూసారా..!

అదేవిధంగా 2021 జనవరిలో కంపెనీ 6,777 బైక్‌లను విక్రయించింది. కేవలం అమ్మకాల పరంగా ఒక్క సంవత్సరంలోనే 16.63 శాతం క్షీణతను నమోదు చేసింది. ఇదేవిధంగా నెలవారీ అమ్మకాలలో 20.41 శాతం క్షీణతను నమోదు చేసింది.

2021 ఫిబ్రవరిలో కెటిఎమ్ బైక్స్ సేల్స్ రిపోర్ట్, ఇదే.. చూసారా..!
Rank KTM Domestic Feb-21 Feb-20 Growth (%)
1 200 2,431 2,900 -16.17
2 125 2,200 1,476 49.05
3 390 451 1,505 -70.03
4 250 312 589 -47.03
Rank KTM Domestic Feb-21 Jan-21 Growth (%)
1 200 2,431 2,979 -18.40
2 125 2,200 2,516 -12.56
3 390 451 722 -37.53
4 250 312 560 -44.29

MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు, పూర్తి వివరాలు

2021 ఫిబ్రవరిలో కెటిఎమ్ బైక్స్ సేల్స్ రిపోర్ట్, ఇదే.. చూసారా..!

గత నెలలో కెటిఎమ్ తన డ్యూక్ 200 బైక్ యొక్క 2,431 యూనిట్ల‌ను దేశీయ మార్కెట్లో విక్రయించింది. ఇది కంపెనీ యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన బైక్. గత ఏడాది ఇదే సమయంలో, 2020 ఫిబ్రవరిలో కంపెనీ 200 డ్యూక్‌ను 2,900 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది జనవరిలో 2,979 యూనిట్లను విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

2021 ఫిబ్రవరిలో కెటిఎమ్ బైక్స్ సేల్స్ రిపోర్ట్, ఇదే.. చూసారా..!

కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ బైక్ డ్యూక్ 125 యొక్క అమ్మకాల విషయానికి వస్తే, ఫిబ్రవరి 2021 లో, ఈ బైక్ 2,200 యూనిట్లను విక్రయించింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో అమ్మకాలు 49.05 శాతం పెరిగాయి. ఈ ఎంట్రీ లెవల్ బైక్ 1,476 యూనిట్లను కంపెనీ గత ఏడాది ఫిబ్రవరి నెలలో విక్రయించింది. నెలవారీ అమ్మకాల పరంగా, దాని అమ్మకాలు 12.56 శాతం తగ్గిపోయాయి.

MOST READ:కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

2021 ఫిబ్రవరిలో కెటిఎమ్ బైక్స్ సేల్స్ రిపోర్ట్, ఇదే.. చూసారా..!

జనవరి 2021 లో కంపెనీ ఈ బైక్ ను 2,516 యూనిట్ల వరకు విక్రయించింది. అయితే కంపెనీ యొక్క అతి తక్కువ అమ్మకాలను చేపట్టిని మోడల్ సిరీస్ 390 సిసి. ఈ విభాగంలో ఫిబ్రవరి 2021 లో మొత్తం 451 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ విభాగంలో 390 డ్యూక్, ఆర్‌సి 390 మరియు 390 అడ్వెంచర్ ఉన్నాయి.

2021 ఫిబ్రవరిలో కెటిఎమ్ బైక్స్ సేల్స్ రిపోర్ట్, ఇదే.. చూసారా..!
Rank KTM Exports Feb-21 Feb-20 Growth (%)
1 200 3,034 3,536 -14.20
2 125 2,982 738 304.07
3 390 1,177 840 40.12
4 250 960 273 251.65
Rank KTM Exports Feb-21 Jan-21 Growth (%)
1 200 3,034 3,354 -9.54
2 125 2,982 1,234 141.65
3 390 1,177 850 38.47
4 250 960 1,376 -32.23

MOST READ:హైదరాబాద్‌ నగరంలో 40 మందికి పైగా వాహనదారులు అరెస్ట్.. కారణం ఇదే

2021 ఫిబ్రవరిలో కెటిఎమ్ బైక్స్ సేల్స్ రిపోర్ట్, ఇదే.. చూసారా..!

కెటిఎం 250 సిసి సిరీస్‌లో కంపెనీ యొక్క 250 డ్యూక్, 250 అడ్వెంచర్ ఉన్నాయి, ఇవి మొత్తం 312 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే కంపెనీ ఎగుమతుల విషయానికి వస్తే గత నెలలో 8,153 యూనిట్లను ఎగుమతి చేసింది, ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ ఎగుమతులు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 51.35 శాతం పెరిగాయి.

2021 ఫిబ్రవరిలో కెటిఎమ్ బైక్స్ సేల్స్ రిపోర్ట్, ఇదే.. చూసారా..!

కెటిఎమ్ కంపెనీ యొక్క బైక్ లు దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ లు, ఎక్కువమంది యువ వినియోగదారులు వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసకితి చూపిస్తారు. ఎందుకంటే ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారునికి మంచి రైడింగ్ అనుభవాన్ని కూడా ఇస్తుంది.

Source: Rushlane

Most Read Articles

English summary
KTM Motorcycle February Domestic Sales 5,394 units Details. Read in Telugu.
Story first published: Monday, March 22, 2021, 12:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X