పెట్రో మంట.. సిఎన్‌జి కార్ల పంట..: మారుతి సుజుకి బిగ్ ప్లాన్స్..

భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) తమ ప్రోడక్ట్ లైనప్ లో మరిన్ని కొత్త (సిఎన్‌జి) CNG మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు మరియు డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో సిఎన్‌జి కార్లకు డిమాండ్ పెరుగుతుందని కంపెనీ అభిప్రాయపడింది.

పెట్రో మంట.. సిఎన్‌జి కార్ల పంట..: మారుతి సుజుకి బిగ్ ప్లాన్స్..

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, మారుతి సుజుకి తమ సేల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిఎన్‌జి కార్ల అమ్మకాలను దాదాపు రెట్టింపు చేయాలని యోచిస్తోంది. మారుతి సుజుకి గడచిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.62 లక్షల సిఎన్‌జి కార్లను విక్రయించింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 3 లక్షల సిఎన్‌జి కార్లను విక్రయించాలని మారుతి సుజుకి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ భారీ ప్లాన్స్ చేస్తోంది.

పెట్రో మంట.. సిఎన్‌జి కార్ల పంట..: మారుతి సుజుకి బిగ్ ప్లాన్స్..

మారుతి సుజుకి విక్రయిస్తున్న 15 బ్రాండ్లలో కేవలం ఏడు మోడళ్లలో మాత్రమే CNG ఆప్షన్ అందుబాటులో ఉందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. మారుతి సుజుకి అతి త్వరలోనే మిగిలిన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో కూడా CNG కార్లను అందించాలని కంపెనీ చూస్తోంది. మారుతి సుజుకి ప్రస్తుతం ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఈకో, టూర్స్, ఎర్టిగా మరియు సూపర్ క్యారీ మోడల్లలో CNG వేరియంట్‌లను అందిస్తోంది.

పెట్రో మంట.. సిఎన్‌జి కార్ల పంట..: మారుతి సుజుకి బిగ్ ప్లాన్స్..

కంపెనీ ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టిన కొత్త తరం 2021 సెలెరియో మోడల్ లో కూడా CNG వెర్షన్ ను విడుదల చేయడానికి మారుతి సుజుకి సన్నాహాలు చేస్తోంది. మారుతి సుజుకి ప్రస్తుతం ఈ (సిఎన్‌జి కార్ల) విభాగంలో 85 శాతానికి పైగా మార్కెట్ వాటాతో దేశంలోనే అత్యధికంగా CNG కార్లను విక్రయించే కంపెనీగా అగ్రస్థానంలో ఉంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొత్తం 1.9 లక్షల యూనిట్ల సిఎన్‌జి వాహనాలను విక్రయించగా, వీటిలో 1.6 లక్షల యూనిట్లు మారుతి సుజుకి సంస్థకు చెందినవే కావడం విశేషం.

పెట్రో మంట.. సిఎన్‌జి కార్ల పంట..: మారుతి సుజుకి బిగ్ ప్లాన్స్..

దేశంలో సిఎన్‌జి వాహనాల వృద్ధిపై మరింత విశదీకరించిన శశాంక్ శ్రీవాస్తవ, భారతీయ కస్టమర్లు తమ కార్ల రన్నింగ్ కాస్ట్ విషయంలో చాలా సున్నితంగా ఉంటారని అన్నారు. ఈ కారణంగా, దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలతో సిఎన్‌జి కార్లకు డిమాండ్ పెరిగిందని ఆయన తెలిపారు. సిఎన్‌జి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ లో కొత్త నగరాలు చేరడంతో ఈ కార్ల విక్రయాలు కూడా పెరుగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా సిఎన్‌జి డిస్పెన్సింగ్ అవుట్‌లెట్‌లు కూడా వేగంగా పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది.

పెట్రో మంట.. సిఎన్‌జి కార్ల పంట..: మారుతి సుజుకి బిగ్ ప్లాన్స్..

దేశంలో ఒకప్పుడు 1,400 సిఎన్‌జి ఫిల్లింగ్ స్టేషన్లు మాత్రమే ఉండేవి, ఇప్పుడు ఈ సంఖ్య సుమారు 3,300 లకు దాటిందని మరియు రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో ఈ ఫిల్లింగ్ స్టేషన్ల సంఖ్య 8,700 దాటుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, 2025 నాటికి సిఎన్‌జి ఫిల్లింగ్ స్టేషన్ల సంఖ్య సుమారు 10,000 లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు.

పెట్రో మంట.. సిఎన్‌జి కార్ల పంట..: మారుతి సుజుకి బిగ్ ప్లాన్స్..

కొత్త తరం 2021 Celerio హ్యాచ్‌బ్యాక్ విడుదల

ఇదిలా ఉంటే, మారుతి సుజుకి గడచిన బుధవారం (నవంబర్ 10) నాడు భారత మార్కెట్లో తమ కొత్త తరం 2021 సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ను విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కారు ధరలు రూ. 4.99 లక్షల నుండి రూ. 6.94 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. కంపెనీ త్వరలోనే ఇందులో సిఎన్‌జి మోడల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సమాచారం ప్రకారం, కొత్త సెలెరియో యొక్క CNG మోడల్‌ను వ్యక్తిగత మరియు వాణిజ్య ఉపయోగం కోసం విడుదల చేయవచ్చు.

పెట్రో మంట.. సిఎన్‌జి కార్ల పంట..: మారుతి సుజుకి బిగ్ ప్లాన్స్..

మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి మోడల్ లాంచ్ కోసం నిర్దిష్ట కాలపరిమితిని ఇంకా వెల్లడించలేదు, అయితే CNG Celerio పెట్రోల్ మోడల్ కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని (మైలేజ్) కలిగి ఉంటుందని సమాచారం. పెట్రోల్ వెర్షన్ లీటరు గరిష్టంగా 26.68 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో కొత్త 1.0 లీటర్ 3-సిలిండర్ కె10సి డ్యూరాజెట్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 65 బిహెచ్‌పి శక్తిని మరియు 89 ఎన్ఎమ్ రిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

పెట్రో మంట.. సిఎన్‌జి కార్ల పంట..: మారుతి సుజుకి బిగ్ ప్లాన్స్..

ఇదిలా ఉంటే, మారుతి సుజుకి కొత్త సెలెరియో కోసం కంపెనీ రెండు విభిన్న యాక్సెసరీస్ ప్యాకేజీ లను కూడా ప్రవేశపెట్టింది. వీటిలో యాక్టివ్ అండ్ కూల్ (Active and Cool) ప్యాకేజ్ మరియు పెప్పీ అండ్ స్టైలిష్ (Peppy and Stylish) ప్యాకేజ్ లు ఉన్నాయి. యాక్టివ్ అండ్ కూల్ ప్యాకేజ్ రెడ్ లేదా సిల్వర్ కలర్ లో ఉంటుంది. మార్కెట్లో ఈ వీటి ధరలు వరుసగా రూ. 27,590 మరియు రూ. 24,590 లుగా ఉన్నాయి. ఇకపోతే, పెప్పీ అండ్ స్టైలిష్ (Peppy and Stylish) యాక్ససరీ ప్యాక్ ఆరెంజ్ కలర్ లో లభిస్తుంది మరియు దీని ధర రూ. 26,690 గా ఉంటుంది.

Most Read Articles

English summary
Maruti suzuki bullish on cng models aims to double cng185027
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X