మీ బైక్‌లో పిలియన్ రైడర్ కోసం ఇవి తప్పనిసరిగా ఉండాలి.. కొత్త టూవీలర్ రూల్స్..

భారతదేశంలో వాహనా చాలకుల భద్రత కోసం మన ప్రభుత్వం అనేక కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువస్తోంది. ఇందులోని కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా ఉన్నప్పటికీ, చివరికి అవి రోడ్డుపై వెళ్లే ఇతర ప్రజలు మరియు వాహన చాలకుల భద్రను ఉద్దేశించి తయారు చేసినవేనని మనం గుర్తుంచుకోవాలి.

మీ బైక్‌లో పిలియన్ రైడర్ కోసం ఇవి తప్పనిసరిగా ఉండాలి.. కొత్త టూవీలర్ రూల్స్..

తాజాగా, మోటార్‌సైక్లిస్టుల భద్రత కోసం కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త ఆదేశాలను జారీ చేసింది. బైక్‌పై వెనుక కూర్చునే వ్యక్తి (పిలియన్ రైడర్) సేఫ్టీ కోసం కొన్ని కొత్త మార్గదర్శకాలను సూచించింది. ఈ మేరకు సెంట్రల్ మోటారు వెహికల్ (ఏడవ సవరణ) నిబంధనలను 2020 తెలియజేసింది.

మీ బైక్‌లో పిలియన్ రైడర్ కోసం ఇవి తప్పనిసరిగా ఉండాలి.. కొత్త టూవీలర్ రూల్స్..

వీటికి అనుగుణంగా సెంట్రల్ మోటారు వెహికల్ నిబంధనల 1989ను సవరించే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఈ మార్గదర్శకాలను రూపొందించారు. ఇకపై అన్ని బైక్‌లకు వెనుక చక్రం సగం కవర్ అయ్యేలాగా శారీ గార్డులతో పాటు హ్యాండ్‌హోల్డ్‌లు, ఫుట్‌రెస్ట్‌లు తప్పనిసరిగా ఉండాలని ఈ నిబంధనల్లో పేర్కొన్నారు.

మీ బైక్‌లో పిలియన్ రైడర్ కోసం ఇవి తప్పనిసరిగా ఉండాలి.. కొత్త టూవీలర్ రూల్స్..

గడచిన కొన్ని సంవత్సరాలుగా, రహదారి భద్రతా నియమాలను కఠినతరం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే, రోడ్డు భద్రతకు సంబంధించిన నియమాలను మెరుగుపరుస్తూ, ప్రభుత్వం మన సెంట్రల్ మోటార్ వాహనాల చట్టాన్ని (1989) సవరించింది. ఆ వివరాలేంటో మరియు వాటి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి.

మీ బైక్‌లో పిలియన్ రైడర్ కోసం ఇవి తప్పనిసరిగా ఉండాలి.. కొత్త టూవీలర్ రూల్స్..

పిలియన్ రైడర్ కోసం హ్యాండ్‌హోల్డ్ తప్పనిసరి

తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం, మోటార్‌సైకిల్‌పై వెనుక కూర్చుకునే వ్యక్తి యొక్క భద్రత కోసం హ్యాండ్ హోల్డ్ తప్పనిసరిగా ఉండాలి. ప్రత్యేకించి వెనుక కూర్చుని ప్రయాణించే మహిళల భద్రత కోసం చేతి పట్టు ఉండడానికి మరియు బైక్ నడిపే వ్యక్తి అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు వెనుక కూర్చున్న వారు నిలకడగా ఉండటానికి ఈ హ్యాండ్ హోల్డ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మీ బైక్‌లో పిలియన్ రైడర్ కోసం ఇవి తప్పనిసరిగా ఉండాలి.. కొత్త టూవీలర్ రూల్స్..

సాధారణంగా, ఫ్యాక్టరీ నుండి వచ్చే మోటార్‌సైకిళ్లకు ఇలాంటి సదుపాయం ఉండదు. కస్టమర్లు దీనిని అదనపు యాక్ససరీగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అనేక రకాల స్పోర్ట్ బైక్‌లలో కూడా ఈ హ్యాండ్‌హోల్డ్ ఫీచర్ అందించబడదు. అయితే, ఇప్పుడు ఈ కొత్త నిబంధనల అమలు తర్వాత, అన్ని రకాల బైక్‌లలో హ్యాండ్‌హోల్డ్ తప్పనిసరి చేయబడింది.

మీ బైక్‌లో పిలియన్ రైడర్ కోసం ఇవి తప్పనిసరిగా ఉండాలి.. కొత్త టూవీలర్ రూల్స్..

పిలియన్ రైడర్ కోసం ఫుట్ రెస్టులు మరియు శారీ గార్డ్ తప్పనిసరి

బైక్‌పై వెనుక కూర్చుని ప్రయాణించే రైడర్ యొక్క సేఫ్టీ కోసం రియర్ ఫుట్ పెగ్స్ (కాళ్లు పెట్టుకునే స్టాండ్స్) మరియు శారీ గార్డ్ తప్పనిసరిగా ఉండాలని మరొక నిబంధన పెట్టారు. ప్రత్యేకించి మహిళల భద్రతను లక్ష్యంగా చేసుకొని ఈ నియమాన్ని తీసుకొచ్చారు. పిలియన్ రైడర్ బైక్‌పై వెనుక భాగంలో సౌకర్యవంతంగా కూర్చోవడానికి ఫుట్ పెగ్స్ ఉపయోపడుతాయి.

మీ బైక్‌లో పిలియన్ రైడర్ కోసం ఇవి తప్పనిసరిగా ఉండాలి.. కొత్త టూవీలర్ రూల్స్..

వెనుక టైరులో బట్టలు చిక్కుకోకుండా ఉండటానికి శారీ గార్డ్ ఉపయోగపడుతుంది. వెనుక టైరులో దుస్తులు చిక్కుకోవడం కారణంగా దేశంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఇందులో ఎక్కువగా బాధితులైనవారు మహిళలే అని ప్రభుత్వం తెలిపింది. సాధారణంగా శారీ గార్డును బైక్ వెనుక చక్రం యొక్క ఎడమ వైపు అమర్చుతారు.

మీ బైక్‌లో పిలియన్ రైడర్ కోసం ఇవి తప్పనిసరిగా ఉండాలి.. కొత్త టూవీలర్ రూల్స్..

బైక్‌లో తేలికైన కంటైనర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మినహాయింపు

కొత్త నిబంధనలలో భాగంగా, రవాణా మంత్రిత్వ శాఖ బైక్‌లలో తేలికైన కంటైనర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే, సదరు కంటైనర్ల ఇన్‌స్టాలేషన్ కోసం కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, కంటైనర్ పొడవు 550 మిమీ, వెడల్పు 510 మిమీ మరియు ఎత్తు 500 మిమీ మించకూడదు.

మీ బైక్‌లో పిలియన్ రైడర్ కోసం ఇవి తప్పనిసరిగా ఉండాలి.. కొత్త టూవీలర్ రూల్స్..

కంటైనర్‌ను వెనుక ప్యాసింజర్ సీటు వద్ద ఉంచబడితే, డ్రైవర్ మాత్రమే బైక్ నడపడానికి అనుమతించబడతాడు. అంటే, కంటైనర్ అమర్చిన బైక్ మీద పిలియన్ రైడర్ కూర్చోవడానికి అనుమతించబడదు. బైక్‌పై ఇతర రైడర్ కూర్చుంటే అది నిబంధన ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.

మీ బైక్‌లో పిలియన్ రైడర్ కోసం ఇవి తప్పనిసరిగా ఉండాలి.. కొత్త టూవీలర్ రూల్స్..

టైర్ల కోసం కొత్త మార్గదర్శకాలు అమలు చేయబడ్డాయి

టైర్ల కోసం కూడా కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం, గరిష్టంగా 3.5 టన్నుల బరువున్న వాహనాలలో తప్పనిసరిగా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలని సూచించబడింది. ఈ తరహా టెక్నాలజీ ఇప్పటికే కొన్ని మిడ్ మరియు హై-ఎండ్ కార్లలో అందుబాటులో ఉంది.

మీ బైక్‌లో పిలియన్ రైడర్ కోసం ఇవి తప్పనిసరిగా ఉండాలి.. కొత్త టూవీలర్ రూల్స్..

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌లోని సెన్సార్లు ఎప్పటికప్పుడు టైర్లలో ఉండే గాలి పీడనాన్ని గుర్తించి, రైడర్‌కు సమాచారాన్ని ఇస్తుంటాయి. ఒకవేళ టైర్లలో గాలి తగ్గినట్లయితే, రైడర్ దానిని గుర్తించి వెంటనే టైర్లలో గాలిని నింపుకోవటం లేదా మరమ్మత్తు చేయించుకోవటం చేయవచ్చు. దీంతో పాటుగా వాహన తయారీ సంస్థలు కస్టమర్లు పంక్చర్ రిపేర్ కిట్లను కూడా అందించాలని కేంద్రం సూచించింది.

మీ బైక్‌లో పిలియన్ రైడర్ కోసం ఇవి తప్పనిసరిగా ఉండాలి.. కొత్త టూవీలర్ రూల్స్..

దేశంలో వాహన స్క్రాపింగ్ విధానం అమలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వాహన స్క్రాపింగ్ విధానాన్ని దేశంలో అమలు చేసింది. ఈ కొత్త వెహికల్ స్క్రాపింగ్ విధానం ప్రకారం, నిర్ధిష్ట కాల పరిమితిని దాటిన తర్వాత పాత వాహనాలను స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. అలా కాదని, వాటిని ఆపై కూడా ఉపయోగించాలనుకుంటే, భారీ పన్నులు మరియు తరచూ ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.

Most Read Articles

English summary
Morth issues new guidelines for two wheelers in view of pillion rider safety
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X