ఇండియన్ మార్కెట్లో అత్యంత చీపెస్ట్ బైక్స్ ; ధర తక్కువ & మైలేజ్ ఎక్కువ

భారతమార్కెట్లో రోజు రోజుకి వాహన కొనుగోలుదారులు ఎక్కువవుతున్నారు. ఈ క్రమంలో వాహనాల ధరలు గత కొన్నినెలలుగా చాపకింద నీరులా ప్రవహిస్తున్నాయి. కార్లు మరియు బైక్స్ అమ్మకాలలో బైక్స్ అమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో ధరల పెరుగుదల తర్వాత కూడా బైక్స్ అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు. ఇండియన్ మార్కెట్లో అతితక్కువ ధరలో గోనుగోలుచేయదగిన తక్కువ బడ్జెట్‌ బైకుల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఇండియన్ మార్కెట్లో అత్యంత చీపెస్ట్ బైక్స్ ; ధర తక్కువ & మైలేజ్ ఎక్కువ

బజాజ్ సిటి 100 :

బజాజ్ కంపెనీ యొక్క బజాజ్ సిటి 100 దేశంలో అత్యంత చౌకైన బైక్. ఈ బజాజ్ సిటి 100 ప్రారంభ ధర రూ. 47,654 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ కిక్ స్టార్ట్ మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

ఈ బైక్‌లో 102 సిసి డిటిఎస్‌ఐ ఇంజన్ ఉంది, ఇది మంచి పికప్‌తో పాటు మైలేజీని ఇస్తుంది. బజాజ్ సిటి 100 ఇంజన్ 7.9 బిహెచ్‌పి పవర్ మరియు 8.34 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ట్రాన్స్మిషన్ కోసం 4-స్పీడ్ గేర్బాక్స్ కలిగి ఉంది. ఈ బైక్ అనేక ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇండియన్ మార్కెట్లో అత్యంత చీపెస్ట్ బైక్స్ ; ధర తక్కువ & మైలేజ్ ఎక్కువ

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ :

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అనేది కంపెనీ యొక్క అత్యంత సరసమైన ధర వద్ద లభించే బైక్. ఈ బైక్ కిక్ స్టార్ట్ స్పోక్, కిక్ స్టార్ట్ అల్లాయ్, సెల్ఫ్ స్టార్ట్ మరియు సెల్ఫ్ స్టార్ట్ ఐ 3 ఎస్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ధర దేశీయ మార్కెట్లో రూ. 50,200 (ఎక్స్‌షోరూమ్).

MOST READ:భారతమార్కెట్లో 2021 మార్చి నెలలో విడుదలైన కార్లు; పూర్తి వివరాలు

ఇండియన్ మార్కెట్లో అత్యంత చీపెస్ట్ బైక్స్ ; ధర తక్కువ & మైలేజ్ ఎక్కువ

ఈ బైక్ 97.2 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంది, ఇది 8.02 బిహెచ్‌పి శక్తిని మరియు 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఇది మంచి మైలేజ్ అందిస్తుంది, కావున దేశీయ మార్కెట్లో ఎక్కువమంది వినియోగదారులు ఈ బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

ఇండియన్ మార్కెట్లో అత్యంత చీపెస్ట్ బైక్స్ ; ధర తక్కువ & మైలేజ్ ఎక్కువ

బజాజ్ ప్లాటినా 100:

బజాజ్ కంపెనీ యొక్క మరో అత్యంత సరసమైన బైక్ ఈ బజాజ్ ప్లాటినా 100. ఇద CT100 యొక్క అప్‌గ్రేడ్ వేరియంట్, ఈ బైక్ CT100 కన్నా మెరుగైన పనితీరు, ఫీచర్స్ మరియు ఇంధన వ్యవస్థను అందిస్తుంది. బజాజ్ ప్లాటినా 100 కిక్ స్టార్ట్, ఎలక్ట్రిక్ స్టార్ట్ మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్లలో లభిస్తుంది.

MOST READ:సైకిల్ వాలా దోశకి బలే డిమాండ్ గురూ.. ఎక్కడో తెలుసా?

ఇండియన్ మార్కెట్లో అత్యంత చీపెస్ట్ బైక్స్ ; ధర తక్కువ & మైలేజ్ ఎక్కువ

బజాజ్ ప్లాటినా 100 ధర 52,166 రూపాయల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్‌లో 102 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది, ఇది 7.9 బిహెచ్‌పి పవర్ మరియు 8.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా భారత మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళ్తోంది.

ఇండియన్ మార్కెట్లో అత్యంత చీపెస్ట్ బైక్స్ ; ధర తక్కువ & మైలేజ్ ఎక్కువ

టీవీఎస్ స్పోర్ట్:

టీవీఎస్ స్పోర్ట్ టీవీఎస్ కంపెనీ యొక్క అత్యంత చీపెస్ట్ బైక్. ఈ బైక్ కిక్ స్టార్ట్ మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ మోడళ్లలో అందుబాటులో ఉంది. టీవీఎస్ స్పోర్ట్ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 56,100 వద్ద లభించింది. ఈ బైక్‌లో 109.7 సిసి ఇంజన్ ఉంది, ఇది 8.29 బిహెచ్‌పి పవర్ మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ

ఇండియన్ మార్కెట్లో అత్యంత చీపెస్ట్ బైక్స్ ; ధర తక్కువ & మైలేజ్ ఎక్కువ

హోండా సిడి 110 డ్రీమ్:

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ యొక్క లైనప్‌లో హోండా సిడి డ్రీమ్ 110 అత్యంత సరసమైన బైక్. ఈ బైక్ స్టాండర్డ్ మరియు డీలక్స్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. హోండా సిడి డ్రీమ్‌లో 109 సిసి ఇంజన్ ఉంది, ఇది 8.79 బిహెచ్‌పి పవర్ మరియు 9.30 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ .64,508.

ఇండియన్ మార్కెట్లో అత్యంత చీపెస్ట్ బైక్స్ ; ధర తక్కువ & మైలేజ్ ఎక్కువ

పైన తెలిపిన బైకులు అత్యంత సరసమైన బైకులు మాత్రమే కాదు, మంచి మైలేజ్ అందించే బైకులు కూడా. ఇవన్నీ దేశీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వీటికున్న మంచి ఫీచర్స్ మరియు మంచి ఇంధన సామర్త్యం వీటి అమ్మకాలను మరింత మెరుగుపరుస్తుంది.

MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

Most Read Articles

English summary
Most Affordable Bikes In India. Read in Telugu.
Story first published: Wednesday, March 31, 2021, 18:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X