దేశీయ మార్కెట్లో ఉన్న పవర్‌ఫుల్ బైకులు.. ధర 2 లక్షల లోపు మాత్రమే

భారతదేశంలో రోజు రోజుకి బైకులకు డిమాండ్ పెరుగుతోంది. ఉన్న డిమాండ్ కి అనుకూలంగానే దేశీయ మార్కెట్లో బైక్ తయారీదారులు కూడా అప్డేటెడ్ బైక్స్ ప్రవేశపెట్టింది. ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్లో పవర్‌ఫుల్ బైక్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. కస్టమర్ల అనుభూతికి అనుకూలంగా చాలా రకాల బైకులు అందుబాటులో ఉన్నాయి.

భారత మార్కెట్లో పవర్‌ఫుల్ బైక్‌ల విభాగంలో చాలా ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో 2 లక్షల కన్నా తక్కువ ధరకు అమ్ముడవుతున్న పవర్‌ఫుల్ బైక్‌ల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో ఉన్న పవర్‌ఫుల్ బైకులు.. ధర 2 లక్షల లోపు మాత్రమే

బజాజ్ డామినార్ 250:

బజాజ్ డామినార్ 250 బైక్ మనం చెప్పుకుంటున్న విభాగంలో ఉత్తమమైన బైక్. బజాజ్ డామినార్ 250 ధర రూ. 1.71 లక్షలు. బజాజ్ డామినార్ 250 బైక్ స్పర్టియర్ డిజైన్‌తో ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. బజాజ్ డామినార్ 250 బైక్, డామినార్ 400 బైక్ మాదిరిగానే ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఉన్న పవర్‌ఫుల్ బైకులు.. ధర 2 లక్షల లోపు మాత్రమే

బజాజ్ డామినార్ 250 లో కెటిఎం 250 డ్యూక్‌లో ఉపయోగించిన 248 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 26.6 బిహెచ్‌పి మరియు 23.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఉన్న పవర్‌ఫుల్ బైకులు.. ధర 2 లక్షల లోపు మాత్రమే

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250:

సుజుకి క్వార్టర్ లీటర్ జిక్సర్ ఎస్ఎఫ్ 250 ఈ విభాగంలో మరో పవర్ ఫుల్ బైక్. ఈ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 ధర రూ. 1.78 లక్షలు. ఈ బైక్ కొత్తగా రూపొందించిన ట్యాంక్‌లో ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్‌లతో ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది.

దేశీయ మార్కెట్లో ఉన్న పవర్‌ఫుల్ బైకులు.. ధర 2 లక్షల లోపు మాత్రమే

జిక్సర్ 250 మరియు జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైక్‌లలో బిఎస్-6 249 సిసి ఇంజన్ కలిగి ఉంది. ఈ ఇంజన్ 26.1 బిహెచ్‌పి శక్తి మరియు 22.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

దేశీయ మార్కెట్లో ఉన్న పవర్‌ఫుల్ బైకులు.. ధర 2 లక్షల లోపు మాత్రమే

కెటిఎమ్ డ్యూక్ 200:

కెటిఎమ్ డ్యూక్ 200 భారతదేశంలో విపరీతమైన ప్రజాదరణ పొందింది మోడల్స్ లో ఒకటి. ఈ బైక్ ధర రూ. 1.83 లక్షలు. కెటిఎమ్ 200 డ్యూక్ లో 199 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 24.6 బిహెచ్‌పి శక్తి మరియు 19.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఉన్న పవర్‌ఫుల్ బైకులు.. ధర 2 లక్షల లోపు మాత్రమే

హస్క్వర్నా స్వర్ట్‌పిలెన్ 250 బైక్:

హస్క్వర్నా స్వర్ట్‌పిలీన్ 250 బైక్‌ నియో-రెట్రో స్క్రాంబ్లర్ డిజైన్ లో ఉంది. విట్‌పిలీన్ 250 బైక్ కేఫ్‌లో రేసర్ స్టైలింగ్ లో ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ప్రకారం ఈ బైక్ ధర రూ. 1.99 లక్షలు.

దేశీయ మార్కెట్లో ఉన్న పవర్‌ఫుల్ బైకులు.. ధర 2 లక్షల లోపు మాత్రమే

హస్క్వర్నా స్వర్ట్‌పిలీన్ 250 బైక్‌లో 248.8 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 29.5 బిహెచ్‌పి పవర్ మరియు 24 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లకు కెటిఎం బైక్‌ల మాదిరిగానే ట్రేల్లిస్ ఫ్రేమ్ సిస్టమ్‌ను అందిస్తారు. ఈ సిస్టం బైక్ యొక్క రూపాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

దేశీయ మార్కెట్లో ఉన్న పవర్‌ఫుల్ బైకులు.. ధర 2 లక్షల లోపు మాత్రమే

జావా పెరాక్:

2 లక్షల రూపాయల కంటే తక్కువ ధర కలిగిన మోటార్ సైకిల్ విభాగంలో జావా పెరాక్ కూడా మంచి ప్రజాదరణ పొందిన బైక్. తక్కువ ధరతో మీరు కొనుగోలు చేయగల ఉత్తమ స్టైల్ కలిగిన బైక్ ఈ జావా పెరాక్. ఎక్స్-షోరూమ్ ప్రకారం ఈ బైక్ ధర రూ. 1.97 లక్షలు. జావా పెరాక్ బైక్‌లో పొడవైన వీల్‌బేస్ ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఉన్న పవర్‌ఫుల్ బైకులు.. ధర 2 లక్షల లోపు మాత్రమే

జావా పెరాక్ బైక్‌లో 334 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్‌సి ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 30 బిహెచ్‌పి పవర్ మరియు 31 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ కి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Most Powerful Bikes Under Rs 2 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X