జులై 2021లో లాంచ్ అయిన టూవీలర్స్: గ్లామర్, ఎన్‌టార్క్, ఫాసినో, ఎఫ్‌జి25..

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో గడచిన ఏప్రిల్ నెల నుండి స్తబ్దుగా ఉన్న భారత ఆటోమొబైల్ మార్కెట్, తాజాగా ఈ జులై నెలలో లాక్‌డౌన్ సవరణలతో మంచి జోరును కనబరిచింది. గత జూలై 2021 నెలలో భారత మార్కెట్లో అనేక కొత్త ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి వచ్చాయి.

జులై 2021లో లాంచ్ అయిన టూవీలర్స్: గ్లామర్, ఎన్‌టార్క్, ఫాసినో, ఎఫ్‌జి25..

వీటిలో కొన్ని మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు మరియు లగ్జరీ బైక్‌లు కూడా ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా జులై 2021లో విడుదలైన టూవీలర్ల వివరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

జులై 2021లో లాంచ్ అయిన టూవీలర్స్: గ్లామర్, ఎన్‌టార్క్, ఫాసినో, ఎఫ్‌జి25..

1. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎక్స్‌పి

టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న పాపులర్ 125 సిసి స్కూటర్ ఎన్‌టార్క్ 125 మోడల్‌లో కంపెనీ రేస్ ఎక్స్‌పి పేరిచ ఓ స్పెషల్ ఎడిషన్‌ను జూలై 6న మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో దీని ధర రూ.83,275 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త ఫీచర్లు మరియు టెక్నాలజీతో కంపెనీ ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎక్స్‌పి ఎడిషన్‌లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లతో పాటు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది.

జులై 2021లో లాంచ్ అయిన టూవీలర్స్: గ్లామర్, ఎన్‌టార్క్, ఫాసినో, ఎఫ్‌జి25..

2. బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ మరియు జిఎస్ అడ్వెంచర్

బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ జూలై 8న కొత్తగా అప్‌డేట్ చేయబడిన 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ అడ్వెంచర్ మోడళ్లను మార్కెట్లో విడల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ లగ్జరీ బైక్‌ల ధరలు వరుసగా రూ.20.45 లక్షలు మరియు రూ.22.40 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

జులై 2021లో లాంచ్ అయిన టూవీలర్స్: గ్లామర్, ఎన్‌టార్క్, ఫాసినో, ఎఫ్‌జి25..

3. యమహా ఎఫ్‌‌జి25 మోటోజిపి ఎడిషన్

యమహా మోటార్‌సైకిల్ ఇండియా తమ ఎఫ్‌జి25 యొక్క మాన్స్టర్ ఎనర్జీ యమహా మోటోజిపి ఎడిషన్‌ను జూలై 20న మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ బైక్‌ ధర రూ.1,36,800 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. యమహా ఎఫ్‌‌జి25 మోటోజిపి ఎడిషన్ పరిమిత సంఖ్యలో (లిమిటెడ్ ఎడిషన్) మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

జులై 2021లో లాంచ్ అయిన టూవీలర్స్: గ్లామర్, ఎన్‌టార్క్, ఫాసినో, ఎఫ్‌జి25..

4. హీరో గ్లామర్ ఎక్స్‌టెక్

హీరో మోటోకార్ప్ అందిస్తున్న పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ గ్లామర్‌లో కంపెనీ ఎక్స్‌టెక్ పేరిట ఓ సరికొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. జులై 20న కంపెనీ ఈ హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ మోడల్‌ను విడుదల చేసింది. మార్కెట్లో దీని డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.78,900 (ఎక్స్-షోరూమ్) కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.83,500 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో లభిస్తుంది.

జులై 2021లో లాంచ్ అయిన టూవీలర్స్: గ్లామర్, ఎన్‌టార్క్, ఫాసినో, ఎఫ్‌జి25..

5. డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4

ఇటాలియన్ సూపర్ బైక్ కంపెనీ డ్యుకాటి జులై 22న తమ మల్టీస్ట్రాడా వి4 ప్రీమియం బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 రూ.18.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరర్ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వీటిలో స్టాండర్డ్, వి4 ఎస్ మరియు వి4 ఎస్ స్పోర్ట్ అనే వేరియంట్లు ఉన్నాయి.

జులై 2021లో లాంచ్ అయిన టూవీలర్స్: గ్లామర్, ఎన్‌టార్క్, ఫాసినో, ఎఫ్‌జి25..

6. యమహా ఫాసినో 125 హైబ్రిడ్

యమహా మోటార్ ఇండియా అందిస్తున్న ఫాసినో స్కూటర్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. యమహా ఫాసినో 125 హైబ్రిడ్ పేరిట కంపెనీ ఈ వేరియంట్ జులై 22న మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.70,000 (ఎక్స్-షోరూమ్) కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.76,530 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

జులై 2021లో లాంచ్ అయిన టూవీలర్స్: గ్లామర్, ఎన్‌టార్క్, ఫాసినో, ఎఫ్‌జి25..

7. బెనెల్లి 502సి అర్బన్ క్రూయిజర్

ఇటాలియన్ ప్రీమియం టూవీలర్ బ్రాండ్ బెనెల్లీ, జులై 29న తమ సరికొత్త 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ ధర రూ.4.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్‌లో శక్తివంతంమైన 502 సిసి ట్విన్ సిలిండర్, డిఓహెచ్‌సి ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పి శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 45 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Motorcycles And Scooters Launched In India In July 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X