MV Agusta బ్రాండ్ నుండి తొలిసారిగా రెండు అడ్వెంచర్ బైక్స్..

ఇటాలియన్ మోటార్‌సైకిల్ తయారీదారు ఎమ్‌వి అగస్టా (MV Agusta) రెండు సరికొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించింది. ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతున్న 2021 EICMA షోలో ఎమ్‌వి అగస్టా తమ సరికొత్త లక్కీ ఎక్స్‌ప్లోరర్ 9.5 (Lucky Explorer 9.5) మరియు లక్కీ ఎక్స్‌ప్లోరర్ 5.5 (Lucky Explorer 5.5) అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ప్రదర్శించింది. మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

MV Agusta బ్రాండ్ నుండి తొలిసారిగా రెండు అడ్వెంచర్ బైక్స్..

ఎమ్‌వి అగస్టా లక్కీ ఎక్స్‌ప్లోరర్ 9.5 మరియు లక్కీ ఎక్స్‌ప్లోరర్ 5.5 రెండూ కూడా ఈ ఇటాలియన్ సూపర్ బైక్ బ్రాండ్ నుండి మొట్టమొదటిసారిగా వస్తున్న అడ్వెంచర్ బైక్స్ కావటం విశేషం. ఎమ్‌వి అగస్టా ఇప్పటి వరకూ హై-ఎండ్ మోటార్‌సైకిళ్లు మరియు సూపర్ స్పోర్ట్ బైక్స్ ను మాత్రమే తయారు చేస్తూ వచ్చింది. కాగా, ఇప్పుడు తొలిసారిగా లక్కీ ఎక్స్‌ప్లోరర్ 9.5 మరియు లక్కీ ఎక్స్‌ప్లోరర్ 5.5 బైక్స్ విడుదలతో అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలోకి చేరింది.

MV Agusta బ్రాండ్ నుండి తొలిసారిగా రెండు అడ్వెంచర్ బైక్స్..

ఈ రెండింటిలో పేరు సూచించినట్లుగానే లక్కీ ఎక్స్‌ప్లోరర్ 9.5 బైక్ లక్కీ ఎక్స్‌ప్లోరర్ 5.5 కన్నా పెద్దదిగా ఉంటుంది. ఎమ్‌వి అగస్టా లక్కీ ఎక్స్‌ప్లోరర్ 9.5 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ లో సరికొత్త 930.63 సిసి ట్రిపుల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఎమ్‌వి అగస్టా యొక్క ప్రస్తుత 798 సిసి ట్రిపుల్ సిలిండర్ ఇంజన్ ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త ఇంజన్ ను రూపొందించారు. దీని డిస్‌ప్లేస్‌మెంట్ (ఇంజన్ సిసి) ని పెంచడానికి ఇంజన్ యొక్క బోర్ మరియు స్ట్రోక్‌ లను పెంచారు.

MV Agusta బ్రాండ్ నుండి తొలిసారిగా రెండు అడ్వెంచర్ బైక్స్..

ఫలితంగా, ఇప్పుడు ఈ (930.63 సిసి) ఇంజన్ గరిష్టంగా 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 121 బిహెచ్‌పి పవర్ ను మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 101.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా రెక్లూస్ ఆటోమేటిక్ క్లచ్ మరియు సెమీ ఆటోమేటిక్, ఎలక్ట్రానిక్ యాక్చువేటెడ్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఎమ్‌వి అగస్టా లక్కీ ఎక్స్‌ప్లోరర్ 9.5 ఫేక్ స్టీల్ ఫ్రేమ్ మరియు డబుల్ సైడెడ్ అల్యూమినియం స్వింగార్మ్‌ లను కలిగి ఉంటుంది.

MV Agusta బ్రాండ్ నుండి తొలిసారిగా రెండు అడ్వెంచర్ బైక్స్..

ఈ అడ్వెంచర్ బైక్‌లో లాంగ్ ట్రావెల్ సెమీ-యాక్టివ్ సాక్స్ సస్పెన్షన్ (220 మిమీ ముందు మరియు 210 వెనుక ట్రావెల్‌తో) మరియు 21 ఇంచ్ ప్రంట్ రిమ్ మరియు 18 ఇంచ్ రియర్ రిమ్ లను కలిగి ఉంది. ఉత్తమ ఆఫ్-రోడింగ్ సామర్థ్యం కోసం ఇందులో స్పోక్డ్ వీల్స్ ను ఉపయోగించారు మరియు వాటిపై నాబీ ఆఫ్-రోడ్ టైర్‌లను ఉపయోగించారు. ఈ బైక్ యొక్క సీటు ఎత్తు భూమి నుండి 850 మిమీ ఉంటుంది, అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ 230 మిమీగా ఉంటుంది. ఈ అడ్వెంచర్ బైక్ 9.5 1,580 మీమీ వద్ద చాలా పొడవైన వీల్‌బేస్‌ను కూడా కలిగి ఉంది.

MV Agusta బ్రాండ్ నుండి తొలిసారిగా రెండు అడ్వెంచర్ బైక్స్..

ఎమ్‌వి అగస్టా లక్కీ ఎక్స్‌ప్లోరర్ 9.5 యొక్క బరువు 220 కిలోలు మరియు దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 20 లీటర్లుగా ఉంటుంది. ఇక ఇందులో చిన్నదైన ఎమ్‌వి అగస్టా లక్కీ ఎక్స్‌ప్లోరర్ 5.5 అడ్వెంచర్ బైక్ విషయానికి వస్తే, దీనిని చైనీస్ బ్రాండ్ అయిన Qianjiang మోటార్‌సైకిల్ (QJ మోటార్ అని పిలుస్తారు) సహాయంతో అభివృద్ధి చేశారు. లక్కీ ఎక్స్‌ప్లోరర్ 5.5 బైక్ లో క్యూజే మోటార్ ఎస్ఆర్‌టి 500 మరియు బెనెల్లీ టిఆర్‌కె 502 నుండి అనేక భాగాలను తీసుకుని నిర్మించారు.

MV Agusta బ్రాండ్ నుండి తొలిసారిగా రెండు అడ్వెంచర్ బైక్స్..

ఒకవేళ మీకు ఇందులో బెనెల్లీ భాగాలను ఎందుకు ఉపయోగించారనే సందేహం వచ్చినట్లయితే, మీ సమాచారం కొరకు ఎమ్‌వి అగస్టా మరియు బెనెల్లీ రెండు టూవీలర్ బ్రాండ్లు కూడా ప్రస్తుతం QJ మోటార్ యాజమాన్యంలో ఉన్నాయని గ్రహించండి. ఇక ఎమ్‌వి అగస్టా లక్కీ ప్లోరర్ 5.5 ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 550 సిసి లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 46 బిహెచ్‌పి శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 51 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

MV Agusta బ్రాండ్ నుండి తొలిసారిగా రెండు అడ్వెంచర్ బైక్స్..

ఎమ్‌వి అగస్టా లక్కీ ఎక్స్‌ప్లోరర్ 5.5 యొక్క ఇంజన్ ప్రాథమికంగా బెనెల్లీ టిఆర్‌కె 502 బైక్ లోని ఇంజన్ యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్ గా ఉంటుంది. లక్కీ ఎక్స్‌ప్లోరర్ 5.5 కూడా అదే బెనెల్లీ 2 టిఆర్‌కె ఫ్రేమ్‌ని కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో తలక్రిందులుగా ఉండే (అప్ సైడ్ డౌన్) ఫోర్కులు మరియు వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ మరియు అల్లాయ్ స్వింగార్మ్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక వైపున ఒకే డిస్క్ బ్రేక్ ఉంటుంది.

MV Agusta బ్రాండ్ నుండి తొలిసారిగా రెండు అడ్వెంచర్ బైక్స్..

ఇంకా ఇందులో 19 ఇంచ్ ఫ్రంట్ వీల్ మరియు 17 ఇంచ్ రియల్ వీల్ మరియు వాటిపై అమర్చిన రోడ్ ఫోకస్డ్ టైర్‌లు ఉంటాయి. ఈ బైక్ లో కూడా 20 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది మరియు దీని మొత్తం బరువు 220 కిలోగ్రాములుగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది 210 మిమీగా ఉంటుంది. లక్కీ ఎక్స్‌ప్లోరర్ 9.5 మరియు లక్కీ ఎక్స్‌ప్లోరర్ 5.5 రెండు బైక్‌లలో కూడా రైడర్లకు సహకరించే బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన 7 ఇంచ్ TFT డిస్‌ప్లే మరియు సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడానికి వైఫై కనెక్టివిటీ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Mv agusta unveils lucky explorer 9 5 and 5 5 adventure motorcycles at 2021 eicma details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X