ఎలక్ట్రిక్ సైకిల్ బుక్ చేసుకోండి.. హోమ్ డెలివరీ పొందండి; నహక్ మోటార్స్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకున్న ప్రాధాన్యత రోజురోజుకి ఎక్కువవుతోంది. ఈ తరుణంలో చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు దేశీయ మార్కెట్లో పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ కంపెనీ నహక్ మోటార్స్ తన రెండు ఇ-సైకిల్స్ గరుడ మరియు జిప్పీలల యొక్క హోమ్ డెలివరీలను ప్రకటించింది.

ఎలక్ట్రిక్ సైకిల్ బుక్ చేసుకోండి.. హోమ్ డెలివరీ పొందండి; నహక్ మోటార్స్

నహక్ మోటార్స్ యొక్క ఈ రెండు ఈ-సైకిల్స్ వంద శాతం పూర్తిగా దేశీయ మార్కెట్లో తయారైనవే. మార్కెట్లో గరుడ సైకిల్ ధర రూ. 31,999 కాగా, జిప్పీ సైకిల్ ధర రూ. 33,499 వరకు ఉంది. ఈ సైకిళ్ల కోసం కంపెనీ దేశవ్యాప్తంగా బుకింగ్‌లను ప్రారంభించింది. దీని ప్రకారం మొదటి దశ బుకింగ్స్ 2021 జూలై 2 నుండి 2021 జూలై 11 వరకు ఓపెన్ లో ఉంటుంది.

ఎలక్ట్రిక్ సైకిల్ బుక్ చేసుకోండి.. హోమ్ డెలివరీ పొందండి; నహక్ మోటార్స్

ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు నహక్ మోటార్స్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు www.nahakmotors.eco అనే వెబ్‌సైట్‌కు వెళ్లి తమకు నచ్చిన మోడల్‌ను సెలక్ట్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు.

ఎలక్ట్రిక్ సైకిల్ బుక్ చేసుకోండి.. హోమ్ డెలివరీ పొందండి; నహక్ మోటార్స్

బుక్ చేసుకోవాలనే వినియోగదారులు ముందుగా 2,999 రూపాయలు చెల్లించి ఈ సైకిళ్లను బుక్ చేసుకోవచ్చు. నహక్ మోటార్స్ జూలై 13 లోగా వినియోగదారులందరికీ ఇ-సైకిల్స్ పంపిణీని షెడ్యూల్ చేస్తుంది.

ఎలక్ట్రిక్ సైకిల్ బుక్ చేసుకోండి.. హోమ్ డెలివరీ పొందండి; నహక్ మోటార్స్

బుకింగ్స్ పూర్తి చేసుకున్న తర్వాత కంపెనీ 2021 ఆగస్టు 15 నుండి సైకిల్స్ హోమ్ డెలివరీ చేయనుంది. ఈ రెండు సైకిళ్ళు చాలా లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ రిమూవబుల్ బ్యాటరీ, ఎల్‌సిడి డిస్‌ప్లే మరియు పెడల్ సెన్సార్ టెక్నాలజీ వంటి వాటిని ఉపయోగించింది.

ఎలక్ట్రిక్ సైకిల్ బుక్ చేసుకోండి.. హోమ్ డెలివరీ పొందండి; నహక్ మోటార్స్

ఈ సైకిళ్లలో ఏర్పాటు చేసిన బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 3 గంటలు పడుతుంది. ఛార్జర్‌ను సాధారణ ఎలక్ట్రిక్ సాకెట్‌లోకి ప్లగ్ చేయడం ద్వారా ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ సైకిళ్ళు పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు.

ఎలక్ట్రిక్ సైకిల్ బుక్ చేసుకోండి.. హోమ్ డెలివరీ పొందండి; నహక్ మోటార్స్

ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను రోడ్లపై నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను నడపడానికి కిలోమీటరుకు 10 పైసలు మాత్రమే ఖర్చవుతుందని నహక్ మోటార్స్ కంపెనీ పేర్కొంది. కావున ఇది కస్టమర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ సైకిల్ బుక్ చేసుకోండి.. హోమ్ డెలివరీ పొందండి; నహక్ మోటార్స్

కంపెనీ హోమ్ డెలివరీ కాన్సెప్ట్ గురించి నహక్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రవత్ నహక్ మాట్లాడుతూ, మేము ఈ సంవత్సరం ప్రారంభంలో మా ఎలక్ట్రిక్ సైకిళ్లను ప్రారంభించాము. అప్పటి నుండి చాలా మంది ఈ సైకిళ్ల గురించి ఆరా తీస్తున్నారు. అయితే, కోవిడ్ 19 కారణంగా ఈ సైకిళ్ల ఉత్పత్తి కొంతవరకు మందగించిందన్నారు.

ఎలక్ట్రిక్ సైకిల్ బుక్ చేసుకోండి.. హోమ్ డెలివరీ పొందండి; నహక్ మోటార్స్

ప్రస్తుతం ఎలక్ట్రిక్ సైకిళ్లకు భారీ డిమాండ్ ఉంది, కావున మేము ఎలక్ట్రిక్ సైకిల్స్ ఉత్పత్తి చేశామని, వాటిని కస్టమర్ ఇంటి వద్దకు అందించడానికి నిర్ణయించుకున్నారు. మేము ఇదివరకు ప్రకటించినట్లుగానే ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను ఆగస్టు 15 నుండి వినియోగదారుల హోమ్ డెలివరీ చేస్తామని వారు స్పష్టం చేశారు.

Most Read Articles

English summary
Nahak Motors Starts Online Booking For Garuda And Zippy Electric-Bicycles. Read in Telugu.
Story first published: Monday, July 5, 2021, 16:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X