జపాన్ మార్కెట్లో కొత్త 2021 హోండా డియో స్కూటర్ విడుదల; ఫీచర్లు

భారతదేశపు యువత అత్యధికంగా ఆదరించే యూత్ స్కూటర్ హోండా డియో ఇప్పుడు జపాన్ మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. జపాన్ మార్కెట్లో కొత్త 2021 హోండా డియో స్కూటర్‌ను హోండా టూవీలర్స్ కంపెనీ ఆవిష్కరించింది.

జపాన్ మార్కెట్లో కొత్త 2021 హోండా డియో స్కూటర్ విడుదల; ఫీచర్లు

హోండా డియా స్కూటర్ స్టైలిష్ రూపం మరియు స్పోర్టీ పెర్ఫార్మెన్స్‌తో యువ కొనుగోలుదారులను తొలిచూపులోనే ఆకట్టుకుంటోంది. మంచి రోడ్ ప్రెజెన్స్ కలిగి ఈ స్కూటర్ ఇప్పుడు తాజాగా జపాన్ మార్కెట్లో కూడా లభ్యం కానుంది.

జపాన్ మార్కెట్లో కొత్త 2021 హోండా డియో స్కూటర్ విడుదల; ఫీచర్లు

అయితే, జపాన్ మార్కెట్లో విడుదలైన కొత్త 2021 హోండా డియో స్కూటర్, ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న డియో మోడల్ కన్నా కాస్తంత భిన్నంగా ఉంటుంది. ఈ కొత్త మోడల్‌లో హెడ్‌ల్యాంప్ మరియు టర్న్ ఇండికేటర్ ల్యాంహ్ హౌసింగ్ చాలా కొత్తగా అనిపిస్తుంది.

జపాన్ మార్కెట్లో కొత్త 2021 హోండా డియో స్కూటర్ విడుదల; ఫీచర్లు

ఇందులో హెడ్‌ల్యాంప్ హ్యాండిల్ బార్‌కు అమర్చబడి ఉంటుంది. టర్న్ ఇండికేటర్స్ మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను ఫ్రంట్ బాడీ క్లస్టర్‌లో అమర్చబడి ఉంటాయి. అయితే, ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం అలానే ఉంటుంది.

జపాన్ మార్కెట్లో కొత్త 2021 హోండా డియో స్కూటర్ విడుదల; ఫీచర్లు

ఈ స్పోర్టీ హోండా డియో స్కూటర్‌లో సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, ఇది స్కూటర్ స్పీడ్, ఇంధన స్థాయి మరియు ఇతర ప్రాథమిక సమాచారాన్ని రైడర్‌కు తెలియజేస్తుంది. ఇంకా ఇందులో ఇంజన్ ఇమ్మొబిలైజర్, హాఫ్ లీటర్ వాటర్ బాటిలో హోల్డర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

జపాన్ మార్కెట్లో కొత్త 2021 హోండా డియో స్కూటర్ విడుదల; ఫీచర్లు

ఈ స్కూటర్ సీట్ క్రింది భాగంలో ఓ ఫుల్ ఫేస్ హెల్మెట్‌కు సరిపోయేంతగా 18 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. కొత్త 2021 హోండా డియో 110 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8.7 పిఎస్ శక్తిని మరియు 9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జపాన్ మార్కెట్లో కొత్త 2021 హోండా డియో స్కూటర్ విడుదల; ఫీచర్లు

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు డిస్క్ మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో సింగిల్ షాక్ అబ్జార్వర్ ఉంటాయి.

జపాన్ మార్కెట్లో కొత్త 2021 హోండా డియో స్కూటర్ విడుదల; ఫీచర్లు

జపాన్ మార్కెట్లో కొత్త 2021 హోండా డియో స్కూటర్ ధర 2,20,00 జపనీస్ యెన్‌లుగా ఉంది. అక్కడి మార్కెట్లో ఇది నాలుగు రంగులలో లభిస్తుంది. అవి: మ్యాట్ స్టార్ బ్లూ మెటాలిక్, మ్యాట్ గెలాక్సీ బ్లాక్ మెటాలిక్, పెరల్ అండ్ జాస్మిన్ వైట్ మరియు సిల్వర్ మెటాలిక్.

జపాన్ మార్కెట్లో కొత్త 2021 హోండా డియో స్కూటర్ విడుదల; ఫీచర్లు

జపనీస్ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 2021 హోండా డియో స్కూటర్ మన దేశ కరెన్సీలో సుమారు రూ.1.5 లక్షల వెలను కలిగి ఉంటుంది. అధిక ధర కారణంగా, హోండా ఈ కొత్త 2021 డియో స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసే అవకాశం లేదు.

More from DriveSpark

Article Published On: Monday, February 15, 2021, 17:13 [IST]
English summary
New 2021 Honda Dio Scooter Launched In Japan, Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+