సుజుకి హయబుసాకి పోటీగా కొత్త 2021 కవాసాకి జెడ్‌ఎక్స్-14ఆర్‌ ఆవిష్కరణ!

జపనీస్ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ కవాసకి తమ సరికొత్త 2021 జెడ్‌ఎక్స్-14ఆర్ సూపర్‌బైక్‌ను అమెరికన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది కొత్త గ్రాఫిక్స్‌తో పాటుగా కొత్త పెయింట్ స్కీమ్‌తో రానుంది. కాకపోతే, ఇందులోని మెకానికల్స్ మరియు ఇతర విడిభాగాల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవు.

సుజుకి హయబుసాకి పోటీగా కొత్త 2021 కవాసాకి జెడ్‌ఎక్స్-14ఆర్‌ ఆవిష్కరణ!

కొత్త 2021 జెడ్‌ఎక్స్-14ఆర్ సూపర్‌బైక్ ఈ విభాగంలో నేరుగా సుజుకి హయబుసాతో పోటీ పడనుంది. కవాసాకి నింజా జెడ్‌ఎక్స్-14 ఆర్ ఒక ప్రత్యేకమైన మోటార్‌సైకిల్. ఇది దాని ప్రత్యేకమైన డిజైన్ మరియు పెద్ద పరిమాణంతో తక్షణమే గుర్తించదగిన మోటారుసైకిల్.

సుజుకి హయబుసాకి పోటీగా కొత్త 2021 కవాసాకి జెడ్‌ఎక్స్-14ఆర్‌ ఆవిష్కరణ!

కవాసకి నింజా జెడ్‌ఎక్స్-14ఆర్ సూపర్‌బైక్‌ను మొట్టమొదట 2006 లో ప్రారంభించారు. ఇది మొదటిసారిగా మార్కట్లోకి వచ్చినప్పుడు, కవాసాకి నింజా జెడ్ఎక్స్-14ఆర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రొడక్షన్ మోటార్‌సైకిల్‌గా అవతరించింది.

సుజుకి హయబుసాకి పోటీగా కొత్త 2021 కవాసాకి జెడ్‌ఎక్స్-14ఆర్‌ ఆవిష్కరణ!

ఇది ప్రపంచంలోని ఇతర సూపర్ స్పోర్ట్ / స్పోర్ట్స్ టూరర్ మోటార్‌సైకిళ్ల కంటే ఎక్కువ స్థానభ్రంశం (ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ లేదా ఇంజన్ సీసీ) కలిగి ఉంటుంది. వాస్తవానికి, ఇది ఈ రోజు వరకు కూడా అతిపెద్ద ఇంజన్ కలిగిన సూపర్‌స్పోర్ట్ / స్పోర్ట్స్ టూరర్‌ మోటార్‌సైకిల్.

సుజుకి హయబుసాకి పోటీగా కొత్త 2021 కవాసాకి జెడ్‌ఎక్స్-14ఆర్‌ ఆవిష్కరణ!

కవాసాకి ఇప్పుడు అమెరికన్ మార్కెట్లో ఈ లెజెండరీ మోటార్‌సైకిల్ యొక్క 2021 వెర్షన్‌ను విడుదల చేసింది. పెరల్ స్టార్మ్ గ్రే / మెటాలిక్ డయాబ్లో బ్లాక్ అనే కొత్త కలర్ స్కీమ్ ఇందులో అతిపెద్ద మార్పుగా ఉంటుంది. ఇది మెటాలిక్ బ్లాక్ పెయింట్ ఫినిషింగ్స్‌తో కలిపి రెడ్ యాక్సెంట్స్ పొందుతుంది.

సుజుకి హయబుసాకి పోటీగా కొత్త 2021 కవాసాకి జెడ్‌ఎక్స్-14ఆర్‌ ఆవిష్కరణ!

ఈ మార్పు మినహా, ఈ మోటారుసైకిల్ ఓవరాల్ డిజైన్ మరియు ఫీచర్లు మాత్రం మారకుండా అలానే ఉంటుంది. ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో అదే ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ 1,441 సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 197.2 బిహెచ్‌పి శక్తిని మరియు 153.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

సుజుకి హయబుసాకి పోటీగా కొత్త 2021 కవాసాకి జెడ్‌ఎక్స్-14ఆర్‌ ఆవిష్కరణ!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఇంజన్ ఇప్పటికీ యూరో 5 / బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు లోబడి ఉండదు. అంతేకాకుండా, ఇందులోని పాత ప్రైమరీ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ కూడా అలాగే ఉంచబడింది. ఇది రెండు రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఏబిఎస్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

సుజుకి హయబుసాకి పోటీగా కొత్త 2021 కవాసాకి జెడ్‌ఎక్స్-14ఆర్‌ ఆవిష్కరణ!

నిజానికి ఈ ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఓ 2021 వెర్షన్ సూపర్‌బైక్‌‍లో ఉండాల్సినవి కావు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా కొత్త 2021 కవాసకి నింజా జెడ్‌ఎక్స్-14ఆర్ సూపర్‌బైక్ పాత ఫీచర్లనే కలిగి ఉండటం మోటారిస్టులను నిరుత్సాహపరచే అంశం.

సుజుకి హయబుసాకి పోటీగా కొత్త 2021 కవాసాకి జెడ్‌ఎక్స్-14ఆర్‌ ఆవిష్కరణ!

కవాసాకి ఈ మోటారుసైకిల్‌ను ఎక్కువగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదనిపిస్తుంది. బహుశా కవాసకి నింజా జెడ్‌ఎక్స్-14ఆర్ సూపర్‌బైక్‌లో ఇదే చివరి అప్‌గ్రేడ్ కావచ్చని తెలుస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌లో అతిపెద్ద మార్పులను చివరిసారిగా 2012లో చేశారు. దాదాపు ఒక దశాబ్దం తరువాత కూడా ఈ మోటార్‌సైకిల్ ఇప్పటికీ అదే విధంగా ఉంది.

Most Read Articles

English summary
New 2021 Kawasaki ZX-14R Unveiled; Will Rival To Suzuki Hayabusa, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X