సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ తమ సరికొత్త 2021 డ్యూక్ 890 మోడల్‌ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. పాత డ్యూక్ 790 స్థానాన్ని రీప్లేస్ చేస్తూ ఈ కొత్త 890 డ్యూక్ మోడల్‌ను ప్రవేశపెట్టారు. పాత మోడల్ (790 డ్యూక్)తో పోలిస్తే ఈ కొత్త మోడల్ (890 డ్యూక్) అన్ని విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది.

సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?

అంతర్జాతీయ మార్కెట్లలో కఠినమైన యూరో 5 ఉద్గార నిబంధనలు ప్రవేశపెట్టిన తర్వాత, మార్కెట్లలో పాత కెటిఎమ్ 790 డ్యూక్ మోడల్‌ని నిలిపివేశారు. కాగా, కొత్తగా వచ్చిన ఈ 2021 కెటిఎమ్ 890 డ్యూక్ మోడల్‌ను దాని పవర్‌ఫుల్ వేరియంట్ అయిన 890 ఆర్ డ్యూక్ వేరియంట్‌కు దిగువన ఆఫర్ చేయనున్నారు.

సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?

అయినప్పటికీ, ఇది దాని పవర్‌ఫుల్ వేరియంట్ మాదిరిగానే ఒకేరకమైన ఛాసిస్స్, ఇంజన్ మరియు బాడీ ప్యానెళ్లను కలిగి ఉంటుంది. మునుపటి తరం మోడల్ మాదిరిగానే, కొత్త డ్యూక్ 890 కూడా అగ్రెసివ్ డిజైన్ మరియు స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో సింగిల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, స్ప్లిట్ సీట్స్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?

కొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఇప్పుడు సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో కూడిన కొత్త పెయింట్ స్కీమ్‌తో లభిస్తుంది. ఇందులో కొత్తగా రెండు కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టారు. అవి: బ్లాక్ మరియు ఆరెంజ్. ఇతర కెటిఎమ్ మోడళ్లలో కనిపించినట్లుగా, ఈ మోటార్‌సైకిల్‌లో ఆరెంజ్ కలర్ ఫ్రేమ్ ఉండదు. దీనిని పూర్తిగా బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేశారు. కేవలం రిమ్స్ మాత్రమే ఆరెంజ్ కలర్‌లో లభిస్తాయి.

సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?

కొత్త (2021) కెటిఎమ్ 890 డ్యూక్ కూడా 790 డ్యూక్ మాదిరిగానే 169 కిలోల బరువును కలిగి ఉంటుంది. అయితే, డ్యూక్ 890 లోని సీట్ ఎత్తు మాత్రం దాని మునుపటి వేరియంట్ కంటే 5 మిమీ తక్కువగా ఉండేలా డిజైన్ చేశారు. ఫలితంగా, ఇది మంచి యాక్సెసబిలిటీని ఆఫర్ చేస్తుంది.

MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?

ఇంజన్ విషయానికి వస్తే, ఇదివరకు చెప్పుకున్నట్లుగానే, డ్యూక్ 890ఆర్ మోడల్‌లో ఉపయోగించిన అదే 889 సిసి పారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఈ కొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్‌లోనూ ఉపయోగించారు. అయితే, ఈ ఇంజన్ కొద్దిగా డీ-ట్యూన్ చేశారు.

సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?

ఫలితంగా, దీని పవర్ మరియు టార్క్ గణాంకాల్లో మార్పులు ఉంటాయి. డీట్యూన్ చేయబడి ఇంజన్ ఇప్పుడు గరిష్టంగా 9000 ఆర్‌పిఎమ్ వద్ద 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 8000 ఆర్‌పిఎమ్ వద్ద 92 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటుగా స్టాండర్డ్ టూ-వే క్విక్-షిఫ్టర్‌తో లభిస్తుంది.

MOST READ:గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్

సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?

పైన పేర్కొన్న ఫీచర్లే కాకుండా, ఈ కొత్త 2021 డ్యూక్ 890 మోడల్‌లో ఇతర ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటిలో ఐఎమ్‌యూ అసిస్ట్, నైన్-వే ట్రాక్షన్ కంట్రోల్ మరియు బహుళ రైడ్ మోడ్‌లు (రెయిన్, స్ట్రీట్ మరియు స్పోర్ట్), 6డి లీన్ యాంగిల్ సెన్సార్ మొదలైనవి ఉన్నాయి.

సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?

ఇక భారత మార్కెట్ విషయానికి వస్తే, 2021 చివరి నాటికి ఈ కొత్త కెటిఎమ్ 890 డ్యూక్ విడుదల కావచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని కేటిఎమ్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఒకవేళ ఈ మోడల్ భారత్‌లో విడుదలైతే, ఇది కూడా దేశంలోని డ్యూక్ 790 మోడల్‌ను రీప్లేస్ చేసే అవకాశం ఉంది.

MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?

భారతదేశంలో కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 890 ధర సుమారు రూ.9 లక్షలు, ఎక్స్-షోరూమ్ రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. కాగా, ప్రపంచ మార్కెట్లలో విడుదల కానున్న కొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఈ విభాగంలో ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ మరియు డ్యుకాటి మోన్స్టర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
New 2021 KTM 890 Duke Unveiled Globally, Will It Come To India? Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X