కొత్త 2021 Royal Enfield Classic 350 టీజర్; సెప్టెంబర్ 1న లాంచ్!

చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield), భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్ Classic 350 లో కంపెనీ కొత్త 2021 అప్‌గ్రేడెడ్ మోడల్ ను వచ్చే నెల మార్కెట్లో విడుదల చేయనుంది. తాజాగా, ఇందుకు సంబంధించిన ఓ టీజర్ వీడియోని కూడా కంపెనీ విడుదల చేసింది.

కొత్త 2021 Royal Enfield Classic 350 టీజర్; సెప్టెంబర్ 1న లాంచ్!

'జీవితాన్ని కేవలం చూడటం మాత్రమే కాదు, అనుభవించండి' అనే క్యాప్షన్ తో కంపెనీ ఈ టీజర్ ను రిలీజ్ చేసింది. కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ ను సెప్టెంబర్ 1, 2021వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఈ టీజర్ ద్వారా వెల్లడించింది.

కొత్త 2021 Royal Enfield Classic 350 టీజర్; సెప్టెంబర్ 1న లాంచ్!

మునుపటి Classic 350 మోడల్‌తో పోల్చుకుంటే ఈ కొత్త 2021 Classic 350 మోడల్‌లో అనేక కొత్త మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఈ కొత్త మోడల్‌ను కంపెనీ తమ పాపులర్ J ప్లాట్‌ఫామ్ పై తయారు చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా మరిన్ని కొత్త మోడళ్లను కంపెనీ రాబోయే రోజుల్లో పరిచయం చేయనుంది.

గత కొంత కాలంగా Royal Enfield ఈ కొత్త మోడల్‌ను బైక్‌ను నిరంతరం పరీక్షిస్తోంది. ఈ బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఇది కూడా ఒకటి. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త టీజర్ లో, కొత్త Classic 350 బైక్ ముందు భాగాన్ని చూడవచ్చు. ఇందులో గుండ్రటి హెడ్‌లైట్ మరియు దానికి ఇరు వైపులా టర్న్ ఇండికేటర్ లైట్లను చూడవచ్చు.

కొత్త 2021 Royal Enfield Classic 350 టీజర్; సెప్టెంబర్ 1న లాంచ్!

కొత్త 2021 కొత్త Classic 350 బైక్ లో ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌తో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్ ను అందించవచ్చని సమాచారం. Royal Enfield ఈ తరహా కనెక్టింగ్ ఫీచర్ ను తొలిసారిగా తమ Meteor 350 (మీటియోర్ 350) మోడల్ లో పరిచయం చేసింది. ఆ తర్వాత తమ ప్రోడక్ట్ లైనప్ లోని ఇతర మోడళ్లకు కూడా ఈ ఫీచర్ ను విస్తరించింది.

కొత్త 2021 Royal Enfield Classic 350 టీజర్; సెప్టెంబర్ 1న లాంచ్!

ఇప్పుడు కొత్తగా వస్తున్న 2021 మోడల్ క్లాసిక్ 350లో కూడా ఈ ఫీచర్‌ను ఆశించవచ్చు. ఇంకా ఇందులో దీని ఎగ్జాస్ట్ క్రోమ్ తో ఫినిషింగ్ చేయబడి ఉంటుందని భావిస్తున్నారు మరియు దాని రియర్ వ్యూ మిర్రర్స్ కూడా గుండ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంధన ట్యాంక్ మునుపటిలానే ఉంటుంది, కాకపోతే ఇది ఆకర్షణీయమైన ఫెండర్‌లను కలిగి ఉంటుందని సమాచారం.

కొత్త 2021 Royal Enfield Classic 350 టీజర్; సెప్టెంబర్ 1న లాంచ్!

ఈ కొత్త మోడల్‌లో దాని సైడ్ పార్ట్స్ మరియు ఫ్యూయల్ ట్యాంక్ లపై ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ ను ఆశించవచ్చు. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే, కంపెనీ ఈ బైక్ కి కొత్త మరియు రిఫ్రెష్డ్ లుక్ ని ఇవ్వడంలో నిమగ్నమై ఉంది. ఇకపోతే, ఈ కొత్త మోడల్‌లో యాంత్రికంగా మరియు ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

కొత్త 2021 Royal Enfield Classic 350 టీజర్; సెప్టెంబర్ 1న లాంచ్!

ప్రస్తుతం Classic 350 లో ఉపయోగించిన బిఎస్6 వెర్షన్ 349 సిసి ఫ్యూయెల్ ఇంజెక్ట్ పెట్రోల్ ఇంజన్ నే ఈ కొత్త మోడల్ లోనూ ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 20.2 బిహెచ్‌పి శక్తిని మరియు 27 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

కొత్త 2021 Royal Enfield Classic 350 టీజర్; సెప్టెంబర్ 1న లాంచ్!

ఈ బైక్ లో ముందు మరియు వెనుక చక్రాలపై డిస్క్ బ్రేకులు ఉంటాయి మరియు ఇవి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ను సపోర్ట్ చేస్తాయి. ఇది కస్టమర్ యొక్క అవసరాన్ని మరియు ప్రాధాన్యతను బట్టి స్పోక్ మరియు అల్లాయ్ వీల్స్ ఆప్షన్లతో అందించబడుతుందని అంచనా.

కొత్త 2021 Royal Enfield Classic 350 టీజర్; సెప్టెంబర్ 1న లాంచ్!

Royal Enfield ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న మరొక పాపులర్ 350 సిసి బైక్ Meteor 350 లోని అనేక ఫీచర్లు మరియు పరికరాలను ఈ కొత్త 2021 Classic 350 బైక్ లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఈ కొత్త బైక్‌లో చేసిన అప్‌డేట్స్ కారణంగా, దాని ధర కూడా పెరిగే అవకాశం ఉంది.

కొత్త 2021 Royal Enfield Classic 350 టీజర్; సెప్టెంబర్ 1న లాంచ్!

ప్రస్తుతం, మార్కెట్లో Royal Enfield Classic 350 ప్రారంభ ధర రూ. 1.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కాగా, కొత్త మార్పులతో రాబోయే 2021 మోడల్ ధర దీని కన్నా సుమారు రూ. 6,000 నుంచి రూ. 9000 వరకు పెరగవచ్చని అంచనా. ఈ బైక్ కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సెప్టెంబర్ 1, 2021 వరకూ వేచి ఉండాల్సిందే.

కొత్త 2021 Royal Enfield Classic 350 టీజర్; సెప్టెంబర్ 1న లాంచ్!

ప్రస్తుతం, Royal Enfield నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో Classic 350 అగ్రస్థానంలో ఉంది. గడచిన జూలై 2021 లో, Classic 350 మొత్తం అమ్మకాలు 16,890 యూనిట్లుగా నమోదు కాగా, జూన్ 2021 లో ఇవి 17,377 యూనిట్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కొత్త వచ్చే అప్‌డేట్ మోడల్ తర్వాత Classic 350 అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, August 26, 2021, 12:42 [IST]
English summary
New 2021 royal enfield classic 350 teaser out ahead of launch details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+