కొత్త 2021 యమహా ఎమ్‌టి15 ఆవిష్కరణ; త్వరలోనే ఇండియాలో విడుదల

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ నేక్డ్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ 'ఎమ్‌టి15'లో కంపెనీ ఓ లేటెస్ట్ 2021 మోడల్‌ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనుంది.

కొత్త 2021 యమహా ఎమ్‌టి15 ఆవిష్కరణ; త్వరలోనే ఇండియాలో విడుదల

కంపెనీ ఇటీవలే ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. త్వరలోనే ఇది ఇండియా మార్కెట్లో కూడా లాంచ్ కానుంది. యమహా ఈ కొత్త155సిసి నేక్డ్ బైక్‌ను థాయ్‌లాండ్‌లో కొత్త కలర్ ఆప్షన్లతో విడుదల చేసింది.

కొత్త 2021 యమహా ఎమ్‌టి15 ఆవిష్కరణ; త్వరలోనే ఇండియాలో విడుదల

ముందుగా యమహా ఎమ్‌టి-15 యొక్క రేసింగ్ బ్లూ పెయింట్ ఎడిషన్‌ను గమనిస్తే, దీని ముందు భాగంలో మడ్‌గార్డ్స్ మరియు ఫ్యూయల్ ట్యాంక్ కౌల్స్‌ను గ్రే కలర్‌లో పెయింట్ చేయబడి ఉంటుంది. బైక్ బాడీని మరియు అళ్లాయ్ వీల్స్‌ని మాత్రం మెటాలిక్ బ్లూ కలర్‌లో పెయింట్ చేయబడి ఉంటాయి.

కొత్త 2021 యమహా ఎమ్‌టి15 ఆవిష్కరణ; త్వరలోనే ఇండియాలో విడుదల

అలాగే, గ్రే కలర్ వెర్షన్ బైక్‌లో ముందు వైపు బ్లాక్ మడ్‌గార్డ్, ట్యాంక్ కౌల్స్‌పై రెడ్ అండ్ నియాన్ బ్లూ కలర్ గ్రాఫిక్స్ ఉంటాయి. అలాగే, ఇందులోని అల్లాయ్ వీల్స్‌ను రెడ్ కలర్‌లో పెయింట్ చేయబడి ఉంటాయి.

కొత్త 2021 యమహా ఎమ్‌టి15 ఆవిష్కరణ; త్వరలోనే ఇండియాలో విడుదల

ఇవే కాకుండా, బైక్‌లోని చాలా చోట్ల మెటాలిక్ గ్రే కలర్ కూడా ఉపయోగించబడింది. యమహా ఎమ్‌టి-15 మోడల్‌లో కనిపించే అన్ని కలర్ ఆప్షన్స్‌ని మార్చామని కంపెనీ చెబుతోంది. కానీ ఇంజన్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు లేవు.

కొత్త 2021 యమహా ఎమ్‌టి15 ఆవిష్కరణ; త్వరలోనే ఇండియాలో విడుదల

యమహా ఎమ్‌టి-15లో 155సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 18.5 బిహెచ్‌పి శక్తిని మరియు 14.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త 2021 యమహా ఎమ్‌టి15 ఆవిష్కరణ; త్వరలోనే ఇండియాలో విడుదల

థాయ్‌లాండ్ వెర్షన్ యమహా ఎమ్‌టి-15 మోటార్‌సైకిల్‌లో గోల్డ్ కలర్‌లో ఫినిష్ చేయబడిన అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్కులు ఉంటాయి. అయితే, ఇండియన్ స్పెక్ మోడల్‌లో మాత్రం ట్రెడిషన్ హైడ్రాలిక్ ఫ్రంట్ ఫోర్కులు ఉంటాయి.

కొత్త 2021 యమహా ఎమ్‌టి15 ఆవిష్కరణ; త్వరలోనే ఇండియాలో విడుదల

ప్రస్తుతం భారత్‌లో యమహా ఎమ్‌టి15 బైక్ మెటాలిక్ బ్లాక్, డార్క్ మ్యాట్ బ్లూ, ఐస్ ఫ్లూయె-వెర్మిలియెన్ అనే మూడు రంగులలో లభిస్తుంది. మొదటి రెండు కలర్ ఆప్షన్ల ధర రూ.1,39,900 గా ఉంటే, మూడవ కలర్ ఆప్షన్ ధర మాత్రం రూ.1,40,900 గా ఉంటుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

కొత్త 2021 యమహా ఎమ్‌టి15 ఆవిష్కరణ; త్వరలోనే ఇండియాలో విడుదల

భారత మార్కెట్లో యమహా ఎమ్‌టి-15 ఈ విభాగంలో సుజుకి జిక్సెర్ 155, టివిఎస్ అపాచీ 160 4వి మరియు కెటిఎమ్ డ్యూక్ 125 వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

Article Published On: Monday, February 22, 2021, 16:37 [IST]
English summary
New 2021 Yamaha MT-15 Unveiled; India Launch Expected Soon, Details. Read in Telugu.
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+