Just In
- 1 hr ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 2 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 2 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
- 16 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
Don't Miss
- News
ప్రోనింగ్ : ఇలా చేస్తే కోవిడ్ పేషెంట్లు తేలిగ్గా శ్వాస తీసుకోవచ్చు... ఎలా చేయాలో తెలుసుకోండి..
- Lifestyle
చికెన్ చాప్స్
- Finance
భారీ నష్టాలతో ప్రారంభమై, లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు: బ్యాంక్, మెటల్ జంప్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెడ్ కలర్ ఆప్షన్‌లో వస్తున్న కొత్త యమహా ఆర్15 వెర్షన్ 3.0 - డీటేల్స్
జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ ఆర్15 వెర్షన్ 3.0లో కంపెనీ ఇప్పుడు సైలెంట్‌గా ఓ కొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ 2021 మోడల్ యమహా ఆర్15 వి3.0 స్పోర్టీ రెడ్ కలర్ ఆప్షన్‌లో లభ్యం కానుంది.

కొత్త కలర్ ఆప్షన్‌కు సంబంధించిన చిత్రాలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఇందులో ఫ్యూయెల్ ట్యాంక్, ఫ్రంట్ ఇంజన్ కౌల్స్ టెయిల్ డిజైన్‌ను రెడ్ కలర్‌లో పెయింట్ చేయబడి ఉంటుంది. అలాగే, ఇందులో వైజర్ మరియు సీట్ క్రింది భాగంలో ఉండే బాడీ ప్యానెల్స్ గ్రే మరియు బ్లాక్ కలర్లలో ఫినిష్ చేయబడి కనిపిస్తాయి.

ప్రస్తుతం, యమహా ఇండియా తమ ఆర్15 వి3.0 మోడల్‌ను మూడు కలర్ స్కీమ్స్‌లో ఆఫర్ చేస్తోంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* యమహా ఆర్15 వి3.0 గ్రే - రూ.1.50 లక్షలు
* యమహా ఆర్15 వి3.0 బ్లూ - రూ.1.51 లక్షలు
* యమహా ఆర్15 వి3.0 డార్క్ నైట్ - రూ.1.52 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)
MOST READ:స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

కాగా, కొత్తగా వస్తున్న రెడ్ కలర్ యమహా ఆర్15 వి3.0 ధర పైన పేర్కొన్న కలర్ ఆప్షన్ల ధరల కన్నా స్వల్పంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇందులో కొత్త కలర్ ఆప్షన్ మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. అలాగే, ఇంజన్ గణాంకాలు, పనితీరు కూడా మారదు.

ఇంజన్ విషయానికి వస్తే, యమహా ఆర్15 వి3.0లో బిఎస్6 కంప్లైంట్ 155సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగిన ఈ ఇంజన్ గరిష్టంగా 18 బిహెచ్‌పి పవర్‌ను మరియు 14.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:వాహనదారులకు గుడ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన డ్రైవింగ్ లైసెన్స్ గడువు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే

ఈ ఇంజన్ స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్‌లో ముందు వైపు 282 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి రెండూ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను స్టాండర్డ్‌గా సపోర్ట్ చేస్తాయి.

ఈ బైక్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనోక్రాస్ (లింక్ యూనిట్) సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇంకా ఇందులో రేడియల్ ట్యూబ్‌లెస్ టైర్లు, ఇంజన్ కట్-ఆఫ్ స్విచ్ మరియు డ్యూయల్ హార్న్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.
MOST READ:ట్రాఫిక్ సిగ్నెల్‌లో డాన్స్ చేసిన కెటిఎమ్ బైక్ రైడర్ [వీడియో]

యమహా ఆర్15 వి3.0 బైక్‌లోని ఇతర ఫీచర్లలో ఎల్ఈడి బ్రేక్ టెయిల్ లైట్స్, డిజిటల్ స్పీడోమీటర్, టాకోమీటర్ మరియు ఫ్యూయల్ గేజ్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యూయెల్ ఇండెక్స్, షిఫ్ట్ టైమింగ్ లైట్, వివిఏ ఇండికేటర్ మరియు డిజిటల్ క్లాక్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ బైక్ యొక్క రేసింగ్ బ్లూ వేరియంట్ కోసం కంపెనీ ప్రత్యేకంగా బ్లూ కలర్ వీల్స్‌ను అందిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో, యమహా ఇండోనేషియా మార్కెట్లో 2021 యమహా ఆర్15 వి3.0 మోడల్‌ను మూడు కొత్త కలర్ ఆప్షన్లతో ప్రవేశపెట్టింది. ఇందులో మ్యాట్ బ్లాక్, మ్యాట్ సిల్వర్ మరియు మెటాలిక్ బ్లూ కలర్స్ ఉన్నాయి.
MOST READ:మీకు తెలుసా.. మారుతి సుజుకి బాలెనోతో 22 గంటల్లో 1,850 కిమీ ప్రయాణం.. కొత్త రికార్డ్ కైవసం
Source: Zigwheels