కొత్త 2021 Yamaha R15 V4 డెలివరీలు ప్రారంభం: ధర, ఫీచర్లు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా మోటార్ ఇండియా (Yamaha Motor India) ఇటీవల భారత మార్కెట్లో తమ కొత్త 2021 R15 V4 స్పోర్ట్స్ బైక్ ని మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ సూపర్ స్పోర్ట్ మోటార్‌సైకిల్ తో పాటుగా ఏరోక్స్ 155 (Aerox 155) అనే స్కూటర్ ను కూడా విడుదల చేసింది.

కొత్త 2021 Yamaha R15 V4 డెలివరీలు ప్రారంభం: ధర, ఫీచర్లు

కాగా, తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఇప్పుడు తమ కొత్త 2021 యమహా ఆర్15 వి4 (Yamaha R15 V4) మోటార్‌సైకిల్ డెలివరీలను కూడా ప్రారంభించింది. దేశీయ మార్కెట్లో కొత్త యమహా ఆర్15 మోటార్‌సైకిల్ ధరలు రూ. 1,67,800 నుండి రూ. 1,79,800 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. పాత మోడల్ ధరతో పోల్చుకుంటే ఈ కొత్త మోడల్ ధర రూ. 10,000 ఎక్కుగా ఉంటుంది.

కొత్త 2021 Yamaha R15 V4 డెలివరీలు ప్రారంభం: ధర, ఫీచర్లు

భారత మార్కెట్లో కొత్త 2021 యమహా ఆర్15 వి4 బైక్‌ను ఐదు ఆకర్షణీయమైన రంగులలో అందిస్తున్నారు. అలాగే, ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టిసిఎస్) మరియు క్విక్ షిఫ్టర్ వంటి కొన్ని ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లను కూడా జోడించారు. ఇది గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ట్రాక్ మరియు స్ట్రీట్ మోడ్‌తో YZF-R1 మోడల్ నుండి ప్రేరణ పొందిన కొత్త ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కూడా కలిగి ఉంటుంది.

కొత్త 2021 Yamaha R15 V4 డెలివరీలు ప్రారంభం: ధర, ఫీచర్లు

కొత్త యమహా ఆర్15 వి4.0 డిజైన్ ను గమనిస్తే, ఇది పాత మోడల్‌ కన్నా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇదివరకటి డ్యూయల్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ స్థానంలో కొత్త సింగిల్ పాడ్ హెడ్‌ల్యాంప్ సెటప్ ను ఉపయోగించారు. ఇది చూడటానికి యమహా ఆర్7 స్పోర్ట్స్ బైక్ నుండి ప్రేరణ పొందినట్లుగా అనిపిస్తుంది.

అలాగే, ఈ 2021 యమహా ఆర్15 మోడల్ లో మరింత అగ్రెసివ్ గా ఉండే ఫెయిరింగ్స్, మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు పొడవైన విండ్‌స్క్రీన్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. స్పోర్టియర్ స్టైలింగ్ డిజైన్‌ను కలిగిన ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు మరింత సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ తో అప్‌గ్రేడ్ చేయబడింది. కాబట్టి, ఇది రోజువారీ రైడింగ్ కోసం కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది.

కొత్త 2021 Yamaha R15 V4 డెలివరీలు ప్రారంభం: ధర, ఫీచర్లు

యమహా మోటార్ ఇండియా ఈ కొత్త 2021 ఆర్15 మోడల్ ను రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఇందులో మొదటిది స్టాండర్డ్ ఆర్15 వి4 (R15 V4.0) మరియు రెండవది మరింత స్పోర్టీయర్ వేరియంట్ అయిన ఆర్15ఎమ్ (R15M). హై -స్పెక్ మోడల్ అయిన ఆర్15ఎమ్, స్టాండర్డ్ ఆర్15 వి4 తో పోల్చుకుంటే కాస్తం విభిన్న డిజైన్‌ను మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఇవి రెండూ ఒకేలా ఉంటాయి.

కొత్త 2021 Yamaha R15 V4 డెలివరీలు ప్రారంభం: ధర, ఫీచర్లు

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో డిజిటల్ ఎల్‌సిడి డిస్‌ప్లే యూనిట్స్ ఉంటాయి. కొత్త 2021 R15 V4.0 లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుంది. ఇది కాల్ మరియు మెసేజ్ అలెర్ట్స్, రియల్ టైమ్ మైలేజ్, ఇంజన్ ఆర్‌పిఎమ్, మాల్‌ఫంక్షన్ నోటిఫికేషన్స్, పార్కింగ్ రికార్డ్, బైక్ లొకేషన్, రైడ్ హిస్టరీ వంటి మెరెన్నో విషయాలను తెలిజయేస్తుంది.

కొత్త 2021 Yamaha R15 V4 డెలివరీలు ప్రారంభం: ధర, ఫీచర్లు

యమహా ఆర్15 బైక్ లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ఈ ఫీచర్ పొందిన మొట్టమొదటి 155 సిసి బైక్ కూడా కొత్త 2021 ఆర్15 కావటం విశేషం. ఇంకా ఈ బైక్‌లో స్ట్రీట్ మరియు ట్రాక్ అనే రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. రైడర్ నడిపే రోడ్డు మరియు అవసరాన్ని బట్టి ఈ మోడ్స్ ను ఎంచుకోవచ్చు.

కొత్త 2021 Yamaha R15 V4 డెలివరీలు ప్రారంభం: ధర, ఫీచర్లు

ఇంజన్ విషయానికి వస్తే, ఈ రెండు మోడ్లలో ఒకేరకమైన 155 సిసి ఎస్ఓహెచ్‌సి ఎఫ్ఐ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 బిహెచ్‌పి శక్తిని మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.2 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ కాన్స్టాంట్ మెష్ గేర్‌బాక్స్ మరియు వెట్ మల్టీ-డిస్క్ క్లచ్‌తో లభిస్తుంది. కాగా, ఇందులోని R15M మరియు రేసింగ్ బ్లూ కలర్ వేరియంట్‌లు రెండూ కూడా మెరుగైన పనితీరు కోసం క్విక్‌షిఫ్టర్ ఫీచర్‌ ను పొందుతాయి.

కొత్త 2021 Yamaha R15 V4 డెలివరీలు ప్రారంభం: ధర, ఫీచర్లు

ఈ బైక్‌ లోని ఇతర ఫీచర్లలో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ముందు వైపు అప్ సైడ్ డౌన్ (యూఎస్‌డి) ఫోర్కులు మరియు వెనుక వైపు మోనో షాక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటాయి. అలాగే, బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ అమర్చబడి ఉంటాయి మరియు ఇవి రెండూ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఫీచర్‌ని సపోర్ట్ చేస్తాయి.

కొత్త 2021 Yamaha R15 V4 డెలివరీలు ప్రారంభం: ధర, ఫీచర్లు

కొత్త 2021 యమహా ఆర్ 15 కోసం అఫీషియల్ యాక్ససరీస్

ఇదిలా ఉంటే, కొత్త 2021 యమహా ఆర్ 15 బైక్ కోసం కంపెనీ తాజాగా, అధికారిక ఉపకరణాల ప్యాక్‌ (Accessories Pack) వివరాలను వెల్లడించింది. యమహా అందిస్తున్న ఈ యాక్ససరీస్ ధరలు రూ. 190 నుండి రూ. 1,650 మధ్యలో ఉన్నాయి. - వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
New 2021 yamaha r15 v4 deliveries started price specs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X