భారత్‌లో విడుదల కానున్న కొత్త Yamaha YZF R15M : ఫుల్ డీటేల్స్

జపనీస్ టూవీలర్ బ్రాండ్ Yamaha భారత మార్కెట్లో మరొక సరికొత్త ప్రీమియం మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే కొత్త Yamaha MT-15 Monster Energy Moto GP Edition (ఎమ్‌టి-15 మోన్‌స్టర్ ఎనర్జీ మోటో జిపి ఎడిషన్‌)ను విడుదల కంపెనీ ఇప్పుడు కొత్తగా Yamaha YZF R15M ని విడుదల చేయబోతోంది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త Yamaha YZF R15M : ఫుల్ డీటేల్స్

కాగా, ఈ కొత్త మోడల్ ప్రారంభానికి ముందే దీని ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. Yamaha Motor India తమ డీలర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో Yamaha R15 యొక్క కొత్త 'M' వెర్షన్ కంపెనీ ప్రదర్శించింది. ఈ ఈవెంట్‌లో, కంపెనీ తన రాబోయే Yamaha R15M మోడల్ ని డీలర్ల ముందు ఉంచింది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త Yamaha YZF R15M : ఫుల్ డీటేల్స్

ఇంటర్నెట్‌లో లీకైన చిత్రాల ద్వారా కొత్త Yamaha YZF R15M లో చేసిన కొన్ని కీలమార్పులు వెల్లడయ్యాయి. స్టాండర్డ్ YZF R15 తో పోల్చుకుంటే, ఈ కొత్త బైక్‌లో అనేక కాస్మెటిక్ మార్పులు చేయబడ్డాయి. ఇందులో ప్రధానమైన మార్పు దాని హైడ్‌లైట్ రూపంలో ఉంటుంది. ఇదే ముందుగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త Yamaha YZF R15M : ఫుల్ డీటేల్స్

సాధారణంగా, స్టాండర్డ్ Yamaha R15 మోడల్‌లో కనిపించే ట్విన్-ఐ హెడ్‌లైట్ స్థానంలో కొత్త సింగిల్-పాడ్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్ యూనిట్ ను ఈ కొత్త Yamaha R15M మోడల్ ఆఫర్ చేస్తున్నారు. ఇది చూడటానికి Yamaha MT-15 మరియు Yamaha FZX-25 మోడళ్లని గుర్తుకు తెచ్చేలా ఉంటుంది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త Yamaha YZF R15M : ఫుల్ డీటేల్స్

అంతేకాకుండా, ఈ కొత్త Yamaha YZF R15M లో బైక్ ప్రియులను దృష్టిని ఆకర్షించే మరో విషయం ఏమిటంటే, బైక్ ముందు భాగంలో బంగారం కలర్ లో పెయింట్ చేయబడిన కొత్త USD (అప్-సైడ్ డౌన్ ఫోర్కులు). తలక్రిందులగా అమర్చబడిన ఈ ఫ్రంట్ ఫోర్కులు కొత్త బైక్‌కు మరింత స్పోర్టీ రూపాన్ని ఇవ్వటమే కాకుండా, బైక్ నిర్వహణను కూడా మెరుగుపరుస్తాయి.

భారత్‌లో విడుదల కానున్న కొత్త Yamaha YZF R15M : ఫుల్ డీటేల్స్

ఇక దీని సైడ్ ప్రొఫైల్ ని గమనిస్తే, కొత్త Yamaha YZF R15M లోని చాలా బాడీ ప్యానెళ్లు ఇప్పటికే ఉన్న పాత Yamaha YZF R15 మోడల్ నుండి తీసుకోబడ్డాయి. అయితే, ఇందులోని ఎగ్జాస్ట్ పైప్ డిజైన్ మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. సైలెన్సర్ పైప్ పై అమర్చిన కవర్ ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్‌తో డిజైన్ చేయబడి ఉంటుంది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త Yamaha YZF R15M : ఫుల్ డీటేల్స్

ఈ కొత్త బైక్‌లో కాస్మెటిక్ మార్పులతో పాటుగా ఫీచర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త Yamaha YZF R15M లో కంపెనీ చేసిన టెక్నాలజీ మార్పుల మార్పుల గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ, ఇది కూడా కంపెనీ యొక్క లేటెస్ట్ స్మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుందని అంచనా.

భారత్‌లో విడుదల కానున్న కొత్త Yamaha YZF R15M : ఫుల్ డీటేల్స్

స్టాండర్డ్ Yamaha R15 మోడల్ తో పోలిస్తే, ఈ కొత్త Yamaha YZF R15M మోడల్ ని వేరుగా ఉంచేందుకు కంపెనీ ఇందులో మరికొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఇందులో చేయబోయే అతిపెద్ద మార్పులలో ఒకటి దాని ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కావచ్చు, ఎందుకంటే కంపెనీ ఇప్పుడు ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కనెక్టివిటీ టెక్నాలజీని ఆఫర్ చేసే అవకాశం ఉంది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త Yamaha YZF R15M : ఫుల్ డీటేల్స్

ఇక ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. కాకపోతే, దాని పవర్, టార్క్ గణాంకాల్లో మాత్రం స్వల్ప మార్పులు ఉండే అకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టాండర్డ్ Yamaha YZF R15 బైక్‌‍లో లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 4-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

భారత్‌లో విడుదల కానున్న కొత్త Yamaha YZF R15M : ఫుల్ డీటేల్స్

ఈ ఇంజన్ 10,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 18.6 బిహెచ్‌పి శక్తిని మరియు 8500 ఆర్‌పిఎమ్ వద్ద 14.1 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. కొత్త Yamaha YZF R15 యొక్క M వేరియంట్ కొంచెం ఎక్కువ ఫోకస్డ్ వెర్షన్ కాబట్టి, ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కొంచెం ఎక్కువ పవర్ మరియు టార్క్ అందిస్తుందని నమ్ముతారు. ఈ బైక్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

భారత్‌లో విడుదల కానున్న కొత్త Yamaha YZF R15M : ఫుల్ డీటేల్స్

భారత్‌లో కొత్త Yamaha MT-15 Monster Energy Moto GP Edition విడుదల

ఇదిలా ఉంటే, Yamaha ఇటీవల దేశీయ మార్కెట్లో ఓ కొత్త MT-15 Monster Energy Moto GP Edition (యమహా ఎమ్‌టి-15 మోన్‌స్టర్ ఎనర్జీ మోటో జిపి ఎడిషన్) ను విడుదల చేసింది. భారత మార్కెట్లో దీని ధర రూ. 1,47,900 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త Yamaha YZF R15M : ఫుల్ డీటేల్స్

స్టాండర్డ్ Yamaha MT-15 మోడల్ తో పోల్చుకుంటే, ఈ కొత్త Yamaha MT-15 Monster Energy Moto GP Edition మోడల్ లో కంపెనీ కేవలం పలు కాస్మెటిక్ అప్‌డేట్‌లు చేసింది. కాగా, ఇందులో యాంత్రికంగా ఎలాంటి మార్పులను చేయలేదు. - ఈ కొత్త బైక్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Image Source: RevNitro

More from DriveSpark

Article Published On: Friday, August 27, 2021, 17:35 [IST]
English summary
New 2021 yamaha yzf r15m images revealed before its official launch details
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+