సరికొత్త అప్‌డేట్స్‌తో వచ్చిన కొత్త 2022 Ducati Panigale V4 సూపర్‌బైక్

ప్రముఖ ఇటాలియన్ సూపర్‌బైక్ బ్రాండ్ డ్యుకాటి (Ducati) తమ ఫ్లాగ్‌షిప్ 'పానిగల్ వి4' (Panigale V4) బైక్ ను మరోసారి అత్యాధునిక సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేసింది. ప్రపంచంలోనే నంబర్ వన్ మోటార్‌సైకిల్‌గా పరిగణించబడుతున్న MotoGP రేసింగ్ బైక్‌కు సమానమైన సాంకేతిక లక్షణాలు మరియు వేగంతో కొత్త 2022 Ducati Panigale V4 సూపర్‌బైక్ రూపొందించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్‌కు ఓ ప్రత్యేక కస్టమర్ బేస్ మరియు అభిమానులు ఉన్నారు.

సరికొత్త అప్‌డేట్స్‌తో వచ్చిన కొత్త 2022 Ducati Panigale V4 సూపర్‌బైక్

డ్యుకాటి ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా వివిధ అదనపు సాంకేతిక ఫీచర్లతో కంపెనీ కొత్త 2022 పానిగల్ వి4 బైక్ ను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త బైక్ యొక్క హ్యాండ్లింగ్ మరియు స్పీడ్ వంటి అంశాలను కూడా అప్‌గ్రేడ్ చేశారు. అయితే, దీని ఓవరాల్ డిజైన్ మాత్రం మునుపటి మోడల్‌ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, ఈ బైక్ యొక్క వింగ్ నిర్మాణాన్ని కొద్దిగా మార్చారు. ఫలితంగా, ఈ వింగ్‌లెట్ 30 కిలోల డౌన్‌ఫోర్స్‌ను అందిస్తుంది మరియు బైక్ గంటకు 270 కిమీ వేగం వద్ద కూడా స్థిరంగా కదలడానికి అనుమతిస్తుంది.

సరికొత్త అప్‌డేట్స్‌తో వచ్చిన కొత్త 2022 Ducati Panigale V4 సూపర్‌బైక్

ఇందులో పెల్లిబేన్ కూలింగ్ టెక్నాలజీని మరింత మెరుగుపరిచే మరియు ఇంజిన్ హీట్‌ని మెరుగ్గా నియంత్రించే రెండు రంధ్రాలను కలిగి ఉందని నివేదించబడింది. కొత్త 2022 Ducati Panicale V4 సూపర్‌బైక్‌లో అదే పాత 1,103 సిసి వి4 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 212 బిహెచ్‌పి పవర్ ను మరియు 124 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. టాప్ గేర్ రేషియోలో చేసిన మార్పుల కారణంగా, దాని టాప్ స్పీడ్ ఇప్పుడు మరింత పెరిగింది.

సరికొత్త అప్‌డేట్స్‌తో వచ్చిన కొత్త 2022 Ducati Panigale V4 సూపర్‌బైక్

తక్కువ వేగంతో కర్వ్ పై వెళ్లేటప్పుడు ఈ బైక్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్ బరువు 195.5 కిలోలకు తగ్గించారు. పెట్రోల్ ట్యాంక్ మరియు ఛాసిస్‌లో కొన్ని మార్పులు చేయడం వలన, బ్రేకింగ్ చేసేటప్పుడు, వంపుల వ్వద కూడా హ్యాండ్లింగ్ చాలా మెరుగ్గా ఉంటుంది. పానిగేల్ వి4 మోడల్ లో ముందు వైపు షోవా బిగ్ పిస్టన్ 43 మిమీ ఫోర్క్‌లను ఉపయోగించారు, వీటిని పూర్తిగా సర్దుబాటు చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

సరికొత్త అప్‌డేట్స్‌తో వచ్చిన కొత్త 2022 Ducati Panigale V4 సూపర్‌బైక్

అయితే Panigale V4S మోడల్ లో మాత్రం ముందు వైపు 125 మిమీ ట్రావెల్ తో కూడిన ఒలిన్స్ NBX 25/30cm యాక్టివ్ ఫోర్క్స్‌తో కూడిన సస్పెన్షన్‌ను ఉపయోగించారు. వెనుక సస్పెన్షన్ సెటప్ లో మార్పు లేదు. కొత్త డ్యుకాటి పానిగల్ సూపర్‌బైక్‌లో 5 ఇంచ్ TFT స్క్రీన్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, దీనిపై కనబడే సమాచారన్ని చదవడానికి సులభంగా ఉండేలా లేఅవుట్ సవరించబడింది. ఇందులో బైక్ స్పీడ్, సేఫ్టీ ఫీచర్స్ మరియు రైడర్ అసిస్టెన్స్ కి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.

సరికొత్త అప్‌డేట్స్‌తో వచ్చిన కొత్త 2022 Ducati Panigale V4 సూపర్‌బైక్

కొత్త 2022 Ducati Panicale V4 బైక్‌లో 6 యాక్సిస్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ కూడా ఉంటుంది. కొత్త పానిగల్ వి4 మరియు పానిగల్ వి4ఎస్ రెండూ కూడా వచ్చే డిసెంబర్ నుండి ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇవి భారతదేశంలో కూడా విక్రయించబడుతుందని భావిస్తున్నారు.

సరికొత్త అప్‌డేట్స్‌తో వచ్చిన కొత్త 2022 Ducati Panigale V4 సూపర్‌బైక్

భారత మార్కెట్లో Ducati Panigale V4 SP విడుదల

ఇదిలా ఉంటే, డ్యుకాటి ఇటీవలే దేశీయ విపణిలో తమ కొత్త 2021 మోడల్ 'పానిగల్ వి4 ఎస్‌పి' (Ducati Panigale V4 SP) ని విడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సూపర్ బైక్ ధర రూ. 36.07 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. ఈ కొత్త బైక్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డ్యుకాటి డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

సరికొత్త అప్‌డేట్స్‌తో వచ్చిన కొత్త 2022 Ducati Panigale V4 సూపర్‌బైక్

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి మోడల్ దాని స్టాండర్డ్ వేరియంట్ తో పోల్చినప్పుడు, ఇది ఎక్కువగా రేస్ ట్యూన్డ్ మరియు పెర్ఫార్మెన్స్ బేస్డ్ స్పోర్ట్స్ బైక్ మాదిరిగా ఉంటుంది. కంపెనీ ఈ కొత్త బైక్ లో దాని స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ అందించింది. కంపెనీ ఈ బైక్ ను MotoGP మరియు SBK ఛాంపియన్‌షిప్‌ల ప్రీ-సీజన్ టెస్ట్‌లలో ఉపయోగించిన డ్యుకాటి కోర్స్ బైక్ నుండి ప్రేరణ పొందిన కొత్త "వింటర్ టెస్ట్" లైవరీతో వస్తుంది. కాబట్టి, ఇది దాని స్టాండర్డ్ పానిగల్ వి4ఎస్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది.

సరికొత్త అప్‌డేట్స్‌తో వచ్చిన కొత్త 2022 Ducati Panigale V4 సూపర్‌బైక్

డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1,103 సిసి డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 13,000 ఆర్‌పిఎమ్ వద్ద 214 బిహెచ్‌పి పవర్ ను మరియు 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 12.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లో 90° V4 బిల్లెట్ అల్యూమినియంతో తయారు చేయబడిన STM EVO-SBK డ్రై క్లచ్‌ని ఉపయోగించారు. ఇది దాని V4S మోడల్ యొక్క వెట్ క్లచ్‌తో పోలిస్తే, ఈ డ్రై క్లచ్ మరింత ప్రభావవంతమైన యాంటీ-హాప్ ఫంక్షన్‌కు హామీ ఇస్తుంది మరియు రేస్ ట్రాక్ లలో అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది.

Most Read Articles

English summary
New 2022 ducati panigale v4 unveiled with sevaral updates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X