కొత్త 2022 హస్క్వార్నా ఎండ్యూరో లైనప్ ఆవిష్కరణ; వివరాలు

స్వీడన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హస్క్వార్నా మోటార్‌సైకిల్స్ అంతర్జాతీయ మార్కెట్ కోసం తమ సరికొత్త 2022 ఎండ్యూరో ప్రోడక్ట్ లైనప్ రేంజ్‌ను వెల్లడించింది. ఈ మొత్తం ఎండ్యూరో లైనప్‌లో ఏడు మోడళ్లు ఉన్నాయి.

కొత్త 2022 హస్క్వార్నా ఎండ్యూరో లైనప్ ఆవిష్కరణ; వివరాలు

ఇవి టిఈ మరియు ఎఫ్ఈ అనే రెండు వేర్వేరు రేంజ్‌లలో ఉంటాయి. ఇందులో ముందుగా టిఈ రేంజ్‌లో టూ-స్ట్రోక్ ఇంజన్లతో కూడినవి మూడు మోడళ్లు ఉండగా, తరువాతి ఎఫ్‌ఈ రేంజ్‌లో ఫోర్-స్ట్రోక్ ఇంజన్లతో కూడినవి నాలుగు మోడళ్లు ఉన్నాయి.

కొత్త 2022 హస్క్వార్నా ఎండ్యూరో లైనప్ ఆవిష్కరణ; వివరాలు

హస్క్వార్నా టిఈ శ్రేణిలో టిఈ 150ఐ, టిఈ 250ఐ మరియు టిఈ 300ఐ వంటి మోడళ్లు ఉన్నాయి. వీటి పేరు సూచించినట్లుగానే, టిఈ 150ఐలో 150సీసీ ఇంజన్, టిఈ 250ఐలో 250సీసీ ఇంజన్ మరియు టిఈ 300ఐలో 300సీసీ ఇంజన్‌లు ఉంటాయి.

కొత్త 2022 హస్క్వార్నా ఎండ్యూరో లైనప్ ఆవిష్కరణ; వివరాలు

ఇక హస్క్వార్నా ఎఫ్ఈ రేంజ్ విషయానికి వస్తే, ఇందులో ఎఫ్‌ఈ 250, ఎఫ్‌ఈ 350, ఎఫ్‌ఈ 450 మరియు ఎఫ్‌ఈ 501 మోడళ్లు ఉన్నాయి. వీటిలో వరుసగా 250సిసి, 350సిసి, 450సిసి మరియు 511సిసి ఫోర్-స్ట్రోక్ ఇంజన్లను ఉపయోగించారు.

కొత్త 2022 హస్క్వార్నా ఎండ్యూరో లైనప్ ఆవిష్కరణ; వివరాలు

ఈ కొత్త 2022 హస్క్వార్నా ఎండ్యూరో మోటార్‌సైకిళ్లు యల్లో డీటేలింగ్ కలిగిన కొత్త కలర్ ఆప్షన్లను కలిగి ఉంటాయి. సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో కంపెనీ వీటిని అప్‌డేట్ చేసింది. ఈ కొత్త శ్రేణిలో బ్రాక్టెక్ బ్రేక్‌లు మరియు క్లచ్ సెటప్‌లను ఉపయోగించారు.

కొత్త 2022 హస్క్వార్నా ఎండ్యూరో లైనప్ ఆవిష్కరణ; వివరాలు

బ్రాక్టెక్ అనేది జె.జువాన్ యొక్క అనుబంధ సంస్థ మరియు ఇది ఐరోపాలో బైక్ తయారీదారుల కోసం హైడ్రాలిక్ బ్రేక్ మరియు క్లచ్‌లను తయారు చేస్తుంది. అలాగే యునైటెడ్ స్టేట్స్‌లో ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ మరియు చైనాలోని సిఎఫ్ మోటో బ్రాండ్ కోసం కూడా విడిభాగాలను తయారు చేస్తుంది..

కొత్త 2022 హస్క్వార్నా ఎండ్యూరో లైనప్ ఆవిష్కరణ; వివరాలు

యూకే మార్కెట్లో కొత్త 2022 హస్క్వార్నా ఎండ్యూరో శ్రేణి టిఈ 150ఐ ప్రారంభ ధర 9,699 యూరోలుగా ఉంటుంది (మనదేశ కరెన్సీలో సుమారు రూ.8.61 లక్షలు). అలాగే, ఈ లైనప్‌లో టాప్-ఎండ్ వేరియంట్ ఎఫ్ఈ 501 ధర 12,199 యూరోలుగా ఉంటుంది (మన కరెన్సీలో సుమారు రూ.10.83 లక్షలు).

కొత్త 2022 హస్క్వార్నా ఎండ్యూరో లైనప్ ఆవిష్కరణ; వివరాలు

హస్క్వార్నా ఈ కొత్త 2022 ఎండ్యూరో మోటార్‌సైళ్లను ఇప్పటికే యూరోపియన్ డీలర్‌షిప్‌లకు చేరుస్తోంది. అయితే, ఇండియా లాంచ్ విషయానికొస్తే, భారత మార్కెట్లో ఎండ్యూరో విభాగానికి ఖచ్చితమైన డిమాండ్ లేనందున, బజాజ్ ఆటో వీటిని ఇండియా కోసం పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు.

Most Read Articles

English summary
New 2022 Husqvarna Enduro Model Lineup Revealed, Details. Read in Telugu.
Story first published: Saturday, May 15, 2021, 18:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X