కొత్త 2022 Kawasaki Ninja 1000SX సూపర్‌బైక్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

జపాన్‌కి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ కవాసకి (Kawasaki) భారత మార్కెట్లో మరో కొత్త ప్రీమయం మోటార్‌సైకిల్ ను విడుదల చేసింది. కొత్త కవాసకి నింజా 1000ఎస్ఎక్స్ (Kawasaki Ninja 1000SX) పేరుతో కంపెనీ ఈ కొత్త బైక్ ను ప్రవేశపెట్టింది. దీని ధర మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2022 Kawasaki Ninja 1000SX సూపర్‌బైక్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త కవాసకి నింజా 1000ఎస్ఎక్స్ సూపర్‌బైక్‌ను కంపెనీ రెండు కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. ఇందులో ఒకటి ఎమరాల్డ్ బ్లాస్ట్ గ్రీన్, మరొకటి మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే. ఈ రెండు కలర్ వేరియంట్ల ధరలు ఒకేలా ఉంటాయి. దేశీయ మార్కెట్లో నింజా 1000ఎస్ఎక్స్ ధర రూ. 11.40 లక్షల (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. ఈ మోడల్ కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా బుకింగ్ లు కూడా ప్రారంభించబడ్డాయి.

కొత్త 2022 Kawasaki Ninja 1000SX సూపర్‌బైక్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ బైక్ ని ఇప్పుడు బుక్ చేసుకునే కస్టమర్లకు కవాసకి వచ్చే నెల డిసెంబర్ నాటికి వాహనాలను డెలివరీ చేయాలని చూస్తోంది. ప్రస్తుత, మోడల్ తో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 కవాసకి నింజా 1000ఎస్ఎక్స్ మోడల్ గణనీయమైన మార్పులకు గురైంది. కొత్త కలర్ ఆప్షన్లు, పరికరాలు మరియు యాక్ససరీలను ఇందులో జోడించారు. అయితే, దీని మెకానికల్ ఫీచర్లలో మాతారం ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు.

కొత్త 2022 Kawasaki Ninja 1000SX సూపర్‌బైక్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2022 కవాసకి నింజా 1000ఎస్ఎక్స్ బైక్‌లో అదే మునుపటి ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. అలాగే, ఇప్పుడు ఇది కొత్త 4.3 ఇంచ్ టిఎఫ్‌టి కలర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీతో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ అప్లికేషన్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో రైడర్ వివిధ రకాల సమాచారాన్ని పొందవచ్చు. ఉదాహరణకు, ఈ టిఎఫ్‌టి స్క్రీన్ గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇంధన స్థాయి, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలెర్ట్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని రైడర్ కు తెలియజేస్తుంది.

కొత్త 2022 Kawasaki Ninja 1000SX సూపర్‌బైక్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఇంకా ఇందులో ఏబిఎస్, (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు (స్పోర్ట్, రోడ్, రైన్, రైడర్), త్రీ లెవల్ ట్రాక్షన్ కంట్రోల్, పవర్ మోడ్‌లు (ఫుల్, లో), క్విక్ షిఫ్టర్ మరియు కవాసకి కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో మెరుగైన ప్రయాణ అనుభూతి కోసం అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, రియర్ మోనోషాక్, ముందు వైపు ట్విన్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపు సింగిల్ రోటర్ డిస్క్ ఉంటాయి.

కొత్త 2022 Kawasaki Ninja 1000SX సూపర్‌బైక్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్ బైక్‌ లో 1,043 సిసి, ఇన్‌లైన్ 4 సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 140 బిహెచ్‌పి పవర్ ను మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 111 ఎన్ఎమ్ టార్క్‌ ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

కొత్త 2022 Kawasaki Ninja 1000SX సూపర్‌బైక్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

Kawasaki Z650 RS విడుదల..

ఇదిలా ఉంటే, కవాసకి ఇటీవలి కాలంలో భారతదేశంలో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని ఒక్కొక్కటిగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా, తమ కొత్త కవాసకి జెడ్650 ఆర్ఎస్ (Kawasaki Z650 RS) బైక్ ను కూడా భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కొత్త కవాసకి జెడ్650 ఆర్ఎస్ మిడిల్ వెయిట్ మోటార్‌సైకిల్ ధర రూ. 6.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఈ బైక్ క్యాండీ ఎమరాల్డ్ గ్రీన్ మరియు మెటాలిక్ మూన్ లైట్ గ్రే కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

కొత్త 2022 Kawasaki Ninja 1000SX సూపర్‌బైక్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త కవాసకి జెడ్650 ఆర్ఎస్ బైక్ రెట్రో స్టైల్ లో కనిపించినప్పటికీ, ఇది ఆధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులోని గుండ్రటి ఎల్ఈడి హెడ్‌లైట్, పాత కాలపు మోటార్‌సైకిళ్ల మాదిరిగా కనిపించే ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్, సింగిల్ పీస్ కెఫే రేసర్ స్టైల్ సీట్, వెనుక వైపు గుండ్రటి టెయిల్ ల్యాంప్ మరియు దానికి ఇరువైపులా మోడ్రన్ ఎల్ఈడి ఇండికేటర్స్ వంటి క్లాసిక్ డిజైన్ ఎలిమెంట్స్ దీని క్లాసిక్ లుక్ ని మరింత పెంచుతాయి. ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా రెట్రో మోడ్రన్ కలయికలో ఉంటుంది.

కొత్త 2022 Kawasaki Ninja 1000SX సూపర్‌బైక్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

2022 Kawasaki Versys 1000 విడుదల..

కవాసకి బ్రాండ్ నుండి తాజాగా మార్కెట్లోకి వచ్చిన మరొక కొత్త మోడల్ కొత్త 2022 కవాసకి వెర్సిస్ 1000 (2022 Kawasaki Versys 1000). మార్కెట్లో ఈ స్పోర్ట్స్ టూరింగ్ మోటార్‌సైకిల్ ధర రూ. 11.55 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ఈ బైక్ క్యాండీ లైమ్ గ్రీన్ టైప్ 3 షేడ్ లో ఒకేఒక కలర్ అప్సన్ లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ ఇప్పటికే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది కాబట్టి, ఇందులో యాంత్రికంగా ఎలాంటి మార్పులు చేయలేదు.

కొత్త 2022 Kawasaki Ninja 1000SX సూపర్‌బైక్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త కవాసకి వెర్సిస్ 1000 మోటార్‌సైకిల్‌ లో 1043 సిసి, ఇన్-లైన్ ఫోర్, లిక్విడ్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ ఉపయోగించబడింది. ఈ ఇంజిన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 120 బిహెచ్‌పి పవర్ మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 102 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్లిప్పర్ క్లచ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New 2022 kawasaki ninja 1000sx launched in india price sepcs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X