2022 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 ఆవిష్కరణ; ఆర్6 మోడల్‌కి రీప్లేస్‌మెంట్!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న వైజెడ్ఎఫ్-ఆర్6 స్థానంలో ఓ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే, కంపెనీ తమ కొత్త 2020 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 మిడిల్ వెయిట్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది.

2022 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 ఆవిష్కరణ; ఆర్6 మోడల్‌కి రీప్లేస్‌మెంట్!

మార్కెట్లో కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 ధర 8999 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.6.60 లక్షలు)గా ఉంది. ఇందులో శక్తివంతమైన 689సిసి ఇంజన్‌తో పాటుగా ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి.

2022 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 ఆవిష్కరణ; ఆర్6 మోడల్‌కి రీప్లేస్‌మెంట్!

కొత్త 2022 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 మోటార్‌సైకిల్ యమహా బ్లూ మరియు పెర్ఫార్మెన్స్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది యమహా ఎమ్‌టి-07 మాదిరిగానే అదే ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 72.3 బిహెచ్‌పి శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 67 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

2022 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 ఆవిష్కరణ; ఆర్6 మోడల్‌కి రీప్లేస్‌మెంట్!

ఇందులో స్లిప్ అసిస్టెడ్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంటుంది. ఈ బైక్ ఇంజన్‌లో సిపి 2 క్రాస్‌ప్లేన్ ఇంజన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ క్రాస్‌ప్లేన్ ఇంజన్‌లో 270-డిగ్రీల క్రాంక్ మరియు నాన్-ఫైరింగ్ ఆర్డర్ ఉంటుంది, ఇది లీనియర్ పవర్ డెలివరీని మరియు ప్రత్యేక ఎగ్జాస్ట్ నోట్‌ను అందిస్తుంది.

2022 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 ఆవిష్కరణ; ఆర్6 మోడల్‌కి రీప్లేస్‌మెంట్!

ఈ బైక్ తయారీలో స్టీల్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఇది యమహా సూపర్‌స్పోర్ట్ లైనప్‌లోనే సన్నని బాడీవర్క్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ బైక్ మెరుగైన ఏరోడైనమిక్‌ను కలిగి ఉండి, అధిక వేగాల వద్ద కూడా స్థిరత్వాన్ని అందిస్తుంది. కాగా, దీని ఓవరాల్ డిజైన్‌ను మాత్రం, ఇతర R సిరీస్ బైక్‌ల మాదిరిగానే ఉంచారు.

2022 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 ఆవిష్కరణ; ఆర్6 మోడల్‌కి రీప్లేస్‌మెంట్!

ఇంకా ఇందులో సెంట్రల్ ఎయిర్ ఇనే‌టేక్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ బైక్‌లో ఇరువైపులా ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు Y-ఆకారంలో ఉన్న ఎల్ఈడి డిఆర్ఎల్‌లు కూడా ఉన్నాయి. ఇందులో ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, విండ్‌స్క్రీన్, క్లిప్ ఆన్ హ్యాండిల్‌బార్, 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, రియర్ సెట్ ఫుట్‌పెగ్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

2022 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 ఆవిష్కరణ; ఆర్6 మోడల్‌కి రీప్లేస్‌మెంట్!

ఇందులోని మెకానికల్స్‌ను గమనిస్తే, దీనిముందు భాగంలో 41 మిమీ కెవైబి అప్ సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో లింక్ టైప్ మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. కంపెనీ దీని మెయింటినెన్స్‌ను మెరుగుపరచడానికి దాని చాస్సిస్ యొక్క జియోమెట్రీని కూడా మార్చింది. దీని వీల్‌బేస్ ఎమ్‌టి-07 కన్నా 5 మిమీ తక్కువగా ఉంటుంది.

MOST READ:స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మున్సిపల్ కార్పొరేషన్; వివరాలు

2022 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 ఆవిష్కరణ; ఆర్6 మోడల్‌కి రీప్లేస్‌మెంట్!

బ్రేకింగ్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 298 మిమీ డ్యూయల్ డిస్క్ బ్రేకులు, నాలుగు పాట్ కాలిపర్స్ మరియు వెనుక భాగంలో 245 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఇంకా ఈ బైక్‌లో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఇందులోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఈ బైక్‌లో డిజిటల్ టిఎఫ్‌టి డిస్‌ప్లే కూడా ఉంటుంది, ఇది వివిధ రకాల సమాచారాన్ని అందిస్తుంది.

2022 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 ఆవిష్కరణ; ఆర్6 మోడల్‌కి రీప్లేస్‌మెంట్!

డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ఆప్షనల్ వన్-వే క్విక్ షిఫ్టర్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ కొత్త 2022 యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 బైక్‌లో ఉన్నాయి. కంపెనీ ఈ బైక్‌ను రాబోయే కాలంలో భారతదేశంలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో అప్రిలియా ఆర్ఎస్660 వంటి మోడళ్లతో పోటీ పడొచ్చని అంచనా.

MOST READ:ఆటోపైలట్ మోడ్‌లో స్టంట్ చేసిన ఇండో-అమెరికన్ అరెస్ట్; వివరాలు

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha Unveils New 2022 YZF-R7 Middle-Weight Supersport, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X