Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 16 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త 650సీసీ క్రూజర్ బైక్; చూడటానికి థండర్‌బర్డ్‌లా ఉంది!
భారతదేశపు ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్, దేశీయ మార్కెట్ కోసం మరో సరికొత్త 650సీసీ మోటార్‌సైకిల్‌ను తయారు చేస్తోంది. ఈ శక్తివంతమైన మోటార్‌సైకిల్, క్రూయిజర్ బాడీ టైప్‌లో రానుంది మరియు చూడటానికి ఇది అప్‌గ్రేడెడ్ థండర్‌బర్డ్‌లా అనిపిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లో పవర్‌ఫుల్ 650సీసీ పారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ బ్రాండ్ తొలిసారిగా ఈఐసిఎమ్ఏ 2018లో ప్రదర్శించిన కెఎక్స్ బాబర్ కాన్సెప్ట్ ఆధారంగా బాబర్ తరహాలే ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేయనున్నారు.

మరికొద్ది రోజుల్లోనే ఈ మోడల్ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. విడుదలకు ముందు, ఈ కొత్త 650సీసీ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన స్పై చిత్రాలు, మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. గాడివాడి లీక్ చేసిన స్పై చిత్రాల ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా, తాత్కాలిక నెంబర్ ప్లేట్‌తో ఈ మోడల్‌ను భారత రోడ్లపై పరీక్షిస్తోంది.
MOST READ:మారుతి-టొయోటా జేవీ నుండి వస్తున్న చిన్న కారు మరియు ఓ ఎమ్‌పివి

ఈ స్పై చిత్రాలలో ఇంజన్‌పై ఆర్ఈ బ్యాడ్జింగ్ మినహా మరెక్కడా బ్రాండింగ్ కనిపించదు. ఇతర వివరాలను గోప్యంగా ఉంచేందుకు, దీనిని పూర్తిగా బ్లాక్ కలర్‌లో పెయింట్ చేశారు. ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయిస్తున్న ఇతర మోడళ్ల కన్నా పెద్దదిగా కనిపిస్తుంది.

గతంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రదర్శించిన బాబర్ స్టైల్ డిజైన్‌కి మరియు ఈ స్పై చిత్రాలలో కనిపించే క్రూయిజర్ మోటార్‌సైకిల్‌కి అనేక పోలికలు ఉన్నాయి. ఇందులో పొడవైన వీల్‌బేస్, టియర్-డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్, ఎత్తుగా మరియు వెడల్పుగా ఉండే హ్యాండిల్ బార్, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ మరింత సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేస్తాయి.
MOST READ:లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌కు రెట్రోల్ లుక్‌నిచ్చేందుకు ఇందులో ట్విన్ క్రోమ్ ఎగ్జాస్ట్ పైప్స్, కర్వ్‌డ్ ఫెండర్స్, గుండ్రటి హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు మరియు టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. సుదూర ప్రయాణాల కోసం ఇందులో సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో స్ప్లిట్ సీట్ డిజైన్ మరో అదనపు ఆకర్షణగా ఉంటుంది.

ఈ స్పై చిత్రాలలో వెల్లడైన ఇతర వివరాలలో మోటార్‌సైకిల్ ముందు వైపు అమర్చిన అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ (యూఎస్‌డి) ఫోర్కులు, వెనుక వైపు ట్విన్ షాక్ సస్పెన్షన్ సెటప్, సింగిల్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రాష్ ప్రొటెక్టర్, అల్లాయ్ వీల్స్ మరియు పెద్ద ప్రొఫైల్‌తో కూడిన టైర్లు వంటి ఫీచర్లను గమనించవ్చచు.
MOST READ:అటల్ టన్నెల్‌లో ఒకటి, రెండు కాదు ఏకంగా 82 వాహనాలు చిక్కుకున్నాయి.. కారణం ఇదే

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ స్పై చిత్రాలలో కనిపిస్తున్న అప్ సైడ్ డౌన్ ఫోర్కులు, రియల్ వరల్డ్ ప్రొడక్షన్ మోడల్‌లో కూడా కంపెనీ ఉపయోగించినట్లయితే, ఇదే బ్రాండ్ యొక్క మొట్టమొదటి యూఎస్‌డి ఫోర్క్ సెటప్ అవుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లలో ఇప్పటి వరకూ ఈ తరహా ఫోర్కులను ఉపయోగించలేదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోటార్‌సైకిళ్లలో కనిపించినట్లుగా, ఈ కొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లో కూడా ఇరువైపులా సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్‌లో అల్లాయ్ వీల్స్ మరియు వాటిపై పెద్ద టైర్లను కూడా గమనించవచ్చు.
MOST READ:ఒక ఛార్జ్‌తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే, ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేయవచ్చని తెలుస్తోంది. ఇటీవలే విడుదల చేసిన మీటియోర్ 350 మోడల్‌లో కనిపించినట్లుగా, బ్రాండ్ యొక్క ఆన్‌బోర్డ్ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రాబోయే క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లో ఇంజన్‌ను ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఇతర 650సీసీ మోడళ్ల నుండే గ్రహించే అవకాశం ఉంది. అయితే, మెరుగైన పనితీరు కోసం ఈ ఇంజన్‌ను లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో పరిచయం చేయవచ్చని అంచనా.

ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జిటి)లో ఉపయోగిస్తున్న 649సీసీ ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 47 బిహెచ్‌పి పవర్‌ను మరియు 52 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది మరియు స్లిప్పర్-క్లచ్ అసిస్ట్‌ను కలిగి ఉంటుంది.

కొత్తగా రాబోయే క్రూయిజర్ మోటారుసైకిల్‌లోని పవర్, టార్క్ గణాంకాలు కూడా ఇదే రేంజ్‌లో ఉంటాయని అంచనా. తాజాగా విడుదలైన ఈ స్పై చిత్రాలు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రాబోయే క్రూయిజర్ మోటారుసైకిల్ యొక్క స్పష్టమైన రూపాన్ని తెలియజేసేలా ఉన్నాయి. ఇది ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది.