స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త బజాజ్ పల్సర్ 250ఎఫ్ బైక్; వివరాలు

ప్రముఖ వాహన తయారీదారు అయిన బజాజ్ ఆటో యొక్క పల్సర్ సిరీస్ బైక్‌లకు దేశీయ మార్కెట్లో చాలా ప్రజాదరణ ఉంది. కావున బజాజ్ పల్సర్ బైక్‌లకు భారతదేశంలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. బజాజ్ తన పల్సర్ సిరీస్‌ను బైకులను భారత మార్కెట్లో మరింత విస్తరించాలని తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త బజాజ్ పల్సర్ 250ఎఫ్ బైక్; వివరాలు

బజాజ్ కంపెనీ తన పల్సర్ సిరీస్ బైకుల కోసం పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సరికొత్త పల్సర్ 250 ఎఫ్ బైక్ స్పాట్ టెస్ట్ లో గుర్తించబడింది. ఈ కొత్త బజాజ్ పల్సర్ 250ఎఫ్ బైక్‌ను ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లో విడుదలచేసే అవకాశం ఉంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త బజాజ్ పల్సర్ 250ఎఫ్ బైక్; వివరాలు

కొత్త బజాజ్ పల్సర్ 250 సెమీ ఫెయిర్ బైక్ భారతదేశంలో తొలిసారిగా స్పాట్ టెస్ట్ లో గుర్తించబడింది. ఈ కొత్త బైక్ యొక్క స్పాట్ టెస్ట్ ఫోటోలను వెల్లడించింది. ఈ మోడల్‌ను పల్సర్ 250ఎఫ్ అని పిలుస్తారు. ఫోటోలలో కనిపించిన విధంగా ఈ పల్సర్ 250 ఎఫ్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త బజాజ్ పల్సర్ 250ఎఫ్ బైక్; వివరాలు

ఈ కొత్త పల్సర్ 250 ఎఫ్ బైక్‌లో క్వార్టర్ ఫెయిరింగ్, ఫ్యూయల్ ట్యాంక్, ఫెయిరింగ్-మౌంటెడ్ రియర్ వ్యూ మిర్రర్స్, హెడ్‌ల్యాంప్ విభాగానికి ఆనుకొని ఉన్న క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్ ఉన్నాయి. ఈ కొత్త బైక్‌కు గ్రాబ్ రైల్ మరియు కొత్త ఎల్‌ఈడీ టెయిల్ లాంప్ డిజైన్ లభిస్తుంది. ఇందులో అల్లాయ్ వీల్స్, టైర్ హగ్గర్స్, డిస్క్ బ్రేక్స్ మరియు ఎగ్జాస్ట్ కూడా ఉన్నాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త బజాజ్ పల్సర్ 250ఎఫ్ బైక్; వివరాలు

ఈ కొత్త పల్సర్ 250ఎఫ్ ఇంజిన్ విషయానికొస్తే, ఇందులో సరికొత్త 250 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ సుమారు 24 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలదని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్‌లో స్ప్లిట్ సీట్లు కూడా ఉంటాయి, ఈ సెమీ ఫైర్డ్ బైక్ కొద్దిగా స్పోర్టి లుక్ కలిగి ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త బజాజ్ పల్సర్ 250ఎఫ్ బైక్; వివరాలు

బజాజ్ పల్సర్ 250 ఎఫ్ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో షాక్ సెటప్‌తో వస్తుంది. అదే విధంగా ఇందులో ఉన్న బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు కలిగి ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త బజాజ్ పల్సర్ 250ఎఫ్ బైక్; వివరాలు

ఈ కొత్త బైక్ లో డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్ గా అందించబడుతుంది. ఈ కొత్త బైక్‌ను ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త బజాజ్ పల్సర్ 250ఎఫ్ భారత మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత సుజుకి జిక్సర్ 250, యమహా ఎఫ్ జెడ్-25 మరియు కెటిఎమ్ డ్యూక్ 250 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త బజాజ్ పల్సర్ 250ఎఫ్ బైక్; వివరాలు

భారత మార్కెట్లో ఈ బైక్ విడుదలైన తరువాత ఇతర కంపెనీలకు మంచి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ మునుపటి మోడల్స్ లాగే మంచి అమ్మకాలతో అత్యంత ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

Source: Bikewale

More from DriveSpark

Article Published On: Saturday, May 15, 2021, 9:59 [IST]
English summary
Bajaj Pulsar 250F Spotted Testing For The First Time. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+