భారత్‌లో విడుదల కానున్న కొత్త 2021 బెనెల్లీ బైక్; ఇక కవాసకి నింజా 300 కి గడ్డు కాలమే

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తరుణంలో చాలా కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బెనెల్లి ఈ ఏడాది తన బైక్ లైనప్‌ను అప్‌డేట్ చేయడంపై దృష్టి సారించింది. ఇటీవల బెనెల్లి తన కొత్త 302 ఆర్ ను వెల్లడించింది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త 2021 బెనెల్లీ బైక్; కవాసకి నింజా 300 కి గడ్డు కాలమే

బెనెల్లి కంపెనీ ఈ కొత్త బైక్ చైనా మార్కెట్లో లో ప్రవేశపెట్టబడింది. కావున భారత మార్కెట్లో కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. బెనెల్లి కంపెనీ ఈ కొత్త బైక్ ని అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ తో పాటు అప్డేటెడ్ ఇంజిన్ తో విడుదల చేయనుంది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త 2021 బెనెల్లీ బైక్; కవాసకి నింజా 300 కి గడ్డు కాలమే

బెనెల్లి యొక్క ఈ బైక్ కొత్త బిఎస్ 6 / యూరో 5 కంప్లైంట్ 302 సిసి ప్యారలల్ ట్విన్ మోటార్ ఇంజన్ కలిగి ఉంది, ఇది 35 బిహెచ్‌పి పవర్ మరియు 27 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. కొత్త బెనెల్లి 302 ఆర్ ఇప్పుడు మునుపటి కంటే 22 కిలోల తేలికైనదిగా ఉంటుంది. కావున ఈ బైక్ మొత్తం బరువు ఇప్పుడు కేవలం 182 కిలోలు మాత్రమే.

MOST READ:మీ పాత వాహనాలను ఇలా చేసి, రెనో కార్లపై భారీ తగ్గింపును పొందండి

భారత్‌లో విడుదల కానున్న కొత్త 2021 బెనెల్లీ బైక్; కవాసకి నింజా 300 కి గడ్డు కాలమే

ఈ బైక్ యొక్క ఇంజిన్ రూపకల్పనలో ఎక్కువ అప్డేట్స్ చేయబడ్డాయి. అంతే కాకుండా ఈ బైక్ యొక్క ఫెయిరింగ్ యొక్క రూపకల్పన కూడా మార్చబడింది. కావున ఈ కొత్త బైక్ లో క్రీజెస్ మరియు లైన్స్ కూడా ఇవ్వబడ్డాయి. మొత్తంమీద, బైక్ ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ ఏరోడైనమిక్ గా ఉంటుంది.

భారత్‌లో విడుదల కానున్న కొత్త 2021 బెనెల్లీ బైక్; కవాసకి నింజా 300 కి గడ్డు కాలమే

బెనెల్లి యొక్క ఈ కొత్త బైక్ లో స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టైల్ లైట్, ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్ తో పాటు పుల్లీ డిజిటల్ టిఎఫ్‌టి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కొత్త బైక్ లో ఉన్న పుల్లీ డిజిటల్ టిఎఫ్‌టి డిస్‌ప్లే దాని పాత సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్థానంలో ఉంది. ఓడోమీటర్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యూయెల్ లెవెల్, ఇంజిన్ టెంపరేచర్ వంటి మరింత సమాచారాన్ని ఇందులో చూడవచ్చు.

MOST READ:విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?

భారత్‌లో విడుదల కానున్న కొత్త 2021 బెనెల్లీ బైక్; కవాసకి నింజా 300 కి గడ్డు కాలమే

బెనెల్లి 302 ఆర్ బైక్ యొక్క ముందు భాగంలో 41 మిమీ అప్సైడ్డౌన్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ కలిగి ఉంది. ఈ బైక్ ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉండగా, వెనుక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇవన్నీ ఈ బైక్ కి స్టాండర్డ్ గా లభిస్తాయి.

భారత్‌లో విడుదల కానున్న కొత్త 2021 బెనెల్లీ బైక్; కవాసకి నింజా 300 కి గడ్డు కాలమే

2021 బెనెల్లి 302 ఆర్ బైక్ ధర చైనాలో 29,800 చైనీస్ యెన్. అంటే భారత కరెన్సీ ప్రకారం దీని ధర రూ .3.38 లక్షలు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ బైక్‌ను భారత్‌లో సుమారు 3.60 లక్షల రూపాయల ఎక్స్‌షోరూమ్ ధరతో లాంచ్ చేసే అవకాశం ఉంది. భారతదేశంలో, ఈ బైక్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310, కవాసాకి నింజా 300 మరియు కెటిఎం ఆర్‌సి 390 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

భారత్‌లో విడుదల కానున్న కొత్త 2021 బెనెల్లీ బైక్; కవాసకి నింజా 300 కి గడ్డు కాలమే

బెనెల్లి కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో రెండు కొత్త బైక్‌లను విడుదల చేసింది. ఫిబ్రవరిలో కంపెనీ కొత్త లియోన్సినో 500 మరియు కొత్త టిఆర్‌కె 500 ఎక్స్‌ను విడుదల చేసింది. లియోన్సినో 500 క్రూయిజర్ బైక్ అయితే టిఆర్‌కె 500 ఎక్స్ హెవీ ఆఫర్ బైక్ అవుతుంది. కొత్త లియోన్సినో 500 ప్రారంభ ధర రూ. 4.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, కొత్త టిఆర్‌కె 500 ఎక్స్ ధర రూ. 5.19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Most Read Articles

English summary
New Benelli 302R Unveiled Launch Soon In India Features Details. Read in Telugu.
Story first published: Friday, April 9, 2021, 12:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X