భారత్‌లో విడుదలైన రూ. 9.95 లక్షల స్కూటర్: BMW C 400 GT

ప్రముఖ జర్మన్ లగ్జరీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BMW Motorrad (బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్) భారతీయ మార్కెయిలో కొత్త BMW C 400 GT (బిఎండబ్ల్యు సి400జిటి) మాక్సి-స్కూటర్‌ను అధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మాక్సి-స్కూటర్‌ ధర అక్షరాలా రూ. 9.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త స్కూటర్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన కొత్త BMW C 400 GT స్కూటర్: ధర రూ. 9.95 లక్షలు

కంపెనీ ఈ కొత్త స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించింది. కావున కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు అన్ని BMW మోటరోరాడ్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ స్కూటర్ ధర చాలా ఎక్కువ, కావున ఈ కొత్త మ్యాక్సీ స్కూటర్ ప్రస్తుతం దేశంలో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా నిలిచింది.

భారత్‌లో విడుదలైన కొత్త BMW C 400 GT స్కూటర్: ధర రూ. 9.95 లక్షలు

BMW C 400 GT మాక్సి-స్కూటర్‌ రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

అవి:

1) ఆల్పైన్ వైట్

2) స్టైల్ ట్రిపుల్ బ్లాక్

భారత్‌లో విడుదలైన కొత్త BMW C 400 GT స్కూటర్: ధర రూ. 9.95 లక్షలు

ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ప్రీమియం మ్యాక్సీ-స్కూటర్‌ అనేక అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 మరియు ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 మాదిరిగా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇద్హి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన కొత్త BMW C 400 GT స్కూటర్: ధర రూ. 9.95 లక్షలు

కొత్త BMW C 400 GT మాక్సి-స్కూటర్‌ రోడ్డుపై రైడ్ చేయటానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది. ఇది చాలా స్టైలిష్ డిజైన్ కలిగి చాలా దూకుడుగా ఉంటుంది. ఇందులో పొడవైన విండ్‌స్క్రీన్, పుల్-బ్యాక్ హ్యాండిల్‌బార్, పెద్ద స్టెప్ సీట్ మరియు డ్యూయల్ ఫుట్‌రెస్ట్‌ వంటివి అందుబాటులో ఉంటాయి.

భారత్‌లో విడుదలైన కొత్త BMW C 400 GT స్కూటర్: ధర రూ. 9.95 లక్షలు

ఈ స్కూటర్ డిజైన్ కంఫర్ట్ ఓరియెంటెడ్ మరియు ఇది మంచి రైడింగ్ పొజిషన్ కలిగి ఉంటుంది. చాలా సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ ఇవ్వబడింది. ఈ స్కూటర్ దూర ప్రయాణాలకు చాలా సౌకర్యవంతగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన కొత్త BMW C 400 GT స్కూటర్: ధర రూ. 9.95 లక్షలు

ఈ స్కూటర్ లో లభించే కొన్ని ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ మరియు రైడ్ అసిస్ట్ ఫీచర్లలో ఫుల్లీ ఎల్ఈడి లైటింగ్, కీలెస్ ఇగ్నిషన్, హీటెడ్ గ్రిప్స్, హీటెడ్ సీట్లు, ఏబిఎస్, యాంటీ-థెఫ్ట్ అలారం సిస్టమ్ మరియు బ్లూటూత్-ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. ఇవే కాకుండా, ఇందులో రైడ్-బై-వైర్ థ్రోటల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన కొత్త BMW C 400 GT స్కూటర్: ధర రూ. 9.95 లక్షలు

ఇంజన్ విషయానికి వస్తే, బిఎమ్‌డబ్ల్యూ సి400జిటి మాక్సి స్కూటర్ లో శక్తివంతమైన ఇంజన్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఈ స్కూటర్ లో 350 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 33.5 బిహెచ్‌పి పవర్ ను మరియు 35 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ పరంగా కొత్త బిఎమ్‌డబ్ల్యూ సి400జిటి భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన స్కూటర్ అవుతుంది.

భారత్‌లో విడుదలైన కొత్త BMW C 400 GT స్కూటర్: ధర రూ. 9.95 లక్షలు

బిఎమ్‌డబ్ల్యూ సి400జిటి మాక్సి స్కూటర్ కి ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలాంటి ప్రత్యక్ష పోటీ లేదు. ఒకవేళ హోండా భారత మార్కెట్లో తమ ఫోర్జా 350 స్కూటర్ ని విడుదల చేసినట్లయితే, ఇది ఆ స్కూటర్ కి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే, హోండా కంపెనీ ఈ స్కూటర్ లాంచ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

భారత్‌లో విడుదలైన కొత్త BMW C 400 GT స్కూటర్: ధర రూ. 9.95 లక్షలు

భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న కారణంగా బిఎమ్‌డబ్ల్యూ మోటరోరాడ్ ఫ్యూచర్ మొబిలిటీపై కూడా పనిచేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల ఎలక్ట్రిక్ సైకిల్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మోటార్‌సైకిల్ లాంటిది, ఇందులో గేర్‌లకు బదులుగా రైడింగ్ మోడ్‌లు ఇవ్వబడ్డాయి. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ సైకిల్ పేరు బిఎమ్‌బ్ల్యూ ఐ విజన్ యాంబీ (BMW i Vision AMBY). ఇదొక బ్యాటరీ ఆపరేటెడ్ పెడల్ ఎలక్ట్రిక్ సైకిల్. ఇందులో 2,000 Wh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీని టాప్ స్పీడ్ గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వరకూ ఉంటుంది.

భారత్‌లో విడుదలైన కొత్త BMW C 400 GT స్కూటర్: ధర రూ. 9.95 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

బిఎమ్‌డబ్ల్యూ సి400జిటి మాక్సి స్కూటర్ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. అయితే ఇది అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది, కానీ దీని అత్యధిక ధర కారణంగా భారతీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను చేపడుతుంది, ఎంత వరకు ప్రజాదరణ పొందగలుగుతుంది అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

Most Read Articles

English summary
New bmw c 400 gt maxi scooter launched at rs 9 95 lakhs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X