భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 క్లాసిక్ క్రూయిజర్ బైక్; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ మోటొరాడ్ భారత మార్కెట్లో తన కొత్త ఆర్ 18 క్లాసిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్లాసిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధర దేశీయ మార్కెట్లో రూ. 24 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఇండియా). ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 క్లాసిక్ బైక్; వివరాలు

కొత్త ఆర్ 18 క్లాసిక్ క్రూయిజర్ బైక్ బిఎండబ్ల్యు బ్రాండ్ యొక్క హెరిటేజ్ శ్రేణిలో రెండవ బైక్. ఆర్ 18 క్లాసిక్‌కు స్టైలిష్ మరియు క్లాసిక్ డిజైన్ ఇవ్వబడింది. ఇప్పుడు ఈ ఆర్ 18 క్లాసిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బిఎండబ్ల్యు మోటోరాడ్ షోరూమ్‌లలో బుకింగ్ కోసం అందుబాటులో ఉంది.

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 క్లాసిక్ బైక్; వివరాలు

ఆర్ 18 క్లాసిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి అవుతుంది, దీని డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

MOST READ:త్వరలో రోడెక్కనున్న 400 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా?

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 క్లాసిక్ బైక్; వివరాలు

కొత్త ఆర్ 18 క్లాసిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్బ్రాండ్ యొక్క టూరర్ ఓరియెంటెడ్ వెర్షన్. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో పొడవైన విండ్‌స్క్రీన్ మరియు సాడిల్‌బ్యాగులు ఉన్నాయి. ఇది చూడటానికి దాని పాత మోడల్ లాగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 క్లాసిక్ బైక్; వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్లాసిక్ బైక్ లో కన్నీటి-డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్, రౌండ్ షేప్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎక్స్‌పోజ్డ్ డ్రైవ్‌షాఫ్ట్, డబుల్-డ్యూయెల్ ఫ్రేమ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో లేటెస్ట్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, సికిల్ షేప్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఇడి టైల్ లైట్స్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి.

MOST READ:2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 క్లాసిక్ బైక్; వివరాలు

ఈ కొత్త బైక్ మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా, మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి రెయిన్, రోల్ మరియు రాక్ మోడ్స్. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, కీలెస్ రైడ్, హిల్-స్టార్ట్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ క్రూయిజర్ కంట్రోల్ వంటివి కూడా ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 క్లాసిక్ బైక్; వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్లాసిక్ అదే 1,802 సిసి రెండు సిలిండర్ల ఎయిర్ / ఆయిల్-కూల్డ్ బాక్సర్ ఇంజిన్‌తో కొనసాగుతోంది . ఇది బిఎమ్‌డబ్ల్యూ సిరీస్ ఉత్పత్తిలో అత్యంత శక్తివంతమైన బాక్సర్ ఇంజిన్. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన ఈ ఇంజన్ 4750 ఆర్‌పిఎమ్ వద్ద 91 బిహెచ్‌పి మరియు 3000 ఆర్‌పిఎమ్ వద్ద 158 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOT READ:మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 క్లాసిక్ బైక్; వివరాలు

ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలమైన రైడింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. కొత్త బిఎండబ్ల్యు ఆర్18 క్లాసిక్ మోటార్ సైకిల్ భారత మార్కెట్లో ఇండియన్ మోటార్ సైకిల్ మరియు హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిల్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
New BMW R 18 Classic Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X