భారత్‌లో BS6 Ducati Hypermotard 950 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ డ్యుకాటి (Ducati) భారత మార్కెట్లో మరో సరికొత్త మోటార్‌సైకిల్ ను విడుదల చేసింది. కొత్త బిఎస్6 హైపర్‌మోటార్డ్ 950 (BS6 Ducati Hypermotard 950) మోటార్‌సైకిల్ రేంజ్ ను కంపెనీ విడుదల చేసింది.

భారత్‌లో BS6 Ducati Hypermotard 950 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

దేశీయ విపణిలో ఈ కొత్త మోటార్‌సైకిళ్ల ప్రారంభ వేరియంట్ (950 ఆర్‌విఈ) ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ (950 ఎస్‌పి) ధర రూ. 16.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ కొత్త శ్రేణి పూర్తిగా సరికొత్త డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

భారత్‌లో BS6 Ducati Hypermotard 950 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ రెండు మోడళ్ల కోసం ఢిల్లీ-ఎస్‌సిఆర్, ముంబై, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా మరియు చెన్నైలోని అన్ని డ్యుకాటి డీలర్‌షిప్‌ లలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కొత్త హైపర్‌మోటార్డ్ యొక్క ఔటర్ లుక్ ట్విన్ అండర్-సీట్ ఎగ్జాస్ట్ మరియు దాని పూర్తిగా నేక్డ్ లుక్‌కి దోహదపడే లోవర్డ్ సూపర్ స్ట్రక్చర్ల చుట్టూ తిరుగుతూనే ఉంది.

భారత్‌లో BS6 Ducati Hypermotard 950 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ మోటార్‌సైకిళ్లలో రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి - ట్రాక్ లేదా ట్విస్టింగ్ రోడ్‌ల కోసం స్పోర్ట్, మరియు ఇన్నర్ సిటీ హాప్స్ లేదా అవుట్-టౌన్ రన్‌ల కోసం టూరింగ్ లేదా క్లీన్, ఫ్లూయిడ్ రైడింగ్ స్టైల్‌ను ఇష్టపడే వారి కోసం ఈ రైడింగ్ మోడ్స్ సూట్ అవుతాయి. ఈ బైక్స్ లో ట్విన్ అండర్-సీట్ ఎగ్జాస్ట్ సెటప్, మినిమల్ బాడీవర్క్, ట్రేల్లిస్ ఫ్రేమ్, ట్రెల్లిస్ సబ్-ఫ్రేమ్, వైడ్ హ్యాండిల్ బార్, నకిల్‌గార్డ్-ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి బ్లింకర్లు, ఫ్లాట్ సీట్ మరియు 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో BS6 Ducati Hypermotard 950 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఇందులో రేంజ్-టాపింగ్ వేరియంట్ అయిన 950 ఎస్‌పిలో ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్, కార్బన్-ఫైబర్ ఫ్రంట్ మడ్‌గార్డ్ మరియు కార్బన్-ఫైబర్ టైమింగ్ బెల్ట్ కవర్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇంకా ఇందులోని ఇతర ఫీచర్లను పరిశీలిస్తే, పూర్తి ఎల్ఈడి లైటింగ్, 4.3 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే, టాపర్డ్ అల్యూమినియం హ్యాండిల్‌బార్లు, తొలగించగల ప్యాసింజర్ ఫుట్‌బ్యాగ్‌లు మరియు యూఎస్‌బి పవర్ సాకెట్ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో BS6 Ducati Hypermotard 950 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లలో భాగంగా, బాష్ సిక్స్-యాక్సిస్ ఇనర్షియల్ ప్లాట్‌ఫామ్, రైడింగ్ మోడ్‌లు, పవర్ మోడ్‌లు, కార్నరింగ్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు వీల్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని బేస్ RVE వేరియంట్‌లోని సస్పెన్షన్‌లో పూర్తిగా సర్దుబాటు చేయగల 45 మిమీ Marzocchi అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు ప్రీలోడ్ మరియు రీబౌండ్ డంపింగ్-అడ్జస్టబుల్ Sachs రియర్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంది.

భారత్‌లో BS6 Ducati Hypermotard 950 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

అలాగే, ఇందులో మరింత ప్రీమియం వేరియంట్ SP లో Ohlins-sourced 48 మిమీ అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్‌లు మరియు Ohlins రియర్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇవి రెండూ కూడా పూర్తిగా సర్దుబాటు చేయగల సౌకర్యం ఉంటుంది. బ్రేకింగ్ సెటప్‌ ను గమనిస్తే, ఈ బైక్స్ ముందు భాగంలో ట్విన్ రోటర్లు మరియు వెనుక భాగంలో సింగిల్ డిస్క్ ఉన్నాయి. ఇవి డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి.

భారత్‌లో BS6 Ducati Hypermotard 950 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

వీల్స్ అండ్ టైర్స్ ను గమనిస్తే, ఈ బైక్స్ త్రీ Y-స్పోక్స్‌తో కూడిన అల్యూమినియం చక్రాలను కలిగి ఉంటాయి. వీటిపై ముందు వైపు 120/70 ZR17 మరియు వెనుక వైపు 180/55/55 ZR17 ప్రొఫైల్ తో కూడిన పిరెల్లీ డయాబ్లో రోస్సో III టైర్లు అమర్చబడి ఉంటాయి. ఈ డ్యుకాటి హైపర్‌మోటార్డ్ శ్రేణి యొక్క రెండు వేరియంట్‌లు కూడా అప్‌డేటెడ్ BS VI 937 సిసి Ducati Testastretta 11-డిగ్రీ V-ట్విన్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ ను కలిగి ఉంటాయి.

భారత్‌లో BS6 Ducati Hypermotard 950 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ ఇంజన్ గరిష్టంగా 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 112.4 బిహెచ్‌పి శక్తిని మరియు 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 96 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ ను కంపెనీ రీట్యూన్ చేసింది. ఫలితంగా, మరింత శక్తివంతగా మరియు తేలికైనదిగా మారింది. హైపర్‌మోటార్డ్ 950 లో, 80 సాతం టార్క్ ఇప్పటికే 3,000 ఆర్‌పిఎమ్ వద్ద అందుబాటులో ఉందని, 5,000 నుండి 9,000 ఆర్‌పిఎమ్ మధ్యలో 88 శాతం కంటే తక్కువ కాకుండా అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

భారత్‌లో BS6 Ducati Hypermotard 950 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

గ్లోబల్ మార్కెట్‌లో సరికొత్త హైపర్‌మోటార్డ్ 950 విజయాన్ని చూసిన తర్వాత, ఈ రెండు ప్రత్యేకమైన మోడళ్లతో కూడిన హైపర్‌మోటార్డ్ 950 సిరీస్‌ను భారతదేశానికి తీసుకురావడం పట్ల తాము చాలా సంతోషిస్తున్నామని డ్యుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర తెలిపారు. ఈ హైపర్‌మోటార్డ్ 950 డ్యుకాటి శ్రేణిలోనే ఫన్-టూ-రైడ్ బైక్‌గా ఉంటుందని, రైడింగ్ చేసేటప్పుడు అధిక స్థాయి థ్రిల్ మరియు నియంత్రణకు హామీ ఇచ్చేలా రూపొందించబడిందని ఆయన చెప్పారు.

భారత్‌లో BS6 Ducati Hypermotard 950 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

హైపర్‌మోటార్డ్ చాలా విలక్షణమైన డ్యుకాటి అనుభవం అందిస్తుందని మరియు హైపర్‌మోటార్డ్ ఎస్‌పి వంటి బైక్ ఇప్పుడు భారతదేశంలోని నిజమైన మోటర్డ్ ఔత్సాహికుల కోసం అందుబాటులో ఉందని తెలుసుకోవడం చాలా ఉత్సాహంగా ఉందని బిపుల్ చంద్ర అన్నారు.

Most Read Articles

English summary
New bs6 ducati hypermotard 950 launched in india find out all the details here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X