Royal Enfield Himalayan 650 బైక్ వస్తోంది.. డీటేల్స్ వెల్లడి!

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అందిస్తున్న పాపులర్ ఆఫ్-రోడ్ అడ్వెంచర్ టూరర్ బైక్ హిమాలయన్ (Himalayan) లో కంపెనీ మరింత శక్తివంతమైన మోడల్ పై పనిచేస్తోందని మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా, ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 (Royal Enfield Himalayan 650) మోడల్ కి సంబంధించి తాజా సమాచారం వెల్లడైంది.

Royal Enfield Himalayan 650 బైక్ వస్తోంది.. డీటేల్స్ వెల్లడి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 రెండు వేరియంట్లలో విడుదల కానుంది. ఇది ప్రస్తుత హిమాలయన్ బైక్ మాదిరిగా పూర్తి ఆఫ్-రోడ్ అడ్వెంచర్ బైక్ లా ఉండబోదు. ఆన్-రోడ్ మరియు టూరింగ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ బైక్ ను రూపొందించే అవకాశం ఉంది. అయితే, ఈ హిమాలయన్ 650 రోడ్ల పైకి రావడానికి మరో రెండు మూడేళ్ల సమయం కూడా పట్టవచ్చని సమాచారం.

Royal Enfield Himalayan 650 బైక్ వస్తోంది.. డీటేల్స్ వెల్లడి!

బైక్‌వాలే నివేదిక ప్రకారం, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 బైక్ ను 2024 నాల్గవ త్రైమాసికంలో ప్రారంభించవచ్చు. ఇది రెండు వేరియంట్లలో అందించబడుతుంది కానీ ప్రస్తుత మోడల్ వలె ఆఫ్-రోడింగ్ కోసం తయారు చేయబడదు, అయినప్పటికీ ఇది అదే రకమైన డిజైన్ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Royal Enfield Himalayan 650 బైక్ వస్తోంది.. డీటేల్స్ వెల్లడి!

ఈ నివేదిక ప్రకారం, హిమాలయన్ 650 ప్రాజెక్ట్ సుమారు 18 నెలల క్రితమే ప్రారంభమైంది మరియు ఈ కంపెనీ తమ కొత్త 650 సిసి పారలల్-ట్విన్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినప్పుడు ఇది కంపెనీ ప్రారంభ ప్రణాళికలో భాగం కాదు. ఓ అడ్వెంచర్ బైక్‌ లో ఇంత పెద్ద ఇంజన్‌ ను ఉపయోగించడం చాలా కష్టమని రాయల్ ఎన్‌ఫీల్డ్ భావించింది.

Royal Enfield Himalayan 650 బైక్ వస్తోంది.. డీటేల్స్ వెల్లడి!

అందుకే, కంపెనీ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి, ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. అయితే, ప్రస్తుత హిమాలయన్ (411 సిసి ఇంజన్) పేలవమైన హైవే క్రూయింగ్ వేగం కారణంగా కంపెనీకి హిమాలయన్ 650 కోసం డిమాండ్ ఎక్కువగా ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ తిరిగి తమ హిమాలయన్ 650 ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Royal Enfield Himalayan 650 బైక్ వస్తోంది.. డీటేల్స్ వెల్లడి!

కొత్తగా రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 మోడల్ డిజైన్ సిల్హౌట్ పరంగా చూడటానికి ప్రస్తుత హిమాలయన్ మాదిరిగానే ఉంచబడినప్పటికీ, కంపెనీ దాని డిజైన్ లో స్వల్ప మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది మరియు దీనిని కొత్త ఇంజన్ తో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో రాబోయే రెండు వేరియంట్లలో ఒకటి స్పోక్ వీల్స్ తో మరొకటి అల్లాయ్ వీల్స్ తో విడుదల చేసే అవకాశం ఉంది.

Royal Enfield Himalayan 650 బైక్ వస్తోంది.. డీటేల్స్ వెల్లడి!

ఇందులో అల్లాయ్ వీల్స్ వెర్షన్ ను స్పోర్ట్ అడ్వెంచర్‌ గా మరియు స్పోక్ వీల్స్ వెర్షన్ ను అడ్వెంచర్ టూరర్ గా తీసుకువచ్చే అవకాశం ఉంది. కంపెనీ దీనిని బేసిక్ ఆఫ్-రోడింగ్‌తో రోడ్ ఆధారిత బైక్‌గా తీసుకురానుంది. ఈ బైక్ ను పూర్తిగా ఆఫ్ రోడ్ బైక్‌గా తీసుకురావడానికి కంపెనీ రిస్క్ తీసుకోదలుచుకోలేదని తెలుస్తోంది.

Royal Enfield Himalayan 650 బైక్ వస్తోంది.. డీటేల్స్ వెల్లడి!

ఈ కొత్త బైక్ లో చక్రాలు, ఫీచర్లతో సహా అనేక విషయాలలో కూడా భారీ మార్పులను ఆశించవచ్చు. ధర కూడా అందుబాటులోనే ఉంటుందని అంచనా. కంపెనీ దీనిని కొత్త బ్రాండ్‌గా కూడా స్థాపించాలనుకుంటోంది. హిమాలయన్ 650 లో 21 అంగుళాలకు బదులుగా 19 అంగుళాల చక్రాలను ఉపయోగించవచ్చు. ఫలితంగా, దీని సీటు ఎత్తు కూడా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో, సాధారణ ఆఫ్-రోడింగ్‌ ఉపయోగపడే మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ను కూడా ఇది కలిగి ఉంటుంది.

Royal Enfield Himalayan 650 బైక్ వస్తోంది.. డీటేల్స్ వెల్లడి!

స్టైలింగ్‌లో ఇది దాదాపు 80-85 శాతం హిమాలయన్ మాదిరిగానే ఉంచబడుతుంది. కాబట్టి, ఇందులో ఆకర్షణీయమైన డిజైన్, బలమైన రూపాన్ని ఆశించవచ్చు. బ్రేక్‌లు మెరుగుపరచడంతో పాటు దాని ఎగ్జాస్ట్ సిస్టమ్ ను కూడా కంపెనీ రీడిజైన్ చేసే అవకాశం ఉంది. ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త మోడళ్ల మాదిరిగానే, ఈ బైక్‌లో కూడా టిఎఫ్‌టి స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్‌లు మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మొదలైన ఫీచర్లను అందించవచ్చు.

Royal Enfield Himalayan 650 బైక్ వస్తోంది.. డీటేల్స్ వెల్లడి!

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయిస్తున్న 650 ట్విన్ మోడళ్ల (కాంటినెంటల్ జిటి, ఇంటర్‌సెప్టర్) మాదిరిగానే, ఈ కొత్త హిమాలయన్ 650 మోడల్ కూడా 649 సిసి ఇంజన్‌ ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ మోడల్ ని కేవలం భారత మార్కెట్లో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టబడుతుంది.

Royal Enfield Himalayan 650 బైక్ వస్తోంది.. డీటేల్స్ వెల్లడి!

అంచనా ప్రకారం, ఈ కొత్త హిమాలయన్ 650 ధర దాదాపు రూ. 4 లక్షల వరకు ఉంచవచ్చొని తెలుస్తోంది. కాబట్టి, వినియోగదారులు ఈ బైక్ కోసం ఆన్-రోడ్ ధర సుమారు రూ. 4.5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధర వద్ద ఇది చాలా భిన్నమైన సెగ్మెంట్‌గా మారుతుంది.

Royal Enfield Himalayan 650 బైక్ వస్తోంది.. డీటేల్స్ వెల్లడి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఆటోమోటివ్ రంగంలో తన 120 సంవత్సరాల ప్రయాణాన్ని జరుపుకోవడానికి కంపెనీ లిమిటెడ్ ఎడిషన్ శ్రేణి హెల్మెట్‌లను విడుదల చేసింది. ఈ శ్రేణిలో మొత్తం 12 హెల్మెట్‌లు ఉన్నాయి, ఇందులో ప్రతి ఒక్కటి కూడా కంపెనీ వారసత్వానికి చెందిన 12 దశాబ్దాల పోస్టర్ లేదా ప్రకటన ద్వారా స్ఫూర్తి పొందిన ప్రత్యేకమైన డిజైన్‌తో ఉంటాయి.

Source: Bikewale

Most Read Articles

English summary
New details revealed about royal enfield himalayan 650
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X