డ్యుకాటి మోన్‌స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

ఇటాలియన్ సూపర్‌బైక్ కంపెనీ డ్యుకాటి తమ సరికొత్త 2021 మోన్‌స్టర్ మోటార్‌‌సైకిల్ ఉత్పత్తిని ప్రారంభించింది. త్వరలోనే ఈ మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో విడుదల కానుంది.

డ్యుకాటి మోన్‌స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

డ్యుకాటి బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడైన సూపర్‌బైక్‌లలో మోన్‌స్టర్ కూడా ఒకటి. ఇది ఈ విభాగంలో ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్, బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్900ఆర్, కవాసాకి జెడ్ 900 మరియు యమహా ఎమ్‌టి-09 వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలుస్తుంది.

డ్యుకాటి మోన్‌స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

డ్యుకాటి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 3.50 లక్షల యూనిట్లకు పైగా మోన్‌స్టర్ మోటార్‌సైకిళ్లను విక్రయించింది. ఈ నేపథ్యంలో కొత్తగా రాబోయే 2021 డ్యుకాటి మోన్‌స్టర్ మోడల్‌పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

డ్యుకాటి మోన్‌స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

కంపెనీ కూడా కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా, ఈ కొత్త మోడల్‌ను అదనపు ఫీచర్లు మరియు పరికరాలతో అప్‌గ్రేడ్ చేయనుంది. ఇప్పటికే ఈ కొత్త బైక్ ఉత్పత్తిని కూడా ప్రారంభించినట్లు డ్యుకాటి అధికారికంగా ప్రకటించింది.

డ్యుకాటి మోన్‌స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

కొత్త 2021 డ్యుకాటి బైక్‌ను గ్లోబల్ మార్కెట్లతో పాటుగా భారత మార్కెట్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఈ కొత్త మోటార్‌సైకిల్ భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చని సమాచారం.

డ్యుకాటి మోన్‌స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

డ్యుకాటి నుండి పాపులర్ అయిన హైపర్‌మోటార్డ్ 950, మల్టీస్ట్రాడా 950 మరియు సూపర్‌స్పోర్ట్ 950 మోటార్‌సైకిళ్లలో ఉపయోగించిన అదే 937సిసి ఎల్-ట్విన్ టెస్టోస్టెరాన్ ఇంజన్‌నే ఈ కొత్త డ్యుకాటి మోన్‌స్టర్ మోటార్‌సైకిల్‌లో కూడా ఉపయోగించనున్నారు.

డ్యుకాటి మోన్‌స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

ఈ ఇంజన్ గరిష్టంగా 112 పిఎస్ శక్తిని మరియు 93 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డ్యుకాటి యొక్క క్విక్ షిఫ్ట్ ఫీచర్‌తో వస్తుందని అంచనా. ఈ కొత్త మోడల్ మునుపటి కన్నా కాస్తంత తేలికగా ఉంటుందని సమాచారం. ఇందుకు ప్రధాన కారణం దీని నిర్మాణంలో చేసిన మార్పులే.

డ్యుకాటి మోన్‌స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

కొత్త 2021 డ్యుకాటి మోన్‌స్టర్ బైక్‌లో ఫ్రేమ్ మరియు సబ్‌ఫ్రేమ్, వీల్స్, స్వింగ్ ఆర్మ్ వంటి భాగాలను మరింత తేలికమైన మరియు ధృడమైన భాగాలతో భర్తీ చేశారు. మునుపటితో పోలిస్తే, ఈ బైక్ బరువు 2.6 కిలోలు తక్కువగా ఉండి, మొత్తంగా 166 కిలోలు ఉంటుందని సమాచారం.

డ్యుకాటి మోన్‌స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

ఈ మోడల్‌లో చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా దాని ఐకానిక్ డిజైన్ సిల్హౌట్ మాత్రం మునుపటి మాదిరిగానే ఉంటుంది. ఇందులో పూర్తిగా ఎల్ఈడి లైట్స్, మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు స్ప్లిట్ స్టైల్ సీట్స్ ఉంటాయి. ముందు వైపు డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి, ఇవి డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

డ్యుకాటి మోన్‌స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!

కొత్తగా రానున్న 2021 డ్యూకాటి మోన్‌స్టర్ స్పోర్ట్, అర్బన్ మరియు టూరింగ్ అనే మూడు రైడింగ్స్ మోడ్స్‌తో రానుంది. ఇందులో 4.3 ఇంచ్ టిఎఫ్‌టి కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది లేటెస్ట్ కనెక్ట్ ఫీచర్లను కూడా సపోర్ట్ చేయవచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New Ducati Monster Production Begins; India Launch Expected Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X