భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న 2021 Harley Davidson బైక్: డిజైన్ & ఫీచర్స్ మైండ్ బ్లోయింగ్

ప్రపంచ ద్విచక్ర వాహన మార్కెట్లో అత్యంత ఖరీదైన మరియు లగ్జరీ బైకుల తయారీకి పేరుగాంచిన హార్లే-డేవిడ్సన్ (Harley-Davidson) మంచి ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతోంది. అంతే కాకుండా Harley-Davidson లేటెస్ట్ క్రూయిజర్ బైక్‌లకు ప్రసిద్ధి చెందిన కంపెనీ. ఈ అమెరికన్ బైక్ తయారీ సంస్థ త్వరలో భారత మార్కెట్లోకి కొత్త బైక్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Harley Davidson బైక్: డిజైన్ & ఫీచర్స్ మైండ్ బ్లోయింగ్

నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం డిసెంబర్‌లో భారతదేశంలో జరగనున్న '2021 ఇండియా బైక్ వీక్'లో, కంపెనీ తన కొత్త బైక్ 2021 స్పోర్ట్‌స్టర్ ఎస్‌ను విడుదల చేయనుంది. Harley-Davidson కంపెనీ ఇప్పటికే ఈ బైక్ మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తోంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Harley Davidson బైక్: డిజైన్ & ఫీచర్స్ మైండ్ బ్లోయింగ్

కొత్త హార్లే-డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ యొక్క కాన్సెప్ట్ మోడల్ నాలుగు సంవత్సరాల క్రితం మార్కెట్లో పరిచయం చేయబడింది. అయితే, నాలుగేళ్ల తర్వాత కూడా ఈ బైక్ ఉత్పత్తి మోడల్‌లో కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు. అయినప్పటికి కూడా ఈ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Harley Davidson బైక్: డిజైన్ & ఫీచర్స్ మైండ్ బ్లోయింగ్

హార్లే-డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ ట్విన్ ఎగ్జాస్ట్ కలిగి, వెడల్పాటి టైర్లతో, సింగిల్ పీస్ సీటుతో చాలా స్టైలిష్ గా ఉంటుంది. అంతే కాకూండా ఈ బైక్ దిగువన పెద్ద స్కిడ్ ప్లేట్ మరియు ట్యాంక్ నుండి సీటు వరకు చక్కని ఫ్లాట్ లైన్‌ను పొందుతుంది. అయితే పెద్ద ముందు టైర్ మరియు చిన్న ఫెండర్ క్లాసిక్ బాబర్ రూపాన్ని అందిస్తాయి.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Harley Davidson బైక్: డిజైన్ & ఫీచర్స్ మైండ్ బ్లోయింగ్

ఈ లగ్జరీ బైక్ యొక్క ముందువైపు, స్పోర్ట్‌స్టర్ ఎస్ క్యాప్సూల్ ఆకారపు హెడ్‌లైట్‌ని పొందుతుంది, అది చాలా వరకు భిన్నంగా కనిపిస్తుంది. అంతే కాకూండా ఫ్లాట్ టెయిల్ సెక్షన్, సింగిల్-పీస్ శాడిల్ మరియు గోల్డెన్-కలర్ ఎగ్జాస్ట్ మఫ్లర్ వంటి వాటిని పొందుతుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Harley Davidson బైక్: డిజైన్ & ఫీచర్స్ మైండ్ బ్లోయింగ్

ఈ బైక్ యొక్క ఇంజన్ మెగ్నీషియం కవర్‌పై చాక్లెట్ శాటిన్ ఫినిషింగ్‌ని ఉపయోగించడం ద్వారా హైలైట్ చేయబడింది. కంపెనీ ఈ క్రూయిజర్‌ను స్టోన్ వాష్ వైట్ పెర్ల్, మిడ్‌నైట్ క్రిమ్సన్ మరియు వివిడ్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. మొత్తం మీద, ఈ క్రూయిజర్ కస్టమ్-బిల్ట్ బైక్‌లా కనిపించేలా రూపొందించబడింది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Harley Davidson బైక్: డిజైన్ & ఫీచర్స్ మైండ్ బ్లోయింగ్

హార్లే డేవిడ్‌సన్ కొత్త స్పోర్ట్‌స్టర్ S యొక్క ఛాసిస్‌ను కూడా అప్డేట్ చేయబడింది. ఈ బైక్ యొక్క ఇంజన్ బరువును కూడా మునుపటికంటే కూడా చాలా తగ్గించబడింది. ఇది కాకుండా, బైక్ తేలికైన భాగాలను ఉపయోగించడం వల్ల బరువు నిష్పత్తికి ఉత్తమమైన శక్తిని కూడా సాధించింది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Harley Davidson బైక్: డిజైన్ & ఫీచర్స్ మైండ్ బ్లోయింగ్

ఈ బైక్ లో ఉన్న కొత్త ఛాసిస్ డిజైన్ మోటార్‌సైకిల్ నిర్వహణను మరింత మెరుగుపరిచిందని కంపెనీ పేర్కొంది. బైక్ ముందువైపు షోవా 43 మిమీ ఇన్వర్టెడ్ ఫోర్క్స్ మరియు వెనుకవైపు షోవా పిగ్గీబ్యాక్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్‌ను పొందుతుంది. కావున అద్భుతమైన ఫెర్ఫామెన్స్ అందిస్తుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Harley Davidson బైక్: డిజైన్ & ఫీచర్స్ మైండ్ బ్లోయింగ్

ఈ బైక్ యొక్క ఫ్రంట్ సస్పెన్షన్ యూనిట్ పూర్తిగా అడ్జస్టబుల్, అదే విధంగా వెనుక భాగంలో హైడ్రాలిక్ ప్రీలోడ్ సర్దుబాటును కలిగి ఉంటుంది. ఇది 5-స్పోక్ డిజైన్‌లో వచ్చే 17 ఇంచెస్ ఫ్రంట్ మరియు 16 ఇంచెస్ రియర్ లైట్ వెయిట్ కాస్ట్-అల్యూమినియం అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది.

అదే విధంగా ఈ బైక్‌ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందువైపు 320 మిమీ మరియు వెనుకవైపు 260 మిమీ డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉన్నాయి. ఇవి బైక్ వేగాన్ని అద్భుతంగా కంట్రోల్ చేస్తాయి.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Harley Davidson బైక్: డిజైన్ & ఫీచర్స్ మైండ్ బ్లోయింగ్

2021 హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ 1250 సిసి రివల్యూషన్ మ్యాక్స్ 1250టి ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 121 బిహెచ్‌పి పవర్ మరియు 125 ఎన్ఎమ్ టార్క్‌ను అందించగలదు. ఈ ఇంజన్ హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 నుండి తీసుకోబడింది, అయితే ఈ ఇంజన్ ఈ బైక్‌లో 30 బిహెచ్‌పి పవర్ తక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు స్లిప్పర్ క్లచ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Harley Davidson బైక్: డిజైన్ & ఫీచర్స్ మైండ్ బ్లోయింగ్

2021 హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ యొక్క ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన 4.0 ఇంచెస్ TFT డిజిటల్ కన్సోల్‌ వంటి ఆధునిక ఫీచర్స్ ఉంటాయి.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Harley Davidson బైక్: డిజైన్ & ఫీచర్స్ మైండ్ బ్లోయింగ్

ఈ కొత్త లగ్జరీ బైక్ నాలుగు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి రోడ్, స్పోర్ట్, రెయిన్ మరియు కస్టమ్ మోడ్స్. 2021 హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ $14,999 ప్రారంభ ధరతో పరిచయం చేయబడింది. అయితే ఈ బైక్ ధర భారతీయ మార్కెట్లో రూ. 15 లక్షల నుంచి రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విడుదలయ్యే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
New harley davidson sportster s unveiled launch in india soon details
Story first published: Saturday, November 20, 2021, 9:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X