కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ జావా మోటార్‌సైకిల్స్, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫోర్టీ టూ (42) మోడల్‌లో ఓ కొత్త 2021 వెర్షన్‌ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ సరికొత్త 2021 జావా ఫోర్టీ టూ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.1.84 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్‌లో సరికొత్త ఫీచర్లు, కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మరియు మూడు కొత్త పెయింట్ స్కీమ్ ఆప్షన్లు ఉన్నాయి.

కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ముందుగా కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌ను పరిశీలిస్తే, ఈ కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ ఇప్పుడు మూడు కొత్త రంగులో లభిస్తుంది. అవి: సీరియస్ వైట్, ఆల్-స్టార్ బ్లాక్ మరియు ఓరియన్ రెడ్. ఈ మూడు పెయింట్ స్కీమ్స్‌లో కూడా ఫ్యూయెల్ ట్యాంక్‌పై రేసింగ్ స్ట్రైప్స్‌తో కూడిన '42' నెంబర్ మరియు 'క్లాసిక్ లెజెండ్స్' అనే బాడీ గ్రాఫిక్స్ ఉంటాయి.

కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఇక ఈ కొత్త మోడల్‌లోని ఫీచర్ల విషయానికి వస్తే, ఈ మోటారుసైకిల్ ఇప్పుడు బార్-ఎండ్ మిర్రర్లతో లభిస్తుంది. రైడర్ మరియు పిలియన్ రైడర్ కోసం విస్తృత మరియు సౌకర్యవంతమైన సీట్స్, రీడిజైన్ చేయబడిన సైడ్ స్టాండ్, ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

జావా మోటార్‌సైకిల్స్ ఈ ఫోర్టీ టూ మోడల్ కోసం హెడ్‌ల్యాంప్ గ్రిల్ మరియు ఫ్లై-స్క్రీన్‌లను యాక్ససరీలుగా అందిస్తోంది. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కోసం ఈ మోటార్‌సైకిల్ సస్పెన్షన్ సెటప్‌ను కంపెనీ స్వల్పంగా రీట్యూన్ చేసింది. కాకపోతే, ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పు లేదు.

కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

మునుపటి జావా ఫోర్టీ టూ మోడల్‌లో ఉపయోగించిన 293సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌నే ఈ కొత్త మోడల్‌లోనూ ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 27 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

అయితే, ఈ కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్‌లోని ఇంజన్ ఇప్పుడు క్రాస్-పోర్ట్ ప్రవాహంతో వస్తుంది, ఇది మెరుగైన శుద్ధీకరణ, ఇంధన సామర్థ్యం (మైలేజ్), ​​బలమైన యాక్సిలరేషన్‌ను ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా, దీని డ్యూయెల్ ఎగ్జాస్ట్ పైపుల నుండి మరింత బలమైన థ్రోటల్ ఎగ్జాస్ట్ నోట్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ కొత్త మోడల్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా సపోర్ట్ చేస్తాయి. మునుపటితో పోలిస్తే, ఈ కొత్త మోటారుసైకిల్ ఇప్పుడు 2 కిలోల తక్కువ (172 కిలోగ్రాముల) బరువును కలిగి ఉండి మెరుగైన పనితీరును అందిస్తున్న జావా తెలిపింది.

కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ కోసం బుకింగ్‌లు మరియు టెస్ట్ రైడ్‌లు వెంటనే ప్రారంభమవుతాయని, త్వరలోనే ఈ మోటార్‌సైకిల్ డెలివరీలను కూడా ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఆసక్తిగల కస్టమర్లు ఈ కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్‌ను ఆన్‌లైన్‌లో కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్న 181 జావా మోటార్‌సైకిల్ డీలర్‌షిప్‌ల ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
New 2021 Jawa Forty-Two Motorcycle Launched In India; Price, Specs And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X