Kawasaki నుంచి రూ. 8.99 లక్షల బైక్ విడుదల.. 2022 జనవరిలో డెలివరీలు

ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) భారతీయ మార్కెట్లో కొత్త కెఎల్ఎక్స్450ఆర్ (KLX450R) బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుక్సలైన ఈ కొత్త బైక్ ధర రూ. 8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్ దాని మునుపటి మోడల్ బైక్ కంటే కూడా దాదాపు రూ. 50,000 ఎక్కువ ధర కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Kawasaki నుంచి రూ. 8.99 లక్షల బైక్ విడుదల.. 2022 జనవరిలో డెలివరీలు

కొత్త కవాసకి కెఎల్ఎక్స్450ఆర్ బైక్ చాలా లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ కొత్త డీకాల్స్‌తో కూడిన కొత్త లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌తో వస్తుంది. కవాసకి మునుపటి కంటే మెరుగైన లో-ఎండ్ టార్క్ కోసం ఇంజిన్‌ను కూడా సర్దుబాటు చేసింది. కావున ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. అంతే కాకుండా ఎటువంటి రహదారిలో అయినా ప్రయాణించడానికి ఇది చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. దీనికి కావలసిన సస్పెన్షన్ సెటప్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

Kawasaki నుంచి రూ. 8.99 లక్షల బైక్ విడుదల.. 2022 జనవరిలో డెలివరీలు

2022 కవాసకి కెఎల్ఎక్స్450ఆర్ 449సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ లైట్ వెయిట్ అల్యూమినియం పెరిమీటర్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

Kawasaki నుంచి రూ. 8.99 లక్షల బైక్ విడుదల.. 2022 జనవరిలో డెలివరీలు

కవాసకి కెఎల్ఎక్స్450ఆర్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు వైపున లాంగ్ ట్రావెల్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్ మరియు వెనుక వైపు మోనోషాక్‌ సెటప్ ఉంటుంది. అదేవిధంగా ఇందులో మంచి బ్రేకింగ్ సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ బైక్ యొక్క రెండు చివర్లలో పెటల్-టైప్ డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉన్నాయి.

Kawasaki నుంచి రూ. 8.99 లక్షల బైక్ విడుదల.. 2022 జనవరిలో డెలివరీలు

ఈ కొత్త కెఎల్ఎక్స్450ఆర్ బైక్ రెంటాల్ అల్యూమినియం హ్యాండిల్ బార్ కలిగి ఉండటమే కాకుండా, చిన్న డిజిటల్ కన్సోల్ కూడా పొందుతుంది. 2022 కవాసకి KLX450R బైక్ కూడా దాని మునుపటి మోడల్స్ లాగానే భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా రానున్నాయి. ఈ బైక్ డెలివరీలను కంపెనీ రానున్న కొత్త సంవత్సరం ప్రారంభంలో అంటే 2022 జనవరి నుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది.

Kawasaki నుంచి రూ. 8.99 లక్షల బైక్ విడుదల.. 2022 జనవరిలో డెలివరీలు

భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ బుక్ చేసుకున్న కస్టమర్లు దీనిని 2022 జనవరి సమయంలో డెలివరీ పొందుతారు, కావున ఈ బైక్ కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ కొత్త బైక్ ఆఫ్ రోడ్ ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Kawasaki నుంచి రూ. 8.99 లక్షల బైక్ విడుదల.. 2022 జనవరిలో డెలివరీలు

ఇదిలా ఉండగా కవాసకి కంపెనీ ఇటీవల కాలంలోనే భారతీయ విఫణిలో Kawasaki కెఎక్స్250 మరియు Kawasaki కెఎక్స్450 మోడళ్లను విడుదల చేసింది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 7.99 లక్షలు మరియు రూ. 8.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ రెండు మోటార్‌సైకిళ్లు పూర్తిగా హార్డ్‌కోర్ ఆఫ్-రోడింగ్ కోసం నిర్మించించింది.

Kawasaki నుంచి రూ. 8.99 లక్షల బైక్ విడుదల.. 2022 జనవరిలో డెలివరీలు

డిజైన్ విషయానికి వస్తే, Kawasaki కెఎక్స్250 మరియు Kawasaki కెఎక్స్450 చూడటానికి రెండూ ఒకేలా ఉన్నప్పటికీ, వీటిలో కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. అయితే, వీటిలో చాలా భాగాలు, పరికరాలు మాత్రం అలాగే ఉంచబడ్డాయి. ఈ డర్ట్ బైక్‌లను సవరించిన తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌పై నిర్మించారు.

Kawasaki నుంచి రూ. 8.99 లక్షల బైక్ విడుదల.. 2022 జనవరిలో డెలివరీలు

ఈ తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌ ఈ మోటార్‌సైకిళ్ల డైనమిక్స్‌ ను మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది. వీటి రూపకల్పనలో ఎలాంటి టింకరింగ్ లేదు. అయితే, ఈ రెండు బైక్‌ లపై ఎర్గోనామిక్స్ మాత్రం మెరుగుపరచబడ్డాయి.

Kawasaki నుంచి రూ. 8.99 లక్షల బైక్ విడుదల.. 2022 జనవరిలో డెలివరీలు

వీటిలో రీడిజైన్ చేసిన ఫ్యూయెల్ ట్యాంక్, ఒక ఫ్లాటర్ ట్యాంక్ సీట్ మరియు సన్నని కవచం ఉన్నాయి. Kawasaki ఈ డర్ట్ బైక్‌లను ERGO FIT అడ్జస్టబల్ హ్యాండిల్‌బార్‌ తో పరిచయం చేసింది మరియు వాటి ఫుట్‌పెగ్‌ లను కూడా కొత్త వాటితో రీప్లేస్ చేశారు.

Kawasaki నుంచి రూ. 8.99 లక్షల బైక్ విడుదల.. 2022 జనవరిలో డెలివరీలు

వైబ్రేషన్‌ను తగ్గించడానికి రెండు బైక్‌ల హ్యాండిల్‌బార్‌ లకు రెంటల్ అల్యూమినియం ఫ్యాట్‌బార్‌ ను అమర్చారు. ఈ మోటార్‌సైకిళ్ల నిర్వహణ కూడా మెరుగుపరచబడింది, ఇందుకు ప్రధాన కారణం దీనిలోని రేస్-రెడీ సస్పెన్షన్ సెటప్. ఇందులో ముందువైపు 49 మిమీ విలోమ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో కొత్త యూనిట్ ట్రాక్ యూనిట్ ఉన్నాయి. ఈ ఆఫ్-రోడింగ్ మోటార్‌సైకిళ్లు చాలా తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఇందులో కెఎక్స్250 బరువు 107 కేజీలు కాగా, కెఎక్స్450 బరువు 110 కేజీలుగా మాత్రమే ఉంటుంది.

Kawasaki నుంచి రూ. 8.99 లక్షల బైక్ విడుదల.. 2022 జనవరిలో డెలివరీలు

ఈ రెండు బైకుల ఇంజన్‌ల విషయానికి వస్తే, Kawasaki కెఎక్స్250 ఫ్యాక్టరీ-రేసర్ ట్యూనింగ్‌ తో కూడిన 249 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో లభిస్తుంది. అలాగే, Kawasaki కెఎక్స్450 ఇంజన్ కూడా రేస్-ట్యూన్డ్ 449 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ తో లభిస్తుంది. అయితే, ఈ రెండు ఇంజన్లనకు సంబంధించిన ఖచ్చితమైన పవర్, టార్క్ గణాంకాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ రెండు బైక్‌లు 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో లభిస్తాయి. Kawasaki తమ మోటోక్రోసర్ శ్రేణిలో హైడ్రాలిక్ క్లచ్‌ను అందించడం ఇదే మొదటిసారి కావటం విశేషం.

Most Read Articles

English summary
New kawasaki klx450r dirt bike launched in india price details
Story first published: Saturday, December 18, 2021, 15:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X