భారత్‌లో విడుదలైన 2022 కవాసకి నింజా 650; ధర & పూర్తి వివరాలు

భారతదేశంలో కవాసకి ఇండియా కొత్త 2022 కవాసకి నింజా 650 బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి నింజా 650 బైక్ ధర రూ. 6.61 లక్షలు(ఎక్స్-షోరూమ్-ఇండియా). కొత్త కవాసకి నింజా 650 బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు సెప్టెంబర్ నుండి ప్రారంభమవుతాయి.

భారత్‌లో విడుదలైన 2022 కవాసకి నింజా 650; ధర & పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి నింజా 650 రెండు కొత్త కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి పెర్ల్ రోబోటిక్ వైట్ కాగా, మరొకటి లైమ్ గ్రీన్ కలర్స్. కొత్త నింజా 650 మోడల్ ధర పాత మోడల్ కంటే రూ. 7,000 ఎక్కువగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2022 కవాసకి నింజా 650; ధర & పూర్తి వివరాలు

నివేదికల ప్రకారం, మిడిల్ వెయిట్ నింజా ఇప్పటికీ చాలా బ్యాలెన్స్‌డ్ ఎంట్రీ లెవల్ సూపర్‌బైక్‌లలో ఒకటి. అంతే కాకుండా ఈ కొత్త బైక్ 650 సీసీ రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.అంతే కాకుండా రైడర్ కి రైడింగ్ సమయంలో కూడా చాలా అనుకూలంగా ఉండి, లాంగ్ డ్రైవ్ లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2022 కవాసకి నింజా 650; ధర & పూర్తి వివరాలు

కొత్త కవాసకి నింజా 650 బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. అప్‌డేట్ చేయబడిన నింజా 650 ఫ్రంట్ లుక్ పాత మోడల్‌కి భిన్నంగా ఉంటుంది. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఎండ్ బైక్ ఇటీవల విడుదల చేసిన నింజా 400, జెడ్ఆర్-6ఆర్ మరియు వెర్సిస్ 1000 బైక్‌ల మాదిరిగానే ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2022 కవాసకి నింజా 650; ధర & పూర్తి వివరాలు

ఈ కొత్త బైక్ లో ట్విన్-ఎల్ఈడి హెడ్‌లైట్ ముందు భాగంలో పొడవైన నోస్ తో ఇవ్వబడింది. బైక్ యొక్క విండ్‌షీల్డ్ మరియు సైడ్ ఫెయిరింగ్ కూడా కొద్దిగా మార్చబడ్డాయి, దీనిని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త నింజా 650 మునుపటి కంటే చాలా షార్ప్ గా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2022 కవాసకి నింజా 650; ధర & పూర్తి వివరాలు

కొత్త నింజా 650 యొక్క రియర్ డిజైన్ కూడా కొన్ని మార్పులను పొందుతుంది. ఇందులో విశాలమైన పైలాన్ సీటు మరియు షార్ప్ టెయిల్ సెక్షన్‌తో సవరించిన టెయిల్‌లైట్ ఉన్నాయి. బైక్‌లో ఫ్రంట్ టర్న్ ఇండికేటర్ ఫెయిరింగ్‌లో ఇన్‌స్టాల్ చేయబడింది.

భారత్‌లో విడుదలైన 2022 కవాసకి నింజా 650; ధర & పూర్తి వివరాలు

ఈ బైక్ లోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 4.3 అంగుళాల ఫుల్ కలర్ టిఎఫ్టి డిస్‌ప్లే ఉంటుంది, అంతే కాకుండా నావిగేషన్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ ఫీచర్ కూడా అందించబడింది. బైక్‌తో వచ్చే రైడియాలజి యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌కి కనెక్ట్ చేయవచ్చు. ఈ యాప్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ద్వారా రైడర్ మైలేజ్, రైడ్ కండిషన్, ఇంజిన్ టెంపరేచర్, ఎస్ఎమ్ఎస్ మరియు కాల్ అలర్ట్‌ల మొదలైన సమాచారాన్ని పొందవచ్చు.

భారత్‌లో విడుదలైన 2022 కవాసకి నింజా 650; ధర & పూర్తి వివరాలు

కొత్త నింజా 650 బైక్ లో డన్‌లాప్ స్పోర్ట్‌మాక్స్ రోడ్‌స్పోర్ట్ టైర్లు ఇవ్వబడ్డాయి. వీటితోపాటు ఈ బైక్ ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో మరియు వెనుకవైపు సింగిల్ డిస్క్ బ్రేక్‌తో డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ కూడా అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2022 కవాసకి నింజా 650; ధర & పూర్తి వివరాలు

కొత్త కవాసకి నింజా 650 బైక్ యొక్క ఇంజిన్ ఇషయానికి వస్తే, ఇందులో 649 సిసి ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది జెడ్650 స్ట్రీట్‌ఫైటర్ నుండి తీసుకోబడింది. ఈ ఇంజన్ 66 బిహెచ్‌పి పవర్ మరియు 64 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బైక్ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు స్లిప్పర్ క్లచ్‌తో జతచేయబడింది. బైక్ మొత్తం బరువు 196 కేజీలు. అయితే ఈ బైక్ లోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు.

భారత మార్కెట్లో కవాసకి నింజా 650 హోండా సిబిఆర్ 650ఆర్ మరియు సిఎఫ్ మోటో జిటి 650 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.కవాసకి నుంచి వచ్చిన దాదాపు అన్ని బైక్ లు దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2022 కవాసకి నింజా 650 బైక్ కూడా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది. ఈ బైక్ దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను చేపడుతుందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 11, 2021, 17:01 [IST]
English summary
New kawasaki ninja 650 launched price features engine specifications details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+