2022 Kawasaki W800 బైక్.. ఇప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌తో

ప్రముఖ బైక్ తయారీ సంస్థ అయిన Kawasaki (కవాసకి) అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. అయితే Kawasaki ఇప్పుడు తన కొత్త 2022 Kawasaki W800 (2022 కవాసకి డబ్ల్యు800) బైక్ ని అంతర్జాతీయ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. ఈ కొత్త బైక్ ఇటీవల కాలంలో యునైటెడ్ స్టేట్స్‌లో పరిచయం చేయబడింది. అయితే ఈ రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ యూరోపియన్ మార్కెట్‌లకు కూడా పరిచయం చేయబడింది. ఈ Kawasaki W800 బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌తో రానున్న 2022 Kawasaki W800

కొత్త 2022 Kawasaki W800 బైక్ ఇప్పుడు చూడటానికి చాలా అద్బుతంగా ఉంది, దీని కోసం కంపెనీ ఈ బైక్ లో అనేక కాస్మొటిక్ అప్డేట్స్ అందించింది. ఈ బైక్ కొత్త కలర్ స్కీమ్ మరియు ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ మొదలైన వాటితో మార్కెట్లోకి ప్రవేశపెట్టబడింది. ఇది ఒక్క చూపులోనే ఆకర్శించే విధంగా ఉంది.

మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌తో రానున్న 2022 Kawasaki W800

Kawasaki W800 బైక్ ప్రపంచవ్యాప్తంగా డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో పరిచయం చేయబడింది. ఇందులో మెటాలిక్ డయాబ్లో బ్లాక్ కలర్‌తో కూడిన క్యాండీ ఫైర్ రెడ్ కలర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కొత్త బైక్ మెటాలిక్ షేడ్ అయితే, ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న కవాసకి W800 మోడల్‌ను మ్యాట్ పెయింట్ స్కీమ్‌లో విక్రయిస్తున్నారు.

మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌తో రానున్న 2022 Kawasaki W800

ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ ఫ్యూయల్ ట్యాంక్‌పై తెల్లటి గీతలతో పాటు చాలా క్రోమ్ యాక్సెంట్‌లను కూడా పొందుతుంది. అంతే కాకుండా ఈ కొత్త మోటార్ సైకిల్ యొక్క సైడ్ ప్యానెల్స్ బ్లాక్ కలర్ లో తయారు చేయబడ్డాయి. ఇక ఇందులోని రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్లు, హెడ్‌ల్యాంప్ సరౌండ్, ఎగ్జాస్ట్ మొదలైనవన్నీ క్రోమ్‌లో పూర్తి చేయబడ్డాయి, కావున మరింత దూకుడుగా ఉంది.

మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌తో రానున్న 2022 Kawasaki W800

ఈ కొత్త రెట్రో మోటార్‌సైకిల్ యొక్క ఇంజన్ మరియు స్పెసిఫికేషన్‌లు అలాగే ఉన్నాయి. ఇందులో 773 సిసి, వర్టికల్-ట్విన్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 48 బిహెచ్‌పి పవర్ మరియు 4,800 ఆర్‌పిఎమ్ వద్ద 62.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ ఈ ఇంజన్‌లో అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్‌ని కూడా ఉపయోగిస్తుంది.

మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌తో రానున్న 2022 Kawasaki W800

కంపెనీ యొక్క కొత్త 2022 కవాసకి W800 యొక్క పవర్ ఫిగర్ ప్రస్తుతం ఇండియా-స్పెక్ మోడల్ కంటే కొంచెం తక్కువగా ఉంది. ఇండియన్-స్పెక్ కవాసకి W800 గరిష్టంగా 52 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఈ కొత్త మోడల్ 48 బిహెచ్‌పి పవర్ మాత్రమే అందిస్తుంది.

మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌తో రానున్న 2022 Kawasaki W800

2022 కవాసకి W800 బైక్ డబుల్ క్రెడిల్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ స్ప్రింగ్-లోడెడ్ షాక్ అబ్జార్బర్‌లను పొందుతుంది. ఇక బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, ఈ రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్‌ మరియు వెనుక భాగంలో 270 మిమీ డిస్క్ బ్రేక్ పొందుతుంది.

మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌తో రానున్న 2022 Kawasaki W800

కంపెనీ ఈ కొత్త బైక్ లో భద్రతను దృష్టిలో ఉంచుకుని, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఫీచర్ కూడా అందించింది. ఈ కొత్త 2022 Kawasaki W800 బైక్ ధర ఖచ్చితంగా తెలియదు, కానీ భారతదేశంలో విక్రయానికి ఉన్న W800 బైక్ కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాము. భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న W800 బైక్ ధర రూ. 7.26 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌తో రానున్న 2022 Kawasaki W800

Kawasaki (కవాసకి) భారతీయ విఫణిలో కొత్త 650 సీసీ బైక్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. Kawasaki జెడ్650ఆర్ఎస్ బైక్ దేశీయ మార్కెట్లో Royal Enfield Interceptor 650 (రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650) మరియు Continental GT650 (కాంటినెంటల్ జిటి650) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త బైక్ అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌తో రానున్న 2022 Kawasaki W800

Kawasaki జెడ్650ఆర్ఎస్ బైక్ కంపెనీ యొక్క Kawasaki W800 తర్వాత భారతదేశంలో రెండవ క్లాసిక్ బైక్ అవుతుంది. ప్రస్తుతం, కంపెనీ భారతదేశంలో తన బైక్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. గత కొన్ని నెలలుగా, కంపెనీ తన స్పోర్ట్స్, రోడ్‌స్టర్ మరియు స్ట్రీట్ ఫైటర్ బైక్‌లను భారతదేశంలో విడుదల చేస్తూనే ఉంది, వీటికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ బైకులన్నీ కూడా చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఈ బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకోటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 27, 2021, 19:08 [IST]
English summary
New kawasaki w800 unveiled for global market features engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+