కేవలం 48 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ తమ సరికొత్త "కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్" మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడైపోయింది. లిమిటెడ్ ఎడిషన్ రూపంలో వచ్చిన ఈ మోడల్ బుకింగ్స్ కేవలం 48 నిమిషాల్లోనే పూర్తయినట్లు కంపెనీ తెలిపింది.

కేవలం 48 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్

తాజా నివేదిక ప్రకారం, కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ మోడల్‌ని ప్రపంచ వ్యాప్తంగా 500 యూనిట్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంచారు. ఈ బైక్ యొక్క ఆన్‌లైన్ అమ్మకాలు ప్రారంభమైన 48 నిమిషాల్లోనే మొత్తం 500 యూనిట్లు అమ్ముడయ్యాయి.

కేవలం 48 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్

కొత్త 2021 కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్‌ఆర్ మోడల్‌ను 30,550 డాలర్ల (సుమారు రూ.22,73,516) ధరతో విడుదల చేశారు. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ యొక్క అన్ని యూనిట్లు అమ్ముడైన తర్వాత కంపెనీ రూ.2,112 కోట్లు సంపాదించినట్లు సమాచారం.

MOST READ:ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక

కేవలం 48 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్

ఈ కొత్త 2021 మోడల్ కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ మోడల్‌ను స్టాండర్డ్ కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆధారంగా చేసుకొని, పెర్ఫార్మెన్స్ వేరియంట్‌గా రూపొందించారు. పనితీరు విషయంలో కొత్త బైక్ స్టాండర్డ్ వేరియంట్ కన్నా చాలా చురుకుగా ఉంటుంది.

కేవలం 48 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్

కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ బైక్‌లో శక్తివంతమైన 1,301 సిసి ఎల్‌సి8 75-యాంగిల్ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా ఈ 182 పిఎస్ పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు బై-డైరెక్షన్ క్విక్ షిఫ్టర్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

కేవలం 48 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్

మెరుగైన థ్రోటల్ పనితీరు కోసం కెటిఎమ్ ఈ సూపర్ డ్యూక్ బైక్‌కు కొత్త క్విక్ షిఫ్టర్‌ను జోడించింది. ఈ సూపర్ బైక్ మొత్తం బరువు 180 కిలోలు. ఈ బైక్ బరువును మరియు దాని ఇంజన్ విడుదల చేసే శక్తిని పోల్చి చూస్తే, ఇది 1: 1 పవర్ టూ వెయిట్ రేషియోని కలిగి ఉంటుంది.

కేవలం 48 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్

ఈ బైక్ బరువును తేలికగా ఉంచేందుకు దీని తయారీలో చాలా భాగాలను కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. అల్యూమినియం ఫ్రేమ్‌పై తయారైన ఈ బైక్‌లో కేవలం 2.5 కిలోలు మాత్రమే బరువున్న లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ బైక్ టెయిల్ డిజైన్‌లో కూడా ఎక్కువ భాగం కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడింది.

MOST READ:మీకు తెలుసా.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 లో కనిపించే క్లాసిక్ కార్లు, ఇవే

కేవలం 48 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్

ఈ కార్బన్ ఫైబర్ భాగాలలో ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్స్, కార్బన్ బేస్ ట్రే, రియర్ కౌల్ మరియు ఫ్రంట్ బ్రేక్ కూలర్‌తో కొత్త ఫ్రంట్ ఫ్రేమ్ కూడా ఉంటుంది. అదే విధంగా టైటానియం మరియు కార్బన్ ఫైబర్ కవర్‌తో ఫినిష్ చేసిన అక్రోబాటిక్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా బైక్ బరువును తగ్గించటానికి సహాయపడింది.

కేవలం 48 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్

కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ బైక్‌లో రెయిన్, స్ట్రీట్, పెర్ఫార్మెన్స్ మరియు ట్రాక్ అనే ఐదు వేర్వేరు రైడింగ్ మోడ్‌లను కూడా ఆఫర్ చేస్తున్నారు. రైడర్ తన అవసరాన్ని బట్టి ఈ రైడింగ్ మోడ్స్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.

MOST READ:ఒకప్పుడు సిటీబస్సులో ప్రయాణించిన నటి, ఇప్పుడు లగ్జరీ కార్ కొనింది.. ఎవరో తెలుసా?

కేవలం 48 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్

ఈ బైక్‌లోని ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్, మోటారు స్లిప్ రెగ్యులేషన్, సూపర్‌మోటో ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, కీలెస్ స్టార్ట్, ఎల్ఈడి హెడ్‌లైట్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్ మరియు ఎల్ఈడి ఇండికేటర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కేవలం 48 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్

ఈ బైక్ లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. కెటిఎమ్ మై రైడ్ అప్లికేషన్ సాయంతో రైడర్లు ఈ బైక్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బైక్‌లో 5-ఇంచ్ యాంగిల్-అడ్జస్టబల్ టిఎఫ్‌టి స్క్రీన్ ఉంటుంది. దీని సాయంతో కాల్స్, మెసేజెస్‌ను రిసీవ్ చేసుకోవటమే కాకుండా టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా కంట్రోల్ చేయవచ్చు.

Most Read Articles

English summary
New KTM 1290 Super Duke RR Sold Out Completely Within 48 Minutes. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X