RC 125 మరియు RC 200 బైక్స్ లాంచ్ చేసిన KTM: పూర్తి వివరాలు

కుర్రకారుకి ఎంతగానో ఇష్టమైన బైకుల జాబితాలో ముందు వరుసలో ఉన్న బ్రాండ్ KTM (కెటిఎమ్). KTM కంపెనీ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ బ్రాండ్. ఈ కంపెనీ యొక్క బైకులకు దేశీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ అనేక మోడల్స్ విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ ఇప్పుడు మరో రెండు కొత్త బైక్స్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బైక్స్ గురించి పోర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

RC 125 మరియు RC 200 బైక్స్ లాంచ్ చేసిన KTM: వివరాలు

KTM ఇప్పుడు దేశీయ మార్కెట్లో రెండు బైకులను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో ఒకటి KTM RC 125 కాగా, మరొకటి KTM RC 200. ఈ బైక్ ధరలు వరుసగా రూ. 1.82 లక్షలు (KTM RC 125) మరియు రూ. 2.09 లక్షలు (KTM RC 200). ఈ కొత్త బైక్స్ చాలా వరకు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

RC 125 మరియు RC 200 బైక్స్ లాంచ్ చేసిన KTM: వివరాలు

KTM కంపెనీ ఈ కొత్త బైక్‌ల బుకింగ్స్ కూడా ప్రారంభించింది, కావున కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా కంపెనీ ఈ కొత్త బైకుల యొక్క ఉత్పత్తిని కూడా ప్రారంభించింది, కావున త్వరలో షోరూమ్‌లకు పంపిణీ చేయబడుతుంది.

RC 125 మరియు RC 200 బైక్స్ లాంచ్ చేసిన KTM: వివరాలు

KTM RC 125 మరియు KTM RC 200 బైకులు రెండూ కూడా చాలా మంచి డిజైన్ కలిగి ఉండి, చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఈ బైకులు పూర్తిగా ఏరోడైనమిక్ గా ఉంటాయి. ఇవి పూర్తిగా సర్దుబాటు చేయగల హ్యాండిల్‌బార్‌లతో స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించబడి ఉంటాయి. వీటిలో కొత్త ఎల్సిడి డిస్‌ప్లే ఉంటుంది.

RC 125 మరియు RC 200 బైక్స్ లాంచ్ చేసిన KTM: వివరాలు

RC 200 బైక్ లో ఎల్ఈడీ హెడ్‌లైట్, RC 125 లో కొత్త హాలోజన్ హెడ్‌లైట్స్ ఉన్నాయి. ఈ బైక్‌లలో కొత్త ఏబీఎస్ సూపర్‌మోటో మోడ్‌తో ఇవ్వబడింది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ 9.5 లీటర్ల నుండి 13.7 లీటర్లకు పెరిగింది. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అయిన RC శ్రేణిలో కంపెనీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్‌ను ఇన్‌స్టాల్ చేసింది. కావున ఎక్కువ టార్క్ అందించడానికి సహాయపడుతుంది.

RC 125 మరియు RC 200 బైక్స్ లాంచ్ చేసిన KTM: వివరాలు

ఏ కొత్త బైకులలోని ఇంజిన్‌ను చల్లబరచడంలో సహాయపడే కొత్త రేడియేటర్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్స్ లో విండ్‌స్క్రీన్ కూడా ఇన్‌స్టాల్ చేయబడింది. వెనుక భాగం కూడా పునఃరూపకల్పన చేయబడింది. ఇందులో అల్యూమినియం మరియు స్ప్లిట్ పిలియన్ గ్రాబ్ ఇవ్వబడింది.

RC 125 మరియు RC 200 బైక్స్ లాంచ్ చేసిన KTM: వివరాలు

ఈ కొత్త కెటిఎమ్ బైకులలో సస్పెన్షన్ కోసం ముందువైపు 43 మిమీ యుఎస్‌డి ఫోర్క్‌లను మరియు మోనోషాక్ యూనిట్ ఉంటుంది. వెనుక వెనుక వైపున బ్రేస్డ్ అల్లాయ్ స్వింగార్మ్‌ పొందుతుంది. ఇది అద్భుతమైన బ్రేకింగ్ సెటప్ పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్‌లను మరియు వెనుకవైపు 230 మిమీ బైబ్రె కాలిపర్స్ ఉంటాయి.

RC 125 మరియు RC 200 బైక్స్ లాంచ్ చేసిన KTM: వివరాలు

ఇవి మాత్రమే కాకుండా ఈ RC సిరీస్‌లో కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ ఓపెన్ హబ్‌లు మరియు తక్కువ స్పోక్స్‌తో అమర్చబడ్డాయి. RC 125 బరువు 3.4 కిలోలు మరియు RC 200 బరువు 1 కేజీ వరకు తగ్గించబడింది. అయితే ఈ వరుసలోనే కంపెనీ తన RC 390 మోడల్ ను త్వరలో భారత మార్కెట్ కోసం తీసుకువచ్చే అవకాశం ఉంటుంది..

RC 125 మరియు RC 200 బైక్స్ లాంచ్ చేసిన KTM: వివరాలు

KTM యొక్క RC 200 బైక్ ప్రస్తుతానికి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది, కానీ RC 125 బైక్ నవంబర్‌లో అందుబాటులోకి వస్తుంది. అయితే, ఈ రెండవ తరం మోడల్ వచ్చే ఏడాది నుండి ప్రపంచ మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. భారత మార్కెట్లో 10 సంవత్సరాల సంతోషాన్ని పురస్కరించుకుని, కంపెనీ ఈ బైక్‌లను ప్రత్యేక ధరతో తీసుకువచ్చింది.

RC 125 మరియు RC 200 బైక్స్ లాంచ్ చేసిన KTM: వివరాలు

ఈ KTM బైక్‌లు 24,000 డౌన్ పేమెంట్ చెల్లించడం ద్వారా వివిధ ఫైనాన్స్ స్కీమ్‌లను పొందవచ్చు. KTM యొక్క RC రేంజ్ బైక్ కంపెనీ యొక్క ప్రసిద్ధి చెందిన శ్రేణి. చాలా మంది వినియోగదారులు దాని ఎంట్రీ లెవల్ మోడల్‌ను ఇష్టపడతారు, కాబట్టి కంపెనీ దీనిని దృష్టిలో ఉంచుకుని వారికి కొత్త అప్‌డేట్‌లను అందించింది. 2014 తర్వాత కంపెనీ మొదటిసారిగా RC ప్లాట్‌ఫాంను అప్‌గ్రేడ్ చేసింది.

RC 125 మరియు RC 200 బైక్స్ లాంచ్ చేసిన KTM: వివరాలు

KTM RC 390 విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ఫొటోలు ఇటీవల ఇంటర్నెట్‌లో కనిపించాయి. ఇందులో భాగంగానే డిజైన్ గురించి కొంత సమాచారంవెల్లడయ్యింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఈ కొత్త KTM RC 390 ఇంజిన్‌లో ఎలాంటి మార్పు కనిపించదు. KTM చాలా కాలంగా శ్రేణిని అప్‌డేట్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో కొత్త కెటిఎమ్ బైక్స్ విడుదలయ్యాయి. అయితే ఈ పండుగ సీజన్లో ఎలాంటి అమ్మకాలతో ముందుకు సాగుతుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
New ktm rc 125 rc 200 launched in india price features engine details
Story first published: Wednesday, October 13, 2021, 19:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X