2021 F3 రోసో సూపర్‌స్పోర్ట్ బైక్ ఆవిష్కరించిన ఎంవి అగస్టా; వివరాలు
ఇటలీకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎంవి అగస్టా ఇటీవల తన మిడిల్ వెయిట్ సూపర్‌స్పోర్ట్ ఎఫ్3 రోసో బైక్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త 2021 ఎంవి అగస్టా ఎఫ్3 రోసో సూపర్‌స్పోర్ట్ బైక్ ఇప్పుడు అనేక లేటెస్ట్ అప్డేట్స్ కలిగి ఉంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త 2021 ఎంవి అగస్టా ఎఫ్3 రోసో సూపర్‌స్పోర్ట్ బైక్‌లోని అతిపెద్ద అప్‌గ్రేడ్ ఏమిటంటే, ఇందులో ఉన్న ఇంజిన్. ఇది యూరో 5 కాలుష్య నియమాలకు అనుగుణంగా అప్డేట్ చేయబడింది. ఈ బైక్ 798 సిసి, ఇన్లైన్ త్రీ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ సెటప్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ 13,000 ఆర్‌పిఎమ్ వద్ద 145 బిహెచ్‌పి శక్తిని మరియు 10,100 ఆర్‌పిఎమ్ వద్ద 87 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

యూరో 5 కాలుష్య నియమాలకు అనుగుణంగా అప్డేట్ కాకముందు ఎంవి అగస్టా ఎఫ్ 3 రోసో బైక్‌లోని ఇంజన్ 13,000 ఆర్‌పిఎమ్ వద్ద 146 బిహెచ్‌పి మరియు 10,600 ఆర్‌పిఎమ్ వద్ద 88 ఎన్ఎమ్ ఉత్పత్తి చేసింది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ క్విక్-షిఫ్ట్ ఈఏఎస్ 3.0 ద్వి-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో అమర్చబడి ఉంటుంది.

ఈ కొత్త సూపర్‌స్పోర్ట్ బైక్‌లో ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్ ఉన్నాయి. ఇందులో ఎబిఎస్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉన్నాయి. కాక్‌పిట్‌లో బ్లూటూత్-కనెక్టివిటీతో 5.5 ఇంచెస్ టిఎఫ్‌టి డిస్‌ప్లే ఉంది. ఇది వాహనదారునికి కావలసిన సమాచారాన్ని అందిస్తుంది.

ఇది ఎంజి రైడ్ అప్లికేషన్‌తో పనిచేస్తుంది. కొత్త ఎంవి అగస్టా ఎఫ్ 3 రోసో సూపర్‌స్పోర్ట్ బైక్ యొక్క స్టైలింగ్ మొత్తం దాన్ని పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది. కావున ఈ కొత్త బైక్ లో స్టైలింగ్ పరంగా ఎటువంటి అప్డేట్స్ నిర్వహించబడలేదు.

ఈ బైక్‌లో సింగిల్-పాడ్ హెడ్‌లైట్లు, రియర్-వ్యూ మిర్రర్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్, ఫుల్-ఫెయిరింగ్ డిజైన్, స్ప్లిట్-స్టైల్ సీట్లు, ట్రిపుల్-అవుట్ ఎగ్జాస్ట్ బాక్స్ మరియు సింగిల్ సైడెడ్ స్వింగార్మ్ వంటివి ఉన్నాయి.

కొత్త 2021 ఎంవి అగస్టా ఎఫ్ 3 రోసో సూపర్‌స్పోర్ట్ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దాని ముందు భాగంలో మార్జోరీ అప్ సైడ్‌ఫోర్క్ మరియు వెనుక భాగంలో సాచ్స్ మోనో-షాక్ సెటప్ ఉన్నాయి. ఇవన్నీ ఈ బైక్ యొక్క సామర్థ్యాన్ని మరింత పెంచడానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ కొత్త బైక్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో ట్విన్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో సింగిల్ రోటర్ మరియు బ్రెంబో బేస్డ్ కాలిపర్లు ఉన్నాయి. ఈ బైక్ లో మంచి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉంటాయి. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇది త్వరలో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల కానుంది. కానీ భారతదేశంలో లాంచ్ అవుతుందా అనే విషయం గురించి ఖచ్చితమైన సమాచారం లేదు.


Click it and Unblock the Notifications








