ఉత్పత్తిలో లక్ష యూనిట్లు దాటిన 2021 Royal Enfield Classic 350.. డిమాండ్ మామూలుగా లేదుగా..!!
ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క క్లాసిక్ 350 బైక్ ఇటీవల కొత్త అవతార్‌లో మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఏకంగా ఒక లక్ష యూనిట్ల ఉత్పత్తిని దాటింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350(Royal Enfield Classic 350) యొక్క కొత్త మోడల్ 2021 సెప్టెంబర్ నెలలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ అతితక్కువ సమయంలోనే కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లింది. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విజయం. ప్రస్తుతం దేశంలో కంపెనీ చాలా అడ్డంకులను ఎదుర్కొంటున్నప్పటికీ ఇది ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 భారత్‌తో పాటు యూరప్, దక్షిణాసియా, ఆస్ట్రేలియా మరియు దక్షిణ అమెరికాలో విక్రయించబడుతోంది. ఇది భారతీయ మార్కెట్‌లో కంపెనీ ఎక్కువ సంఖ్యలో విక్రయించిన బైక్ కూడా. ఈ కారణంగానే కంపెనీ ఈ బైక్ యొక్క ఉత్పత్తి సంఖ్యను ఎక్కువ వేగంగా చేస్తోంది. అయినప్పటికీ బుక్ చేసుకున్న వినియోగదారులు దీనికోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వస్తోంది.

కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 (2021 Royal Enfield Classic 350) బైక్ రూ. 1.84 లక్షల ధర వద్ద ప్రారంభించబడింది. 2021 Royal Enfield Classic 350 బైక్ ఇప్పుడు దేశీయ మార్కెట్లో 5 వేరియంట్లలో తీసుకురాబడింది.

Classic 350 బైక్ రౌండ్ హెడ్‌లైట్ మరియు రెండు సైడ్ లైట్లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రౌండ్ టిఎఫ్‌టి స్క్రీన్, స్పీడోమీటర్ క్రింద చిన్న ఎల్‌ఇడి స్క్రీన్ వంటివి కలిగి ఉంటుంది. అయితే ఇందులోని హెడ్‌లైట్, టైల్ లైట్ మరియు ఇండికేటర్ వంటివాటితో హాలోజన్ బల్బులు ఉపయోగించబడ్డాయి.

2021 Royal Enfield Classic 350 బైక్ ఎగ్జాస్ట్ క్రోమ్, గుండ్రని రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్యూయల్ ట్యాంక్ వంటివి మునుపటి మోడల్ లో మాదిరిగానే ఉంటుంది. ఫ్రంట్ మడ్‌గార్డ్ మధ్యలో రెడ్ లైన్‌తో క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. ఇంధన ట్యాంక్‌లో కూడా దీనిని గమనించవచ్చు. ఈ బైక్ యొక్క సీట్లు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త Classic 350 బైక్ 13-లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఒక లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కావున ఒక ఫుల్ ట్యాంక్ తో ఈ బైక్ 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఇందులోని బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది, ఈ బైక్ ముందు భాగంలో ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 270 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఈ బైక్‌లో ఏబీఎస్ కూడా స్టాండర్డ్‌గా అందించబడింది. వేరియంట్‌ను బట్టి సింగిల్ ఛానల్ లేదా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఎంచుకునే అవకాశం కస్టమర్లకు లభిస్తుంది.

కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

కొత్త బైక్ మునుపటికంటే కూడా అద్భుతమైన మరిన్ని కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ క్రోమ్ రెడ్, డార్క్ స్టీల్త్ బ్లాక్, సిగ్నెల్స్ మార్స్ గ్రే, హాల్సియన్ గ్రీన్ మరియు రెడ్డిచ్ గ్రీన్ మొదలైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఈ కొత్త బైక్ లో ట్విన్-డౌన్‌ట్యూబ్ స్పైన్ చాసిస్ దాని పాత సింగిల్ డౌన్‌ట్యూబ్ చాసిస్ స్థానంలో ఉపయోగించబడింది. కావున దీని బరువు 195 కిలోల వరకు ఉంటుంది. ఈ బైక్ లో సస్పెన్షన్ సెటప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు ఎక్కువ వైబ్రేషన్ అనిపించదు, తద్వారా మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కొత్త Royal Enfield Classic 350 బైక్ Honda Highness CB350, Jawa వంటి వాటికి మాత్రమే కాకుండా Royal Enfield Meteor 350 కి కూడా ప్రత్యర్దిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








